కన్ను దిష్టి తగిలితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి.. నివారించే పద్ధతులు ఇవే?

First Published | Jan 9, 2022, 1:29 PM IST

చాలా మంది అనేక ఆచారాలను  (Rituals) మూఢనమ్మకాలుగా (Superstitions) భావించి వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. మరి కొందరు మాత్రం వాటిని అనుసరిస్తే వారి దోషాలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని  నమ్ముతారు. అయితే కొందరు నమ్మే కన్ను దృష్టి సోకితే కలిగే నష్టాలు వాటి నివారణ ఉపాయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..  
 

ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలను నమ్మే (Believe) వారు చాలా మంది ఉన్నారు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఒక్కసారి గమనించినప్పుడు మంచి ఆలోచన స్వభావంతో పాటు చెడు, దురాశ వంటి ఆలోచనలు కూడా మనసులో తలెత్తుతాయి. ఇలా చెడు దృష్టి ఆలోచనా (Bad vision thinking) విధానమే అనేక ప్రభావాలను కలుగజేస్తుందని నమ్ముతారు.
 

ఇలా ఇతరుల చెడు దృష్టి ప్రభావాన్ని కన్ను దృష్టి దోషం అంటారు. దీన్ని దిష్టి దోషం అని కూడా అంటారు. ఇలా కపటబుద్ధితో (Hypocrisy) చూసే చూపు కారణంగా ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ (Negative energy) ఏర్పడి అనుకోని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. మనమంటే ఇష్టం లేని వారు, మన శత్రువులు మన సంతోషాలను, విజయాలను, అభివృద్ధిని ఓర్వలేక చూసే చెడు చూపునే కనుదృష్టి అంటారు.
 


మనకు గిట్టనివారి కను దృష్టి తగిలితే కుటుంబం ఎవరైనా ఒకరు అనారోగ్యం (Illness) బారినపడే అవకాశం ఉంటుంది. ఇందుకు విరుగుడుగా (Antidote) సముద్రపు నీటిని శుభ్రమైన బట్టలో వడగట్టి ఇందులో గోమూత్రం కలిపి ఒక సీసాలో నిల్వచేసుకోవాలి. ఇలా భద్రపరచుకున్న నీటిని ఇంటి అన్ని గదులలో పౌర్ణమి రోజున, పాడ్యమి రోజున చిలకరించాలి.
 

ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గి కను దృష్టి దోషం తొలగిపోతుంది. ఈ కనుదిష్టి ప్రభావం ఇంటిలోని పెంపుడు కుక్కల (Pet dogs) పైన కూడా పడుతుంది. దీని కారణంగా పెంపుడు జంతువులకు ఆకలి తగ్గిపోవడం (Decreased appetite), నిరంతరం అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ చెడు దృష్టి ప్రభావం తగ్గడంకోసం జంతువులను పసుపు నీటితో కడగడం మంచిది.
 

వ్యాపారంలో (Business) మనకు గిట్టనివారి కారణంగా దిష్టి కలిగే అవకాశం ఉంటుంది. దిష్టి తగలకుండా ఉండాలంటే ఒక గ్లాసు నీటిలో నీళ్లు పోసి నిమ్మకాయ (Lemon) వేసి ఉంచాలి. ఈ గ్లాసును అందరూ వచ్చి వెళ్లే చోట ఉంచి నీటిని ప్రతి రోజు మారుస్తూండాలి. నిమ్మకాయను ప్రతి శనివారం మార్చాలి.
 

పుట్టిన పిల్లలను చూడడానికి వచ్చిన వాళ్ళు వెళ్లిన తర్వాత పిల్లలు అకస్మాత్తుగా ఏడవడం చేస్తుంటారు. ఈ దిష్టి పోవాలంటే చేతిలో ఉప్పు (Salt) వేసుకుని పిల్లల తల చుట్టూ అటూ ఇటూ మూడుసార్లు తిప్పి ఉప్పును నీటిలో (Water) వేయడం మంచిది.
 

దురదృష్టం, నిరుద్యోగ సమస్యలతో ఇబ్బంది పడేవారు హాలులో పశ్చిమ దిశలో అక్వేరియం (Aquarium) ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. గర్భవతులకు కను దృష్టి తగలకుండా ఉండాలంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే సమయంలో రెండు వేప ఆకులను (Neem leaves) వెంట తీసుకుని వెళ్లాలి. తిరిగి ఇంటికి రాగానే ఆకులను కాల్చెస్తే చెడు దృష్టి ప్రభావం తగ్గుతుంది.

Latest Videos

click me!