పుచ్చకాయను అతిగా తింటే ఈ తిప్పలు తప్పవ్ జాగ్రత్త..

Published : Apr 25, 2022, 03:26 PM IST

Watermelon Side Effects: వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకూడదంటే నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయను తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచివని మోతాదుకు మించి తినడం మాత్రం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 

PREV
17
పుచ్చకాయను అతిగా తింటే ఈ తిప్పలు తప్పవ్ జాగ్రత్త..

Watermelon Side Effects: పుచ్చకాయలు వేసవిలో పుష్కలంగా లభిస్తాయి. వీటిలో  90 శాతం నీటి కంటెంట్ ఉంటుంది. ఈ పండును తినడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశమే ఉండదు. అందుకే ఈ సీజన్ లో ఈ పండును ఎక్కువగా తింటూ ఉంటారు. 

27

వేసవిలో పుచ్చకాయలను తినడం వల్ల బాడీ కూల్ గా ఉంటుంది. అంతేకాదు ఈ పండు ఓవర్ వెయిట్ ను తగ్గించుకోవాలనుకునే వారికి బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తుంది. ఈ పండుకు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆరోగ్యానికి మంచి చేస్తుందని మోతాదుకు మించి తింటే మాత్రం తిప్పలు పడక తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ పుచ్చకాయ పండును రాత్రి సమయంలో అస్సలు తినకూడదని చెబుతున్నారు. 

37

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పుచ్చకాయను అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా  వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
 

47

పుచ్చకాయలో ఉండే ఫ్రక్టోజ్ వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇక ఈ పండును రాత్రి సమయంలో తింటే మాత్రం కడుపు ఉబ్బరం సమస్య మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు వ్యక్తులు పుచ్చకాయను అస్సలు తినకూడదు.. ఎవరెవరంటే..? 
 

57

షుగర్ లెవెల్స్ పెరుగాయి.. పుచ్చకాయాలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అదికూడా మోతాదుకు మించి తిన్నప్పుడే బ్లడ్ లో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు దీన్ని మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. 
 

67

చర్మం రంగులో మార్పులు.. పుచ్చకాయను మోతాదుకు మించి తింటూ ఉంటే రాను రాను మీ చర్మ రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల Lycopenia సమస్య బారిన పడతారట. లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ (వర్ణద్రవ్యం)వివిధ పండ్లు, కూరగాయలు ఎరుపు రంగులో ఉండటానికి కారణమవుతుంది. మన శరీరంలో ఈ వర్ణద్రవ్యం ఎక్కువ అయితే చర్మం రంగులో మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.   
 

77

బరువు పెరుగుతారు.. పుచ్చకాయలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటుగా హెల్తీగా కూడా ఉంచుతుంది. అయితే ఈ పండులో ఉండే సహజ చక్కెరలు బరువు పెరిగేందుకు కారణమవుతాయి. మోతాదులో ఈ పండును తింటే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఎక్కువగా తీసుకుంటేనే బరువు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండును రాత్రిపూట తింటేనే అధిక బరువు సమస్య బారిన పడే అవకాశముంది చెబుతున్నారు. ఈ పండును పగటి పూట తింటే ఏ సమస్య రాదట. 

click me!

Recommended Stories