పిల్లల స్కూల్ లంచ్ బాక్స్ నుంచి మనం వాడే వాటర్ బాటిల్ వరకు.. మన ఇంట్లో చాలా వరకు ప్లాస్టిక్ వస్తువులే ఎక్కువగా ఉంటాయి. మన జీవితంలో ఎక్కడ చూసినా ప్లాస్టికే ఉంటుంది. సాధారణంగా పిల్లల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఎంతో పట్టించుకుంటారు. కానీ తెలిసి తెలిసి ఆరోగ్యానికి మంచిది కాదనే సంగతి తెలిసినా వారి లంచ్ ప్లాస్టిక్ బాక్స్ లోనే పెడతారు. కానీ ఇలా పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఒక్క పిల్లలే కాదు.. ఎవ్వరూ కూడా ప్లాస్టిక్ లంచ్ బాక్సులను వాడకూడదు. ప్లాస్టిక్ బాక్సులు అందంగా ఉన్నా.. తక్కువ ధరకే వచ్చినా.. వీటిని వాడితే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్లాస్టిక్ లంచ్ బాక్స్ లను ఎందుకు ఉపయోగించకూడదు?
హార్మోన్ల అసమతుల్యత
బిస్ఫెనాల్ అనేది ఎన్నో ప్లాస్టిక్ ఉత్పత్తులలో ఉండే రసాయనం. అయితే ఇది హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి ఆరోగ్యం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది.
ఆరోగ్య సమస్యలు
ప్లాస్టిక్ పాత్రల్లో వేడి వేడి ఆహారం లేదా నీళ్లను ఉంచడం వల్ల ప్లాస్టిక్ రసాయనాలు ఆహారంలోకి విడుదల అవుతాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తాయి. అంతేకాకుండా ప్లాస్టిక్ పాత్రలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్లాస్టిక్ కణాలు విచ్ఛిన్నమై మైక్రోప్లాస్టిక్ కణాలు ఏర్పడతాయి. ఇవి మన శరీరంలోకి వెళ్లి ఎన్నో ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
థైరాయిడ్
మీరు రోజూ తినడానికి లేదా నీళ్లు తాగడానికి ప్లాస్టిక్ పాత్రలను ఉపయోగిస్తే మీకు థైరాయిడ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాదు ప్లాస్టిక్ లో ఉండే కొన్ని కెమికల్స్ కూడా స్కిన్ అలర్జీలకు కారణమవుతాయి. వేడి వేడి ఫుడ్ ను ప్లాస్టిక్ కంటైనర్ లో ప్యాక్ చేస్తే ప్లాస్టిక్ కరిగిపోతుంది. దీంతో అందులో బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.
వింత రుచి, వాసన
ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులను, ప్లాస్టిక్ వాటర్ బాటిల్లను చాలా కాలంలగా ఉపయోగిస్తున్నట్టైతే వాటిలో ఉంచిన ఆహారం లేదా నీళ్ల నుంచి ఒక వింతైన వాసన వస్తుంది. అంతేకాదు వాటి రుచి కూడా మారుతుంది. ఇది ఫుడ్ ను పాడుచేస్తుంది.