వాల్ నట్స్ తొక్కలు ఎందుకూ పనికిరావని పడేస్తే.. మీరెంతో నష్టపోయినట్టే..!

Published : Aug 16, 2022, 01:57 PM IST

వాల్ నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలుసు.. కానీ వీటి తొక్కలు కూడా మనకు ఉపయోగపడతాయన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు.   

PREV
15
వాల్ నట్స్ తొక్కలు ఎందుకూ పనికిరావని పడేస్తే.. మీరెంతో నష్టపోయినట్టే..!

వాల్ నట్స్ తొక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో విటమిన్ ఇ తో పాటుగా వివిధ రకాల విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించి చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. వాల్ నట్స్ తొక్కలు మనకు ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

25

మృదువైన చర్మానికి..

వాల్ నట్స్ ను ఉపయోగించడం వల్ల చర్మం స్మూత్ గా తయారవుతుంది. అంతేకాదు ఇవి మీ ముఖాన్ని కాంతివంతంగా తయారుచేస్తాయి. అలాగే డ్రై స్కిన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 
 

35

మచ్చలను పోగొడుతాయి.. 

వాల్ నట్స్ తొక్కలు ముఖంపై ఉండే నల్లని మచ్చలను తగ్గించడంలో కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. వీటిని పేస్ట్ లా తయారుచేసుకుని ముఖానికి అప్లై చేస్తే.. చర్మం శుభ్రపడుతుంది. అలాగే ముఖంపై ఉండే మురికి కూడా తొలగిపోతుంది. అలాగే ముఖంపై ఉండే నల్లని మచ్చలు కూడా పోతాయి. 
 

45

జిడ్డుగల చర్మానికి..

ఆయిలీ స్కిన్ ఉన్న వారికి ఈ తొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందుకోసం ఈ వాల్ నట్స్ తొక్కలను బాగా ఎండబెట్టి పౌడర్ లా తయారుచేసుకుని చర్మానికి అప్లై చేస్తే చనిపోయిన కణాలు తొలగిపోతాయి. అలాగే ఆయిలీ స్కిన్ కూడా మటుమాయం అవుతుంది.

55

వాల్ నట్స్ షెల్స్ ను పడేయడానికి బదులుగా వాటిని ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకుని ఇలా ఉపయోగించుకోవచ్చు. ఇది చర్మ సౌందర్యాన్ని ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పౌడర్ ను పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, మురికి వదిలిపోతాయి.      

Read more Photos on
click me!

Recommended Stories