ఇంతటి అద్భుతమైన పసుపు కాంబినేషన్స్ తో కొన్ని ఫేస్ ప్యాక్ లు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న కాంబినేషన్ పసుపు,శెనగపిండి కాంబినేషన్. శనగపిండి,పసుపు, నిమ్మరసం సమపాళ్లల్లో తీసుకొని అందులో కొద్దిగా పాలు వేసి పేస్టు లాగా తయారుచేసి ముఖానికి మాస్క్ వేసుకుంటే అది మీ ముఖానికి మంచి ఛాయని తీసుకువస్తుంది.