రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తింటే ఏమౌతుంది?

First Published | Nov 5, 2024, 12:38 PM IST

వెల్లుల్లిని మనం రాత్రి పడుకునే ముందు తింటే ఏమౌతుందో  తెలుసా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

వెల్లుల్లిని దాదాపు అందరూ తమ ఇంట్లో వంటల్లో వాడుతూనే ఉంటారు. వెల్లుల్లిని చేర్చడం వల్ల వంటకు రుచి పెరుగుతుంది. పచ్చి వెల్లుల్లి రుచిని మాత్రమే కాదు.. మనకు  చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ సహాయం చేస్తుంది. మరి.. ఈ వెల్లుల్లిని మనం రాత్రి పడుకునే ముందు తింటే ఏమౌతుందో  తెలుసా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

వెల్లుల్లిలో పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్, జింక్ , ఫోలేట్; కాపర్,  విటమిన్ ఈ, విటమిన్ బి6, విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి.

రాత్రి పడుకునే ముందు కనుక ఈ వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల  ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంటుందట. మన శరీరంలోని  ఫ్యాట్ ని సులభంగా  కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. దాని కారణంగానే ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

Latest Videos


అంతేకాదు.. రోజూ రాత్రిపూట వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల.. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల  మనం చాలా రకాల జబ్బుల బారినపడకుండా, ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తుంది. సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ వెల్లుల్లి  హెల్ప్ చేస్తుంది.

రాత్రి పడుకోవడానికి  రెండు, మూడు గంటల ముందు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల  మన మెదడు చురుకుగా పని చేస్తుంది. ఇంకోమాటలో చెప్పాలి అంటే… తెలివి తేటలు పెరగడానికి కూడా సహాయం చేస్తుంది. ఆలోచనలు మరింత మెరుగ్గా ఉంటాయి. జ్నాపకశక్తి కూడా పెరుగుతుంది.

వర్షాకాలం, చలికాలం వస్తే చాలు మనలో చాలా మందికి జలుబు, జ్వరం, దగ్గు లాంటివి వస్తూ ఉంటాయి. అందుకే.. రాత్రి పడుకోవడానికి రెండు, మూడు గంటల ముందు వెల్లిల్లి రెబ్బలను తినడం వల్ల… జలుబు, దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది.

మన శరీరంలో కాల్షియం తగ్గిపోవడం మొదలుపెట్టినప్పుడు ఎముకలు బలహీనంగా మారిపోతాయి. అప్పుడు మోకాళ్ల నొప్పులు రావడం మొదలౌతాయి. అయితే… ఈ వెల్లుల్లి తినడం మొదలుపెడితే  ఆ సమస్య రాకుండా ఉంటుంది.

అంతేకాదు.. నోటి ఆరోగ్యాన్ని  కాపాడటంలోనూ వెల్లుల్లి సహాయం చేస్తుంది. క్యావిటీస్ రాకుండా ఉంటాయి. నోటి చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

click me!