హెచ్ ఆర్ తో జీతం మాట్లాడేటప్పుడు ఇవి ఫాలో అయితే... మీరనుకున్న సాలరీ మీ సొంతం...

First Published | Apr 29, 2022, 12:31 PM IST

జాబ్ మారుతున్నారా? కొత్త ఉద్యోగంలో చేరబోతున్నారా? హెచ్ఆర్ రౌండ్ వెళ్లబోతున్నారా? అయితే.. జీతం విషయం మాట్లాడేటప్పుడు కొన్ని టెక్నిక్స్ తెలుసుకోవాలి. అప్పుడే మీకు కావాల్సిన జీతాన్ని హెచ్ఆర్ తో ఆమోదించుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే.. 

తమ ఎక్స్ పీరియన్స్ కు తగిన జీతం లేదని చాలామంది అంటుండడం వింటుంటాం. అయితే దీనికోసం ఉద్యోగంలో చేరేప్పుడే హెచ్ఆర్ తో సరిగా మాట్లాడుకోవాలి. లేకపోతే అది మిమ్మల్ని అక్కడున్నంతకాలం బాదిస్తుంటుంది. మీ అనుభవం, స్కిల్స్, నైపుణ్యం కంటే తక్కువ జీతాన్ని వారు మీకు ఆఫర్ చేస్తే వెంటనే అహంభావానికి పోకూడదు. వారితో తెలివిగా చర్చించి ఒప్పించాలి. దానికోసం ఏం చేయాలంటే... 

రీసెర్చ్..
మీరు నిర్వర్తించే బాధ్యతలకు మార్కెట్లో ఎంత విలువ ఉంది. ఎంత జీతం తీసుకోవచ్చు. వేరే దగ్గర ఎంత ఆఫర్ చేస్తున్నారు... లాంటి రీసెర్చ్ తప్పనిసరిగా చేయాలి. ఆ తరువాత వారితో ఆ విషయాన్ని చక్కగా చర్చించాలి. మీరు మీ బాధ్యతల్ని ఎంత నిబద్ధతతో నిర్వహించగలరో చెప్పండి. కన్వీన్స్ చేయడానికి ప్రయత్నించండి. 


మీ విలువ తెలుసుకోండి
మీరు సీనియర్ అయితే, వృత్తిలో అపారమైన నైపుణ్యం కలిగి ఉంటే.. మీ విలువ మీకు తెలిసిఉండాలి. మీ అనుభవంతో మీ పనికి మీరు జోడించే అదనపు విలువను చెప్పుకొచ్చ.., నిర్దిష్ట స్థాయి జీతం కావాలని చెప్పవచ్చు. 

మీ బేసిక్ సాలరీతో మీ మొత్తం శాలరీని చూడడానికి ఒప్పుకోవద్దు. అంతేకాదు అంతకుముందు మీరు పనిచేసిన కంపెనీలో మీరు తీసుకున్న జీతంతో ఈ జీతంతో పోలికలు, చర్చలు పెట్టొద్దు. చాలామంది ఇదే తప్పు చేస్తారు. అలా కాకుండా మీ అనుభవం, పనితీరు, పనికి మీరు చేర్చే అదనపువిలువలతో కన్వీన్స్ చేయాలి. 

ఆఫర్‌ను ఎప్పుడు తిరస్కరించాలి 
మీ హైరింగ్ మేనేజర్ మీ విలువ, ఉద్యోగ పాత్రను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. మీ నెగోసియేషన్స్ పూర్తైన తరువాత కూడా మీరడిగిన జీతం ఇవ్వడానికి అస్సలు ఇష్టపడకపోతే.. అది మీకు సరైన ఉద్యోగం కాదన్న విషయం తెలుసుకోవాలి. ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించి.. వేరేది వెతుక్కోవడం మంచిది. 

Latest Videos

click me!