ఈ పచ్చి పెసర పప్పును 15 రోజులు రెగ్యులర్ గా తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 8, 2024, 7:05 AM IST

పచ్చి పెసరపప్పును చాలా మంది మొలకలుగా ఉదయాన్నే తింటుంటారు. ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా.. ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. 
 

మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తింటే ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. అదే మీరు చెడు  ఆహారాలను తింటే గనుక లేనిపోని రోగాలు వస్తాయి. మన శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. 

అయితే మీరు మీ ఆహారంలో 15 రోజుల పాటు పచ్చి కాయధాన్యాలను చేర్చుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా పెసరపప్పును. అవును పెసర పప్పు మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పెసర పప్పు

పచ్చి పెసర పప్పులో ప్రోటీన్లు, రకరకాల విటమిన్లు, మాంగనీస్, రాగి, పొటాషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో ఎన్నో పోషక, ఖనిజ లోపాలను పోగొడతాయి. మీరు గనుక ఈ కాయధాన్యాన్ని 15 రోజుల పాటు కంటిన్యూగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే? 

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

మన రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. లేదంటే మనకు దగ్గు, జలుబుతో పాటుగా లేనిపోని రోగాలు అంటుకుంటాయి. అయితే మీరు ఈ పెసరపప్పును 15 రోజుల పాటు మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మీ శరీరానికి సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. 
 


బరువు నియంత్రణ

ఈ ఆకుపచ్చ కాయధాన్యాలలో కొవ్వులు, కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పచ్చి పెసరపప్పును తినడం వల్ల ఆరోగ్యానికి పాడు చేసే అనారోగ్యకరమైన ఆహారాన్ని తినాలనే మీ కోరిక తగ్గుతుంది. ఇది మీ బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన చర్మం

మీ రోజువారి ఆహారంలో పచ్చి పెసరపప్పును చేర్చుకోవడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎన్నో  చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జీర్ణక్రియకు మంచిది

ఈ పచ్చి కాయధాన్యాలను మీరు ఒక 15 రోజుల పాటు మీరోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. 

ఆరోగ్యకరమైన గుండె 

పీచు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉండే పచ్చి పెసరపప్పును తినడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా చాలా వరకు తగ్గుతాయి. ఇది మీ బరువును తగ్గించడానికి సహాయపడతాయి.

దీన్ని ఎలా తినాలి? 

ఒక చిన్న గిన్నెలో పచ్చి పెసరపప్పును తీసుకుని మొలకెత్తేలా చేయండి. ఈ మొలకలను రోజూ ఉదయాన్నే తినండి.

Latest Videos

click me!