ఈ కూరగాయలు పచ్చిగా తింటే.. అనారోగ్యానికి ఆహ్వానం పలికినట్టే...

First Published Oct 12, 2021, 1:59 PM IST

క్యారెట్, టమాటా, కీరా.. ఇలాంటి కొన్ని రకాల కూరగాయల్ని పచ్చిగా తిన్నా బాగానే ఉంటాయి. అయితే అన్ని కూరగాయలకు ఇది వర్తించదు. కొన్నిరకాల కూరగాయల్ని సరిగ్గా వండి తినాల్సి ఉంటుంది. వాటిని సరైన పద్దతిలో ఉడికించి, వండకపోతే ఆరోగ్యానికి మేలు బదులు కీడు చేసే ప్రమాదం ఉంది. 

కూరగాయలు, పండ్లు తినడం చాలా మంచిది. ఆరోగ్యం బాగుండాలన్నా.. నిత్య యవ్వనంగా, రోజంతా శక్తితో, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే తాజా కూరగాయలు, పండ్లు తినాలి. అయితే.. ఇక్కడో ట్విస్ట్ ఉంది....

క్యారెట్, టమాటా, కీరా.. ఇలాంటి కొన్ని రకాల కూరగాయల్ని పచ్చిగా తిన్నా బాగానే ఉంటాయి. అయితే అన్ని కూరగాయలకు ఇది వర్తించదు. కొన్నిరకాల కూరగాయల్ని సరిగ్గా వండి తినాల్సి ఉంటుంది. వాటిని సరైన పద్దతిలో ఉడికించి, వండకపోతే ఆరోగ్యానికి మేలు బదులు కీడు చేసే ప్రమాదం ఉంది. 

ఆయా కూరగాయల్లో ఉండే విషపదార్థాలు శరీరానికి హాని కలిగిస్తాయి. బైటికి మామూలుగా, తాజాగా కనిపించినా.. వాటిల్లో ఉండే విషపదార్థాల గురించి తెలుసుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి కొన్ని రకాల కూరగాయల గురించి తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండొచ్చు. వాటిని ఎప్పుడూ పచ్చిగా తినడానికి ట్రై చేయకూడదు. అలాంటివేంటో చూడండి. 

సొరకాయ : కొన్ని ప్రాంాల్లో ఆనపకాయ అని కూడా అంటారు. ఇది యాంటీ డాట్. దీంట్లో అనేక పోషకవిలువలున్నాయి. ఆరోగ్యానికీ ఎంతో మంచిది. వండినా, జ్యూస్ లాగా తీసుకున్నా ఎంతో మంచిదని చెబుతారు. అయితే...సొరకాయకు సరిగా ఉడికించకపోతే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 

మొలకెత్తిన బంగాళదుంపలు : ఆలుగడ్డ ఎక్కువగా తినే ఆహారపదార్థం. దీన్ని అనేక రకాలుగా వంటల్లో, చిరు తిండ్లలో, స్నాక్స్ గా వాడుతుంటారు. అయితే అది బాగా ఉడికించిన తరువాతే తినాలి. ముఖ్యంగా మొలకలు వచ్చిన ఆలు గడ్డలు, అక్కడక్కడా గ్రీన్ కలర్ ఉన్న బంగాళదుంపలు తప్పనిసరిగా పూర్తిగా ఉడకాలి. ఎందుకంటే ఆ ఆకుపచ్చటి ప్రాంతంలో, మొలకలు వస్తున్న ప్రాంతంలో విషపదార్థాలు ఉంటాయి.

కస్సావా లేదా టొపియోకా. దీన్ని ఎక్కువగా భారతీయ వంటకాల్లో వాడతారు. అయితే దీన్ని వాడేముందు తప్పనిసరిగా నానబెట్టి, చక్కగా ఉడికించాకే వాడాలి. పచ్చి టోపియోకా సైనైడ్ లాంటి విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. 

వంకాయ లేదా ఎగ్ ప్లాంట్ వీటిని సరిగా ఉడికించకపోతే దీంట్లోని గ్లైకోఆల్కలాయిడ్ సమ్మేళనాలు శరీరానికి విషంగా పరిణమిస్తాయి. ఇవి వండకపోతే విషంగా మారతాయి. సరిగా వండితే చక్కటి పోషక ప్రయోజనాలు అందిస్తాయి. 

మొలకెత్తిన గింజలు..అన్నీ కాదు.. కాకపోతే పెసర్లు, ఆల్ఫలా బీన్స్ లాంటివి మీ మొలకెత్తిన గింజల్లో ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీటిల్లోకి పాథోజెన్స్ సులభంగా చేరతాయి.. ఇవి ఆరోగ్యానికి హానికరంగా మారతాయి.

పచ్చి బీన్స్... లేదా సరిగా ఉడకకపోతే హానికరంగామారతాయి. అలాగని ఇవి మరీ ప్రమాదకరమైనవికాదు కానీ కొన్ని రకాల విషపదార్థాలను విడుదల చేస్తాయి. దీంట్లోని లెక్టిన్ స్థాయిలు జీర్ణసంబంధ సమస్యలకు దారి తీస్తాయి.

బ్రొక్కోలి.. ఉడికించిన లేదా బండిన బ్రొక్కోలి అనేక రకాల పోషకాలను మనకు అందిస్తుంది. అయితే అదే సరిగా ఉడకకపోతే క్యాన్సర్ కారకాలు పెరగడానికి దోహదపడుతుందట. 

click me!