బరువు తగ్గాలని చక్కెర బదులు బెల్లం వాడుతున్నారా? మంచిదేనా...??

First Published | Aug 30, 2021, 2:59 PM IST

నిజంగా చక్కెర బదులు బెల్లం వాడడం మంచిదేనా? బెల్లం అంత ఆరోగ్యకరమైనదేనా? నిజంగా బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుందా? లేదా చక్కెరలాగే మీ ఆరోగ్యానికి హానికరమా?

తెల్ల చక్కెర.. నిస్సందేహంగా అనారోగ్యకరమైనదే. రోజువారీ ఆహారంలో దీన్ని రకరకాలుగా వాడుతుంటాం. టీ, కాఫీ, స్వీట్లు ఇలా ప్రతీ తీపికి చక్కెరనే వాడుతాం. అయితే బరువు తగ్గాలనుకునేవారు, డైటింగ్ చేస్తున్నవారు ఈ చక్కెరకు దూరంగా ఉండాలని.. దీన్ని అవాయిడ్ చేయాలని పోషకాహార నిపుణులు, డైటీషియన్లు తరచుగా చెబుతుంటారు. 

చక్కెర అధిక బరువుకు కారణమవుతుంది. అందుకే చాలామంది ఈ స్పృహ ఉన్నవాళ్లు చక్కెరకు బదులు బెల్లాన్ని ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు. అయితే నిజంగా చక్కెర బదులు బెల్లం వాడడం మంచిదేనా? బెల్లం అంత ఆరోగ్యకరమైనదేనా? నిజంగా బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుందా? లేదా చక్కెరలాగే మీ ఆరోగ్యానికి హానికరమా? ఇప్పుడు తెలుసుకుందాం.


బెల్లంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే సంప్రదాయ పిండివంటలు, ప్రసాదాలు, నైవేద్యాల్లో ఎక్కువగా బెల్లంనే ఉపయోగిస్తారు. బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు బి 1, బి 6, సిలు అధికంగా ఉంటాయి. బెల్లంలో అనేక ఫినోలిక్ సమ్మేళనాలు కూడా ఉన్నాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కుని, రోగనిరోధక శక్తిని పెంచడానికి పనికొస్తాయి. అందుకే బెల్లం మీ ఆహారంలో చేర్చమని తరచుగా చెబుతుంటారు. 

చక్కెర కంటే బెల్లంలో పోషకాలు అధికంగా ఉంటాయా? అంటే అవును.. బెల్లంలో ఎక్కువ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కాకుండా, ఇందులో ఉండే  ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. శరీర వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ఆయుర్వేద వైద్యలు ఉదయాన్నే బెల్లం కలిపిన నీళ్లు తాగమని సిఫార్సు చేస్తుంటారు. 
అయితే బెల్లం.. చక్కెర అంత తీపీగా ఉండదు. కాబట్టి చక్కెరకంటే ఎక్కువ తీసుకుంటారు. ఉదాహరణకు, ఒక కప్పు టీ లేదా కాఫీలో ఒక చెంచా చక్కెరను కలిపితే, బెల్లం కలిపినప్పుడు చెంచాకంటే ఎక్కువే వాడుతుంటారు. 

బెల్లం మంచిదే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అయితే అలాగని మరీ ఎక్కువగా తినడం కూడా అంత మంచిది కాదు. ఎక్కువగా తినడం వల్ల ఆహారంలోని పోషకాలు అందకుండా పోవడమే కాకుండా దుష్ప్రభావాలూ ఉండే అవకాశంఉంది. ఎందుకంటే చక్కెరలో ఎన్ని క్యాలరీలు ఉంటాయో దాదాపుగా బెల్లంలోనూ అన్ని క్యాలరీలే ఉంటాయి. తీపికోసం ఎక్కువ యాడ్ చేయడం వల్ల క్యాలరీలను పెంచినట్టే అవుతుంది. ఈ విషయాన్నిగుర్తు పెట్టుకోవాలి. 

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు చక్కెరకు బదులు బెల్లం వాడతున్నట్లైతే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్త పడాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే సుక్రోజ్ బెల్లంలో ఉంటుంది. అంతేకాదు మీరు తీసుకుంటున్నది ఆర్గానిక్ బెల్లమేనా, కాదా అనే విషయాన్నీ కన్ ఫర్మ్ చేసుకోవలి. 

మీరు బరువు తగ్గే ప్రయత్నంలో బెల్లంను చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నట్లేతే.. బెల్లంతో పాటు వంటింట్లో దొరికే ఇంకొన్ని పదార్థాలను కలపడం వల్ల మీ ప్రయత్నం విజయవంతం అవుతుంది. బెల్లంతో చేసిన నిమ్మకాయరసం అలాంటి డిటాక్స్ రసాల్లో ఒకటి. 

దీన్ని ఎలా తయారు చేయాలంటే.. 
ఒక గ్లాసు నీరు
ఒక నిమ్మకాయ
చిటికెడు నల్ల ఉప్పు
ఒక చెంచా బెల్లం పొడి/ కరిగించిన బెల్లం (చిన్న ముక్క)
ఒక గ్లాసు నీటిలో,నిమ్మకాయ రసం, నల్ల ఉప్పు కలపాలి. దీనికి ఒక చెంచా బెల్లం పొడిని జోడించి.. బాగా కలిపితే బెల్లం నిమ్మరసం రెడీ. 

దీన్ని వేడిగా తాగాలనుకుంటే.. ముందుగ కొంచెం నీళ్లలో బెల్లం వేసి మరిగించాలి.. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి దీనికి కాస్త చల్లారాక నిమ్మరసం కలపి తాగొచ్చు. దీన్ని ఉదయాన్నే లేవగానే తాగొచ్చు, లేదా భోజనం తర్వాత కూడా తీసుకోవచ్చు.

sugar vs jaggery

బెల్లంలో పూర్తి పోషకాలు ఉన్నప్పటికీ, నిమ్మకాయలో అధిక విటమిన్-సి కంటెంట్ ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది, ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం నుండి విషాలను తొలగిస్తుంది. అందుకే.. ఇది ఆరోగ్యకరమైన పానీయంగా చెబుతారు. 

Latest Videos

click me!