రోజూ నిమ్మరసం తాగడం మంచిదేనా?

First Published Jun 13, 2024, 10:06 AM IST

కాలాలతో సంబంధం లేకుండా ప్రతిరోజూ నిమ్మరసాన్ని తాగుతుంటారు. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చాలా మంది బరువు తగ్గాలనే నిమ్మరసాన్ని ఎక్కువగా తాగుతుంటారు. కానీ నిమ్మరసాన్ని రోజూ తాగితే ఏమౌతుందో తెలుసా? 

lemon water

ఎండాకాలంలో క్షణాల్లో తయారుచేయగలిగే డ్రింక్ లెమన్ వాటర్.  ఇది మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. లెమన్ వాటర్ తాగితే బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. చాలా మంది బరువు తగ్గడానికే లెమన్ వాటర్ ను ఎక్కువగా తాగుతుంటారు. కానీ దీన్ని మోతాదుకు మించి తాగితే మాత్రం లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అసలు లెమన్ వాటర్ ను ఎక్కువగా తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

నీటి కొరత

నిమ్మరసాన్ని తాగితే బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. కానీ ఎక్కువగా తాగితే మాత్రం శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అవును లెమన్ వాటర్ ను ఎక్కువగా తాగితే తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల మీ శరీరం నుంచి నీరు ఎక్కువగా బయటకు వెళుతుంది. అలాగే ఎలక్ట్రోలైట్స్, సోడియం వంటి మూలకాలు కూడా మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు పోతాయి. ఇది కొన్ని కొన్ని సార్లు నిర్జలీకరణానికి కూడా కారణమవుతుంది.
 

దంత క్షయం

నిమ్మకాయ నిజానికి మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ నోటి ఆరోగ్యం ప్రభావితమవుతుంది. మీకు తెలుసా? లెమన్ వాటర్ ను ఎక్కువగా తాగితే దంత క్షయం సమస్య వస్తుంది. ఆమ్ల స్వభావం వల్ల ఇది దంతాలలో సున్నితత్వాన్ని కలిగిస్తుంది. అందుకే మీ దంతాలు, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిమ్మరసం ఎక్కువగా తాగకూడదు. 
 

రాళ్ల సమస్య

నిమ్మకాయలో సిట్రస్ ఆమ్లంతో పాటుగా ఆక్సలేట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ నిమ్మరసాన్ని ఎక్కువగా తాగడం వల్ల అది శరీరంలో స్ఫటికాల రూపంలో పేరుకుపోవడం ప్రారంభిస్తుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లొచ్చే ప్రమాదాన్ని చాలా వరకు పెంచుతుంది. 
 

బలహీనమైన ఎముకలు

నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. దీన్ని ఎక్కువగా తాగడం వల్ల ఎముకల్లో నిల్వ ఉన్న కాల్షియం వేగంగా తగ్గి మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వస్తుంది. దీనివల్ల మీకు బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నిమ్మకాయను ఎక్కువగా తినకూడదు. 
 

Latest Videos

click me!