పిండికి పురుగులు పట్టొద్దంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Aug 2, 2024, 12:54 PM IST

రాగుల పిండికి చాలా తొందరగా పురుగులు పడతాయి. పురుగులు పట్టిన పిండి డస్ట్ బిన్ లో వేయడానికి తప్ప దేనికీ పనికి రాదు. అందుకే ఈ పిండికి పురుగులు పట్టకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

చిరుధాన్యాల్లో ఒకటైన రాగులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మధుమేహులకు ఇవి ఎంతగానో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి రాగులు బాగా సహాయపడతాయి. అందుకే అన్నం, గోధుమలకు బదులుగా రాగిపిండిని తినడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. 
 

అయితే ఒకప్పుడు రాగి పిండి అవసరమైతే..అప్పటికప్పుడే వాటిని గ్రైండ్ చేసి వాడేవారు. అయితే ఇప్పుడు ఒకేసారి రాగులను ఎక్కువ పిండి పట్టించి నిల్వ చేస్తున్నారు. కానీ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే దానికి పురుగులు పట్టే అవకాశం ఉంది. ఈ పురుగులు పట్టిన పిండిని ఉపయోగించలేం. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం పిండికి పురుగులు పట్టకుండా ఉంటాయి. అలాగే పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


శుభ్రంగా కడిగి ఆరబెట్టండి

రాగులను పిండి పట్టించేముందు వాటిని బాగా నీళ్లతో కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఏదేమైనా రాగులను బాగా శుభ్రపరిచి ఎండబెట్టిన తర్వాత మాత్రమే పిండి పట్టించాలి. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే? రాగులు కొద్దిగా తేమ ఉన్నా వాటిని పిండి పట్టిస్తే ఆ పిండి త్వరగా చెడిపోయి ఫంగస్ బారిన పడతాయి. దీంతో దానికి పురుగులు పడతాయి. 
 

గాలికి గురికాకుండా చూడాలి

రాగుల పిండికి పురుగులు పట్టకూడదంటే మాత్రం.. దీన్ని గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేయాలి. అలాగే దాన్ని ఓపెన్ చేసినప్పుడు కూడా అందులోకి గాలి వెళ్లకుండా మూతను గట్టిగా మూసేయాలి. లేదంటే అందులో ఆక్సీకరణం పెరిగి రాగి పిండి త్వరగా పాడవుతుంది. 

చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి

రాగి పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే దాన్ని ఏకరీతి ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశంలో నిల్వ చేయొచ్చు. ఇది చల్లగానైనా ఉండొచ్చు లేదా తేమగా ఉండే ప్రదేశమైనా కావొచ్చు. ముఖ్యంగా రాగి పిండిని ఎప్పుడూ మారుతున్న ఉష్ణోగ్రత ప్రదేశంలో ఉపయోగిస్తే మాత్ర కంటైనర్ లోపల తేమ పేరుకుపోతుంది. అంతేకాకుండా ఈ పిండి రుచి కూడా మారుతుంది. అలాగే పురుగులు కూడా పడతాయి. 
 

సూర్యరశ్మి లేని ప్రదేశంలో ఉంచండి

రాగుల పిండి పాడవకుండా ఉండాలంటే మాత్రం మీరు ఈ పిండి ఉన్న కంటైనర్ ను నేరుగా ఎండతగిలే ప్రదేశంలో పెట్టకూడదు. సూర్యరశ్మి రాగులను తాకితే రాగుల్లో పోషక విలువలు పోతాయి. అలాగే వాటి నాణ్యత కూడా తగ్గుతుంది. 

మంచి డబ్బా వాడండి

రాగుల పిండిని మంచి నాణ్యమైన కంటైనర్ లో నిల్వ చేయండి. ముఖ్యంగా డబ్బా మూత గాలిని లోపలికి పంపకుండా ఉండాలి. లేదంటే రాగి పిండి త్వరగా పాడవుతుంది.

Latest Videos

click me!