పడుకునే ముందు ఈ ఒక్క డ్రింక్ తాగితే....హాయిగా నిద్రపోవచ్చు..!

First Published Oct 11, 2024, 12:46 PM IST

 వర్క్ టెన్షన్, ఒత్తిడి, ఇతర ఆరోగ్య సమస్యలు కారణం ఏదైనా ప్రశాంతమైన నిద్ర కరువై.. మరిన్ని ఇతర ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నవారు కోకొల్లలు.

జీవితంలో ఎంత కష్టపడినా.. కడుపు నిండి తినడానికి, ప్రశాంతంగా నిద్రపోవాలనే కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్నా.. ప్రశాంత మైన నిద్రలేక ఇబ్బంది పడేవారు చాలా మంది ఉన్నారు. వర్క్ టెన్షన్, ఒత్తిడి, ఇతర ఆరోగ్య సమస్యలు కారణం ఏదైనా ప్రశాంతమైన నిద్ర కరువై.. మరిన్ని ఇతర ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నవారు కోకొల్లలు.
 

sleep

మనిషికి నిద్ర చాలా అవసరం. రాత్రిపూట నిద్రలేకపోతే.. మరుసటి రోజు ఉత్సాహంగా ఉండలేరు.  నిద్ర.. శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, చైతన్యాన్ని నింపడానికి, తిరిగి శక్తిని పొందడానికి సహాయపడుతుంది. అయితే.. రాత్రిపూట నిద్ర పట్టడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరైతే ఏకంగా వ్యాయామాలు కూడా చేస్తారు. మరి కొందరు.. స్నానం చేస్తారు.. అప్పుడు అయినా నిద్రపడుతుందని. ఇవన్నీ మంచి ప్రయత్నాలే. అయితే.. ఇవి ప్రయత్నించినా కూడా నిద్రపట్టలేదు అంటే... ఈ కింది డ్రింక్ ప్రయత్నించాల్సిందే. ఈ డ్రింక్ తాగితే ఎవరికైనా హ్యాపీగా నిద్రపట్టాల్సిందే. మరి అదేంటో ఓసారి చూద్దాం...

నిజానికి మంచిగా నిద్రపోవాలంటే.. మన శరీరానికి ఒక టైమ్ అలవాటు చేయాలట. ఒక్కో రోజు ఒక్కో టైమ్ కి పడుకోవడం మంచిది కాదు. రోజూ ఒకే టైమ్ కి పడుకోవడానికి ప్రయత్నిస్తే..ఆటోమెటిక్ ఆ టైమ్ బాడీకి అలవాటు అవుతుంది. అప్పుడు ఆ టైమ్ కి నిద్ర రావడం మొదలౌతుంది. దీనితో పాటు.. మన నిద్రకు సహాయపడే ఆహారాలు కూడా తీసుకోవాలి.

Latest Videos


Black Raisin And Saffron Water

రాత్రిపడుకునే ముందు ఎండుద్రాక్ష, కుంకుమ పువ్వుతో చేసే డ్రింక్ తాగితే.. మంచి నిద్ర పడుతుందట. నల్ల ఎండు ద్రాక్షలో మెలటోనిన్ ఉంటుంది. ఇది నిద్రకు సహాయపడే హార్మోన్. అంతేకాకుండా.. నల్ల ఎండుద్రాక్ష జీర్ణక్రియను మెరుగుపరచడానికి ,రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. ఈ కారకాలు మరింత ప్రశాంతమైన , అంతరాయం లేని నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

కుంకుమపువ్వు, నిద్రను మెరుగుపరుస్తుంది: కుంకుమపువ్వు అనేది యాంటీఆక్సిడెంట్ల  శక్తివంతమైన మూలం, ఇది నిద్ర హార్మోన్ల సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలో మీ ఒత్తిడి స్థాయిలను ప్రభావితం చేసే హానికరమైన అణువులను తటస్థీకరిస్తుంది. ఇది చంచలత  లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్రను పునరుద్ధరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 

మీ ఆహారంలో బ్లాక్ రైసిన్ , కుంకుమపువ్వు నీటిని ఎలా చేర్చుకోవాలి?
 మీరు ఒక గ్లాసులో కొన్ని నల్ల ఎండుద్రాక్షలు, కొన్ని కుంకుమపువ్వులు తీసుకోవాలి. నీటిలో వాటిని నాలుగు నుండి ఆరు గంటల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత రాత్రి పడుకునే ముందు.. వాటిని వడబోసుకొని తాగితే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ తాగడం వల్ల మీరు మంచి ఫలితాలు చూస్తారు.

click me!