ఏ వయసు వారు ఎంత సేపు వాకింగ్ చేయాలో తెలుసా?

First Published | Oct 4, 2024, 9:49 AM IST

వాకింగ్ అనేది ఎవరైనా చేయగల సింపుల్ వ్యాయామం. దీనిని ఏ వయసు వారైనా ఆచరించాల్సిందే. అయితే... ఏ వయసు వారు ఎంత సేపు నడవడం ఆరోగ్యానికి మంచిది అనే విషయం మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

నిజం చెప్పాలంటే.. ఈ రోజుల్లో జనాలకు శారీరక శ్రమ తగ్గిపోయింది. ఎక్కడికి వెళ్లాలన్నా చేతిలో బైకులు, కారులు అందుబాటులో ఉండటంతో పక్కనే ఉన్న దుకాణం వెళ్లడానికి కూడా నడవడం లేదు.  అంతేనా... ఎక్కువ మంది చేసే ఉద్యోగాలు కూడా కుర్చీల్లో గంటల తరపడి కూర్చొని చేసే పనులే అయిపోయాయి. ఈ పనిలో ఒత్తిడి ఉండదా అంటే.. కచ్చితంగా ఉంటుంది. కానీ..అదంతా మానసిక శ్రమ అవుతుంది కానీ.. శారీరక శ్రమ కిందకు రావడం లేదు. ఇక.. తినే తిండి కూడా బలం లేకుండా ఉండటంతో.. చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.

వీటికి పులిస్టాప్ పెట్టాలంటే... చిన్నపాటి వ్యాయామం అయినా మన శరీరానికి చాలా అవసరం. దాని కోసం.. రెగ్యులర్ గా వాకింగ్ చేస్తూ ఉండాలి. వయసుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయాల్సిందే. అయితే..  ఈ చేసే వాకింగ్ ని వయసుని బట్టి చేయాలి అని నిపుణులు చెబుతున్నారు. ఏ వయసు వారు ఎంత సేపు వాకింగ్ చేస్తే.. ఆరోగ్యంగా ఉంటారో.. నిపుణుల సహాయంతో తెలుసుకుందాం..

శరీరానికి వ్యాయామం ఉండాలి అంటే... వెంటనే జిమ్ లో జాయిన్ అయ్యి.. కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. మనకు వీలైనంత వరకు.. మన ఇంటి దగ్గరలోనే రోజులో కాస్త సమయం చూసుకొని.. వాకింగ్ చేస్తే చాలు. వాకింగ్ కేవలం కాళ్లకు మాత్రమే కాదు.. మొత్తం బాడీకి ఉపయోగకరంగా ఉంటుంది. మరి.. మీ వయసు ప్రకారం.. రోజుకి ఎంత సేపు నడవడం అవసరమో తెలుసుకుందాం...


వయసుకు తగ్గట్టుగా నడక

నిజానికి, ఓ పరిశోధనలోో తేలిన విషయం ప్రకారం.. ఒక మనిషి రోజుకి 8 కిలోమీటర్ల నడవాలట. అంటే.. వాకింగ్ మొదలుపెట్టి.. 8 కిలోమీటర్ల తర్వాతే ఇంటికి రాావాలి అని కాదు. ఉదయం లేచినప్పటి నుంచి... రాత్రి పడుకునే వరకు.. మొత్తం గా 8 కిలోమీటర్ల నడక ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో అవసరానికి.. అటు, ఇటు తిరగడం కూడా.. లెక్కలోకే వస్తుంది. రోజు మొత్తంలో కనీసం అలా 8 కిలోమీటర్లు నడిస్తే.. ఆ మనిషి  ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటాడట.

అయితే, ఇది కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సరిపోదు కాబట్టి, ప్రతిరోజూ 30 నిమిషాలు తప్పకుండా నడక వ్యాయామం చేయాలి. అది కూడా చురుగ్గా. ఇలాంటి పరిస్థితుల్లో ఏ వయసు వారు ఎంతసేపు నడవాలి అనే దాని గురించి ఇక్కడ చూద్దాం.

ఒక అధ్యయనం ప్రకారం, మీరు 60 ఏళ్లలోపు వారైతే రోజుకు 8000 నుండి 10 వేల వరకు అడుగులు వేయాలి. 60 ఏళ్లు పైబడిన వారు రోజుకు 6000 నుండి 8000 వరకు అడుగులు వేయాలి. ఇలా నడక వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే 6 నుండి 17 ఏళ్లలోపు వారు రోజుకు 60 నిమిషాల పాటు తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒకవేళ మీరు వ్యాయామం చేయలేకపోతే ఆటలు ఆడవచ్చు. అలాగే 18 నుండి 50 ఏళ్లలోపు వారు రోజుకు 12 వేల అడుగులు వేయాలి.

ముఖ్య గమనిక :

ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల వరకు చురుగ్గా నడక వ్యాయామం చేయడం చాలా మంచిది. అలాగే వృద్ధులకు పైన చెప్పినట్లుగా అడుగులు అర్థం కాలేదు లేదా తెలియదు అంటే మీరు ప్రతిరోజూ మూడు నుండి నాలుగు కిలోమీటర్ల వరకు మాత్రమే నడిస్తే సరిపోతుంది. ఒకేసారి చేయకుండా క్రమంగా నడిచే దూరాన్ని పెంచుతూ మనం ప్రతిరోజూ నడక వ్యాయామం చేస్తే మన శరీరం మాత్రమే కాకుండా మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది

Latest Videos

click me!