నీరు మాత్రమే తాగి, బరువు తగ్గొచ్చా..?

First Published Oct 16, 2024, 2:26 PM IST

బరువు తగ్గడానికి మనకి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో కొందరు ఎక్కువగా.. ఈమధ్యకాలంలో వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నారు. మరి, ఈ వాటర్ ఫాస్టింగ్ మన ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఆ బరువు తగ్గించుకోవడానికి ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. కాగా.. ఆ మధ్య కొందరు తమ అధిక బరువు తగ్గించుకోవడానికి అవలంబిస్తున్న కొత్త రకం పద్దతి వాటర్ ఫాస్టింగ్. రీసెంట్ గా ఓ మహిళ కేవలం నీరు మాత్రమే తాగి, 14 రోజుల్లో 9 కిలోల బరువు తగ్గిందట. దీనినే వాటర్ ఫాస్టింగ్ అంటారు. వేగంగా బరువు తగ్గడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది.  కానీ.. ఇది ఆరోగ్యానికి మంచిదేనా? చేసినా, ఎన్ని రోజులు చేయవచ్చు..? దీని వల్ల లాభమా, నష్టమా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి..?

ఈ వాటర్ ఫాస్టింగ్ లో కేవలం మంచి నీరు మాత్రమే తాగుతారు. ఇతర ఎలాంటి ఆహారం ఉండదు కాబట్టి... ఈ డైట్ వల్ల వేగంగా బరువు తగ్గుతారు. అయితే.. ఈ రకంగా బరువు తగ్గడం వల్ల.. మన శరీరంలో నీరు ఎక్కువగా కోల్పోతాం. అంతేకాకుండా.. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. జీవక్రియ రేటు తగ్గడానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వాటర్ ఫాస్టింగ్ ఎవరు చేయకూడదు..?

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరూ వాటర్ ఫాస్టింగ్ చేయకూడదట. ముఖ్యంగా డయాబెటిస్, ఇతర ఆహార రుగ్మతలు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ రకం ఫాస్టింగ్  చేయడం అస్సలు మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు కూడా ఈ పద్దతిని అనుసరించకూడదట. ఇతరులు ఈ రకం వాటర్ ఫాస్టింగ్ అనుసరించి బరువు తగ్గినా.. అది శాశ్వతం అయితే కాదట. మళ్లీ ఫుడ్ తినడం మొదలుపెట్టగానే.. మళ్లీ బరువు పెరగడం మొదలౌతుందట. అందుకే.. బరువు తగ్గడానికి ఈ వాటర్ ఫాస్టింగ్ కి బదులుగా..  కష్టపడి పని చేయడం, ఆహారంలో మార్పులు చేసుకుంటే సాధ్యమౌతుందని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos


వాటర్ ఫాస్టింగ్ చేసే చాలా మంది వ్యక్తులు సాధారణ ఆహారపు అలవాట్లకు తిరిగి వచ్చిన తర్వాత తగ్గిన బరువును తిరిగి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. వాటర్ ఫాస్టింగ్ సమయంలో శరీరం గ్లైకోజెన్ , నీటి స్థాయిలను తిరిగి నింపుకోవడానికి ప్రయత్నిస్తుంది, కాబట్టి ఈ పద్ధతిని అనుసరించేవారు కొన్ని నెలల్లోనే తగ్గిన బరువును తిరిగి పొందుతారు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి , జీవక్రియకు హానికరం.

వాటర్ ఫాస్టింగ్  ప్రయోజనాలు, నష్టాలు ఏమిటి?

ఈ పద్ధతిలో నీరు మాత్రమే త్రాగాలి. ఇతర ఏమీ తినకూడదు. కాబట్టి ఇది బరువు తగ్గడానికి వేగవంతమైన మార్గంగా ఇటీవలి సంవత్సరాలలో బాగా ప్రాచుర్యం పొందింది. దాని ప్రయోజనాలు, నష్టాల గురించి ఇప్పుడు చూద్దాం.

ప్రయోజనాలు

బరువు తగ్గడం: గ్లైకోజెన్ క్షీణత , నీటి నష్టం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు: స్వల్పకాలిక ఉపవాసంలో రక్తపోటు తగ్గుదల , మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీ వంటి ప్రయోజనాలను కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

వాటర్ ఫాస్టింగ్: నష్టాలు

కండరాల నష్టం: కొవ్వుతో పాటు కండర ద్రవ్యరాశిని కూడా కోల్పోవచ్చు, ఇది మొత్తం ఆరోగ్యానికి హానికరం. ఘన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల, ఆహారంలో నీటి కొరత కారణంగా డీహైడ్రేషన్ ఒక సాధారణ సమస్య.

వాటర్ ఫాస్టింగ్ అవసరమైన విటమిన్లు , ఖనిజాల తీవ్రమైన లోపాలకు దారితీస్తుంది. దీనివల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు. సాధారణ దుష్ప్రభావాలు మైకము, అలసట, తలనొప్పి , మూర్ఛ లేదా ఇతర సమస్యల ప్రమాదం. కాబట్టి, వాటర్ ఫాస్టింగ్ స్వల్పకాలిక ప్రయోజనాలను అందించినప్పటికీ, ఇది చాలా మందికి తగినది కాదు. గణనీయమైన నష్టాలను కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్యానికి, మరింత స్థిరమైన ఆహార పద్ధతులను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

నిరాకరణ: ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. దీనిని వృత్తిపరమైన వైద్య సలహాగా పరిగణించకూడదు. ఏదైనా వైద్య పరిస్థితి గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.

click me!