benefits of being single: ఒకప్పుడు సింగిల్ లా ఉండటమంటే మహా బోరుగా ఫీలయ్యే వారు. అందుకే మనసుకు నచ్చిన అమ్మయిని, అబ్బాయిని వెతుక్కుని పార్టనర్ తో ఎక్కువ సమయంలో గడిపేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. రిలేషన్ షిప్ కు కాస్త దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ నుు ఎంజాయ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరి సింగిల్ గా ఉండటం వల్ల ఎలాంటి లాభాలున్నాయో చూద్దాం పదండి.
సింగిల్ గా ఉండటం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండోయ్. అవేంటంటే.. సింగిల్ గా ఉండే వారికి ఎమోషన్ సపోర్ట్ ఉండదు.
బెనిఫిట్స్ : నేను సింగిల్ గానే ఉంటా.. నాకు తోడు అవసరం లేదనుకునే వారికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
స్ట్రాంగ్: సింగిల్ గా ఉండే వారు స్ట్రాంగ్ గా ఉంటారట. ముఖ్యంగా వీరు ఇండిపెండెంట్ గానే ఉంటారు. ఒకరి ఇష్టాయిష్టాలను తెలుసుకొని తమకు నచ్చకున్నా వేరే పనిని ఏమాత్రం చేయాల్సిన అవసరం ఉండదు. ఇక అభిప్రాయాలను ఏ మాత్రం మార్చుకునే ప్రసక్తే ఉండదు. .
పార్టనర్ కోసం: యంగ్ ఏజ్ లో సింగిల్ గా ఉంటడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ టైం లో సింగిల్ గా ఉన్నవారు తమ భాగస్వామిని వెతుకునేందుకు ఎక్కువ టైం ఉంటుంది. ఈ వయసు వారికి మనసుకు నచ్చిన అమ్మాయితో లేదా అబ్బాయితో ముచ్చటించడానికి ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు.
సోలో ట్రావెల్స్: పార్టనర్ తో కలిసి టూర్ కు వెళితే వచ్చి ఇబ్బందులు సింగిల్ గా వెళ్లినప్పుడు చాలా తక్కువ వస్తాయి. సోలో ట్రావెల్స్ లో మీరు ఎవరికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలుసా.. పార్టనర్ తో కంటే సింగిల్ టూర్స్ వెళ్లినప్పుడే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారట.
ప్రొడక్టివ్ సమయం: రిలేషన్ షిప్ లో ఖచ్చితంగా గంటల తరబడి చాటింగ్ లు, కాల్స్ ఉంటాయి. అదే సింగిల్ గా ఉంటే నో ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, నో చాటింగ్. ఇవేమీ లేకపోవడంతో సింగిల్స్ కు బోలెడంత సమయం ఆదా అవుతుంది.
కష్టమే: సింగిల్ లైఫ్ బోరు అని ఫీలయ్యేవాళ్లు వెంటనే రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టవచ్చు. అయితే రిలేషన్ షిప్ లో ఉన్న వారు సింగిల్ గా మారడం అంత సులభం. దాని వల్ల ఎంతో మనోవేధనను అనుభవించాల్సి ఉంటుంది.