water heater
ఆదివారం (ఆగస్టు 11) ప్రమాదవశాత్తు వాటర్ హీటర్ వల్ల ఓ వ్యక్తం ప్రాణాలు కోల్పోయడు. ఇది వరకు కూడా వాటర్ హీటర్ ప్రమాదాలు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే వాటర్ హీటర్ ను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వాటర్ హీటర్ వాడుతున్నప్పుడు విద్యుత్ షాక్ కొట్టకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
heater
ప్రస్తుత కాలంలో చాలా మంది వాటర్ హీటర్లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల వాటర్ తొందరగా వేడి అవుతాయి. చకాచకా స్నానం చేసేసి పనులకు వెళ్లొచ్చు అనుకుంటారు. కానీ వాటర్ హీటర్ వల్ల ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇది కరెంట్ షాక్ కు దారితీస్తుంది. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు సురక్షితంగా ఉండాలంటే మాత్రం తడి చేతులతో ఎలాంటి విద్యుత్ కనెక్షన్లు లేదా వస్తువులను ఉపయోగించకూడదు. అంటే వాటర్ హీటర్ ప్లగ్ ను పట్టుకోవడానికి ముందు మీ చేతులు పొడిగా ఉండేలా చూసుకోవాలి.
Don't use hot water
అలాగే సమస్య ఉన్న వాటర్ హీటర్ ను అస్సలు ఉపయోగించకండి. సమస్యలేమైనా ఉంటే వాటిని రిపేర్ చేయించుకున్న తర్వాతే ఉపయోగించండి. ఎలక్ట్రికల్ కేబుల్ ఒక ప్లేస్ నుంచి ప్లేస్ కు తీసుకెళ్లాలంటే మాత్రం నేలపై నీరు, తడి లేకుండా చూసుకోండి. ఎందుకంటే దీనివల్ల కరెంట్ షాక్ రాకుండా ఉంటుంది.
ఇన్సులేట్ చేయని వైర్లను తాకకూడదు. ఒకసారి వాటర్ హీటర్ వైర్ ను ప్లగ్ లో పెట్టిన తర్వాత దానిని పొరపాటున కూడా ముట్టుకోకూడదు. అలాగే నీళ్లు వేడి అయిన తర్వాత వెంటనే స్విచ్ ఆఫ్ చేసి అన్ ప్లగ్ చేయాలి. వాటర్ హీటర్ ను ప్లాస్టిక్ బకెట్ లో ఉపయోగిస్తే దానిని నేరుగా ఒక కొనలో తగిలించకూడదు. ఎందుకంటే హీటర్ వల్ల బకెట్ కరిగిపోయే అవకాశముంది. కాబట్టి ఏదైనా ఒక కర్రను ఉపయోగించి బకెట్ మధ్యలో హీటర్ ను వేలాడదీయండి.
water heater
నీళ్లు వేడైన తర్వాత వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకోండి. అలా కాకుండా హీటర్ ను ఆన్ లోనేఉంచితే నీళ్లు ఆవిరి అయ్యేలా వేడెక్కడంతో పాటు హీటర్ తో షాట్ సర్క్యూట్ అయ్యే అవకాశలుంటాయి. దీంతో విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయి.
water heater
ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాటర్ హీటర్ ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ దాని దగ్గరకు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంలో పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. ప్రస్తుతం మార్కెట్ లో షాక్ కొట్టకుండా ఉండే వాటర్ హీటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని తీసుకోవడంతో కూడా ప్రమాదాలు నివారించవొచ్చు. నాసిరకం వాటర్ హీటర్లను వాడకపోవడమే మంచింది.