బాత్రూమ్ టైల్స్ ను క్లీన్ చేయడం అంత ఈజీ పనైతే కాదు. ముఖ్యంగా ఈ టైల్స్ కు దుమ్ము, ధూళితో మొండిమరకలు ఏర్పడతాయి. ఈ మరకలను పోగొట్టడం అంత సులువైన పని కాదు. కానీ చాలా మంది ఆడవాళ్లు ఇళ్లును క్లీన్ చేసినట్టుగా బాత్ రూం ను కూడా క్లీన్ చేస్తుంటారు. కానీ దీనివల్ల బాత్ రూం టైల్స్ అస్సలు క్లీన్ కావు. ఎక్కడి దుమ్ము అక్కడే ఉంటుంది.
ఏదేమైనా ఇంట్లోని వంటగదిని, బాత్ రూం క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం. అయితే బాత్ రూం ని శుభ్రపరచడానికి మార్కెట్లో ఎన్నో కెమికల్ వాష్లు ఉంటాయి. కానీ వీటిని వాడితే మీ ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా పర్యావరణానికి హాని కలుగుతుంది. అందుకే ఎలాంటి రసాయనాలు లేని వాటిని ఉపయోగించి బాత్ రూం టైల్స్ ను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వెనిగర్, బేకింగ్ సోడా
వెనిగర్, బేకింగ్ సోడాలు ఎలాంటి మొండి మరకలనైనా ఇట్టే పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఎంతో ప్రాచుర్యం పొందిన నేచురల్ స్టెయిన్ రిమూవర్లలో వెనిగర్ ఒకటి. దీనిలో ఆమ్ల లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాత్ రూం టైల్స్ం కు అంటుకున్న దుమ్మును, దూళిని, మురికిని, సబ్బు మరకలను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది.
ఇందుకోసం ఒక సీసాలో వైట్ వెనిగర్ ను, నీళ్లను సమానంగా భాగాలుగా తీసుకుని ఒకదాంట్లో మిక్స్ చేసి కలపండి. ఈ మిశ్రమాన్ని బాత్ రూం టైల్స్ పై చల్లండి. కొద్ది సేపటి తర్వాత బ్రష్ లేదా స్పాంజ్ తో తుడిచేస్తే మరకలు సులువుగా పోతాయి. కానీ టైల్స్ ను దీన్ని చల్లిన తర్వాత కొద్దిసేపు టైల్స్ ను నాననివ్వాలి. అయితే చాలా మొండి మరకలను పోగొట్టడానికి వెనిగర్ ద్రావణాన్ని పిచికారీ చేయడానికి ముందు టైల్స్పై బేకింగ్ సోడాను చల్లండి.
నిమ్మరసం:
నిమ్మరసంలో ఎన్నో లక్షణాలుంటాయి. మీకు తెలుసా? నిమ్మకాయ మరొక సహజ క్లీనర్. ఇది ఎంతటి మొండి మరకలనైనా చాలా ఈజీగా పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది మీ బాత్ రూంలో తాజా సువాసనను నింపడానికి కూడా సహాయపడుతుంది.
ఇందుకోసం నిమ్మకాయను సగానికి కట్ చేసి నేరుగా టైల్స్ పై పడిన మరకలపై రుద్దండి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మురికిని తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే స్క్రబ్బింగ్ ను కూడా సులువు చేస్తుంది. నిమ్మకాయను మొండి మరకలపై రుద్దే ముందే నిమ్మకాయపై కొంచెం ఉప్పు వేయండి.
హైడ్రోజన్ పెరాక్సైడ్
హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక సహజ క్రిమిసంహారక మందు. ఇది బాత్ రూం టైల్స్ పై ఉన్న మురికిని పోగొట్టడంలో చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది బాత్ రూంలో ఉన్న క్రిమి కీటకాలను కూడా చంపుతుంది.
ఇందుకోసం కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ను తీసుకుని స్పాంజ్ లేదా గుడ్డకు అంటించుకుని టైల్స్ ను తుడవండి. ఇది ఫంగల్, సబ్బు మురికిని తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మొండి మరకల కోసం, బేకింగ్ సోడాలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మిక్స్ చేసి పేస్ట్ లా చేయండి. దీన్ని టైల్స్ పై ఉన్న మరకలపై రుద్దండి.
హెర్బల్ ఆయిల్స్
మూలికా నూనెలను వాడటం వల్ల బాత్ రూం తాజా వాసన రావడమే కాదు.. బాత్ రూం టైల్స్ పై ఉన్న మొండి మరకలు కూడా ఇట్టే పోతాయి. ఈ హెర్బల్ ఆయిల్స్ లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి బాత్రూమ్ టైల్స్ ను శుభ్రం చేయడానికే కాకుండా బాత్ రూంలో ఉన్న క్రిమి కీటకాలను చంపడానికి కూడా సహాయపడతాయి.
ఇందుకోసం టీ ట్రీ ఆయిల్ లేదా లావెండర్ ఆయిల్ వంటి మీకు ఇష్టమైన ముఖ్యమైన నూనెలను కొన్నిచుక్కలు తీసుకుని నీళ్లు, వెనిగర్ లో కలపండి. దీన్ని దీన్ని టైల్స్ పై స్ప్రే చేసి గుడ్డ లేదా స్పాంజ్ తో తుడవండి.