ఇండియన్ ఫుడ్ లో మసాలా దినుసులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇవే మన ఫుడ్ ను టేస్టీగా చేస్తాయి కాబట్టి. ఈ మసాలా దినుసుల్లో ఎండు మిరపకాయలు ఒకటి. ఇది ఆహారాన్ని టేస్టీగా చేయడంతో పాటుగా ఘాటైన వాసన వచ్చేలా కూడా చేస్తాయి. ప్రతి ఒక్కరూ రోజూ ఎండుమిర్చి పొడిని వాడుతుంటారు. పిజ్జా, పాస్తా వంటి వంటకాల్లో కూడా ఎర్ర మిరపకాయలను వేస్తుంటారు. నిజానికి ఎర్ర మిరపకాయలు మన ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగిస్తాయి. అలాగని వీటిని మరీ ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎండు మిరపకాయలను ఎక్కువగా తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నోరు, గొంతు చికాకు
ఎండు మిరపకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోరు, గొంతులో చికాకు కలుగుతుంది. అలాగే ఇది దురదకు కూడా కారణమవుతుంది. అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది. మిరపపొడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అన్నవాహిక కాలిపోతుంది.
గుండెల్లో మంట
మిరపపొడిని ఎక్కువగా తినడం వల్ల పొట్ట ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎర్ర మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ కడుపు పొరను చికాకు పెడుతుంది. ఇది గుండెల్లో మంట లేదా ఎసిడిటీ సమస్యలను కలిగిస్తుంది.
జీర్ణ సమస్యలు
ఎండుమిర్చి పొడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి, తిమ్మిర్లు, చంచలత వంటి సమస్యలు వస్తాయి. ఇది మన జీర్ణశక్తిపై ప్రభావం చూపుతుంది. ఇది కొన్నికొన్ని సార్లు విరేచనాల సమస్యలకు కూడా కారణమవుతుంది.
అలెర్జీ
ఎర్ర మిరపకాయలకు అలెర్జీ ఉన్నవారు దీన్ని తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది చర్మంలో దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను కలిగిస్తుంది.
నోటి పుండ్లు
ఎండు మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల నోటి పూత సమస్య వస్తుంది. దీనివల్ల చాలాసార్లు నోరు లేదా నాలుక కాలిపోతుంది. దీని వల్ల ఫుడ్ టేస్టీగా ఉండదు.
బాడీ హీట్ పెరుగుతుంది
ఎండు మిరపకాయలు వేడి స్వభావాన్ని కలిగిస్తాయి. అంటే మిరపపొడిని ఎక్కువగా తీసుకుంటే శరీర వేడి బాగా పెరుగుతుంది.
జలుబు, దగ్గు
ఎండుమిర్చి తినడం వల్ల గొంతు సమస్య బాగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జలుబును, దగ్గును పెంచే అవకాశం ఉంది.