రోజుకు రెండుసార్లు బ్రష్ చేసినా నోట్లో నుంచి వాసన వస్తుందా? అయితే సమస్య ఉన్నట్టే..!

First Published | Feb 7, 2024, 3:47 PM IST

రోజుకు రెండు సార్లు బ్రష్ చేసే అలవాటు చాలా మంచిది. ఎందుకంటే ఇది నోటిని శుభ్రంగా ఉంచుతుంది. అలాగే నోటి నుంచి దుర్వాసన రాకుండా చేస్తుంది. కానీ కొంతమందికి మాత్రం సరిగ్గా బ్రష్ చేసినా కూడా నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటి వారు హాస్పటల్ కు వెల్లడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది కొన్ని వ్యాధులకు సంకేతం. 
 

నోటి దుర్వాసన చిన్న సమస్యగా అనిపించినా.. ఇది నలుగురిలో నవ్వకుండా, మాట్లాడకుండా, దగ్గరగా ఉండకుండా చేస్తుంది. సాధారణంగా నోటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్లే నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది. నిపుణుల ప్రకారం.. నోటి దుర్వాసన కేవలం నోటి పరిశుభ్రతకు సంబంధించింది మాత్రమే కాదు. చాలా మంది నోట్లో నుంచి చెడు వాసన రావొద్దని రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తుంటారు. మౌత్ వాష్ ను కూడా ఉపయోగిస్తుంటారు. అయినా నోట్లో నుంచి దుర్వాసన రావడం మాత్రం ఆగదు. ఎందుకంటే ఇది పళ్లను క్లీన్ చేయడానికి సంబంధించింది కాదు కాబట్టి. 
 

నోటిని సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఇది సహజం. రోజుకు రెండు సార్లు పళ్లను తోమినా అలాగే నోట్లో నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది? దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


ప్రతి రోజూ పళ్లను తోముకోవాలి. ఫ్లోసింగ్ చేయాలి. ఖచ్చితంగా నాలుకను క్లీన్ చేయాలి. ఇవన్నీ చేస్తే నోటి నుంచి చెడు వాసన రానే రాదు. ఒకవేళ వస్తే మాత్రం మీకు ఏవైనా అనారోగ్య సమస్యలున్నాయేమో చెక్ చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ అలవాటు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. అందుకే ఈ అలవాటును మానుకోవాలి. 
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నోట్లో లాలాజలం లేకపోవడం, నోరు పొడిబారడం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. కొంతమందికి కొన్ని మందుల వాడకం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అలాగే కొన్ని ఆహారాలు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి. కానీ దీన్ని తగ్గించుకోవచ్చు. కొంతమందికి చిగుళ్ల వ్యాధి కూడా దుర్వాసనకు కారణమవుతుంది. అలాగే శ్వాసకోశ వ్యాధులు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి. జీర్ణ సమస్యలు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఇది కడుపు లోపలి నుంచి వచ్చే దుర్వాసన.

ఈ సమస్యల వల్ల వచ్చే నోటి దుర్వాసనను మీరు బ్రష్ చేయడం లేదా ఫ్లోసింగ్ తో పోగొట్టలేరు. అందుకే అసలు మీ నోటి దుర్వాసనకు అసలు కారణమేంటో గుర్తించి , చికిత్స చేయించుకోవాలి. 
 

రోజంతా పుష్కలంగా నీళ్లను తాగడం, ఆరోగ్యంగా తినడం, స్మోకింగ్, ఆల్కహాల్ ను మానేయడం వంటి అలవాట్లతో నోటి దుర్వాసను తగ్గించుకోవచ్చు. అలాగే రెగ్యులర్ గా ఫ్లోసింగ్ చేయాలి. అలాగే ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ను ఉపయోగించండి. అలాగే అప్పుడప్పుడు డెంటల్ హాస్పటల్ కు వెళ్లి చెక్ చేయించుకోవడం మంచిది. చిగుళ్ల వ్యాధి, దుర్వాసనకు కారణమయ్యే ఇతర వ్యాధులను నిర్ధారించడానికి డాక్టర్ కు చూపించుకోండి. 

Latest Videos

click me!