చాణక్య నీతి ప్రకారం.. చేతినిండా డబ్బులుండాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి

First Published | Jul 5, 2024, 1:30 PM IST

కొంతమంది ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. అయినా చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. అవసరానికి డబ్బు ఉండక తిప్పలు పడుతుంటారు. చాణక్య నీతి ప్రకారం.. మీరు గనుక కొన్ని చిట్కాలను ఫాలో అయ్యారంటే మీ చేతినిండా డబ్బు ఉంటుంది.

ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్న పొదుపు చేస్తారు. అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా.. వాటిని ఎదుర్కోగలమనే ధైర్యం ఉంటుంది. నిజానికి మన పొదుపులే మనల్ని అప్పుల నుంచి కాపాడుతాయి. కానీ కొందరికి ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలబడదు. అలాగే వీరు ఎంత కష్టపడినా డబ్బును ఆదా చేయడం కష్టంగా ఉంటుంది. 

చాలా మంది ఒక రూపాయి పొదుపు చేస్తే.. ఐదు రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. మనం చేసే పొరపాట్లే ఇందుకు కారణం. పురాతన భారతీయ పండితులలో ఒకరైన చాణక్యుడు డబ్బు ఆదా చేయడానికి కష్టపడుతున్న వారు ఏమి చేయాలో వివరించాడు. అదేంటో ఇప్పుడు తెలుకుందాం పదండి. 
 


చాణక్యుడు.. చేతిలో డబ్బు నిలవడానికి ఒక సాధారణ ఆరాధనను చెప్పాడు. చేతిలో డబ్బు నిలవడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన చాలా అసవరం. మహాలక్ష్మిని పూజిస్తే డబ్బు ఆదా అవుతుంది. అంతకంటే ముందు చాణక్యుడి కొన్ని విషయాలను పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. మరి సంపదను ఎలా పొదుపు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

పొదుపు చేయాలంటే మీ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా కంగారు పడకుండా వాటిని ఆలోచించి పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని చాణక్యుడు చెప్తాడు. ఎప్పుడూ గొడవలు జరిగే ఇంట్లో మహాలక్ష్మీ ఉండదు. లక్ష్మీదేవి నివసించని ఇంట్లో సంపద ఎప్పటికీ పెరగదు. 
 

సుఖసంతోషాలతో లేనివారి ఇంట్లో కూడా లక్ష్మిదేవి నివసించదు. దీనివల్ల మీ ఇంట్లో సంపద ఎప్పటికీ ఉండదు. మీరు డబ్బు ఆదా చేయాలనుకుంటే గొప్పలు చెప్పుకోకూడదు. అలాగూ ఇంత సంపాదించాను. అంత సంపాదించానని డబ్బు గురించి గొప్పలు చెప్పుకోవడం మానుకోండి. డబ్బుపై ప్రేమ ఎప్పుడూ డబ్బును ఉండనివ్వదు. ఆదాయాన్ని  అన్యాయంగా సంపాదించకూడదు. అహంకారం మీ సంపదను తగ్గిస్తాయి. దీన్ని నివారించుకుంటే కచ్చితంగా మీ చేతిలో డబ్బులు ఉంటాయి. 

Latest Videos

click me!