ఈ డ్రై ఫ్రూట్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

Published : Jun 09, 2022, 03:48 PM IST

Dry Fruits For Heart: డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఒక డ్రై ఫ్రూట్ గుండెపోటు (Heart attack) వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.   

PREV
18
ఈ డ్రై ఫ్రూట్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

భారతదేశంలో ప్రతి ఏడాది.. గుండెపోటు (Heart attack) కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. ఒకప్పుడు వయసు మీద పడిన వారికే వచ్చే ఈ వ్యాధి ప్రస్తుత కాలంలో యువకులకు కూడా వస్తుంది. దీనిబారి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడటం అంత సులువు కాదు. 

28

మన దేశంలో చాలా మంది ఆయిలీ ఫుడ్, మసాలా ఆహారాలు, ఆనారోగ్యకమైన (Unhealthy) ఆహారాలనే తీసుకుంటున్నారు. ఇవి నోటికి రుచిగా అనిపించినా.. గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఇలాంటి పరిస్థితిలో ఒక డ్రై ఫ్రూట్ ను తినడం వల్ల గుండె జబ్బుల (Heart disease) ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అదేంటో తెలుసుకుందాం పదండి.

38

వాల్ నట్స్ (Walnuts) ఆరోగ్య ప్రయోజనాలు:  ప్రతి  డ్రై ఫ్రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నట్స్ అన్నింట్లో కల్లా బలమైన ఆహారం. ఇందులో కొవ్వు శాతం (Fat content) కాస్త ఎక్కువగానే ఉంటుంది. నూరు గ్రాముల వాల్ నట్స్ నుంచి సుమారు 64 శాతం కొవ్వు, 687 కేలరీల శక్తి లభ్యమవుతుంది. ఇందులో ప్రోటీన్లు (Proteins) 15 గ్రాములు, పిండి పదార్థాలు 11 గ్రాములు ఉంటాయి.

48

ఇందులో విటమిన్లు (Vitamins), కాల్షియం, పొటాషియం (Potassium), సోడియం, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. 
 

58

 ఇందులో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ (Good cholesterol) శాతాన్ని పెంచుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని (Heart health) మెరుగుపరుస్తాయి. గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇలాంటి దానిని ఆరోగ్యంగా ఉంచడానికి పోషకలా కొరత అస్సలు ఉండకూడదు. 
 

68

వాల్ నట్స్ స్టెరాల్స్, మొక్కల ఆధారిత ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప వనరుగా పరిగణించబడతాయి. ఇందులో లినోలెనిక్ ఆమ్లం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే  రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఆ తర్వాత గుండెపోటు (Heart attack), గుండె సంబంధిత వ్యాధుల(Cardiovascular diseases)ప్రమాదం పెరుగుతుంది. శాఖాహారులకు వాల్ నట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే దీనిలో ఒమేగా-3, కొవ్వు ఆమ్లాలు పోషకాలను భర్తీ చేస్తాయి.
 

78

వాల్ నట్స్ లో ఫైబర్, ఖనిజాలు, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైనన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గడమే కాదు టైప్ 2 డయాబెటీస్ ను వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. 

88

వాల్ నట్స్ ను ఎక్కువగా తినడం ప్రమాదకరం: వాల్ నట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. దీనిని మోతాదుకు మించి అస్సలు తినకూడదు.  బలహీనంగా ఉన్నవాళ్లు 10 నుంచి 12 వాల్ నట్స్ ముక్కలను తినొచ్చు. అయితే ఆరోగ్యంగా ఉన్నన వాళ్లు మాత్రం 6 నుంచి 7 ముక్కలను మాత్రమే తినొచ్చు. దీనికంటే ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. గుండె జుబ్బులు ఉన్న వాళ్లు 2 నుంచి  4 వాల్ నట్స్ ముక్కలను మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవసరానికి మించి తింటే శరీరంలో కేలరీలు పెరిగి.. అనారోగ్యం బారిన పడతారు. 

 

click me!

Recommended Stories