టాపర్స్ అలవాట్లు... ఫాలో అయితే మీరూ చదువులో టాప్

First Published | Aug 8, 2024, 11:14 AM IST

చాలామంది విద్యార్థులు చదువులో వెనకబడ్డామని బాధపడుతుంటారు. అలాంటివారు ఈ అలవాట్లను అలవర్చుకుంటే టాపర్స్ గా మారతారు...  చాలామంది టాపర్స్ వీటినే ఫాలో అవుతారు... 

Toppers Habits

చదువు మనిషికి విజ్ఞానంతో పాటు మంచి జీవితాన్ని ఇస్తుంది. బాగా చదివి మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని చాలామంది కోరుకుంటారు. చివరకు సొంత వ్యాపారంలో రాణించాలన్నా చదువు అవసరం. ఇలా మంచి చదువు మనిషి మంచి స్థానంలో నిలబెడుతుంది... సమాజంలో గౌరవ మర్యాదలు అందిస్తుంది. 

అయితే ప్రతి ఒక్కరు చదువుకుంటారు... కానీ టాపర్స్ మాత్రం కొందరే వుంటారు. కొందరు చిన్నప్పటినుండి చదువుపై ఆసక్తితో టాపర్స్ గా మారితే...మరికొందరు చదివే విధానం, తమ జీవనశైలితో టాపర్స్ గా మారతారు. ఇలా ఎక్కువశాతం టాపర్స్ కు కొన్ని కామన్ అలవాట్లు వుంటాయి. ఆ హ్యాబిట్స్ గనక అలవర్చుకున్నారో మీరు కూడా టాప్ చేయవచ్చు. 
 

టాపర్స్ అలవాట్లు : 

చదివే సమయం :

బాగా చదివే స్టూడెంట్స్ రాత్రి లేదంటే తెల్లవారుజామున యాక్టివ్ గా వుంటారు. అందరూ పడుకున్నాక వాళ్లు మేల్కొని చదువుకుంటారు. రాత్రి సమయంలో అయితే ఎలాంటి ఆటంకాలు వుండవు... అందువల్లే చాలామంది టాపర్స్ ఆ సమయంలో చదుకునేందుకు ఇష్టపడతారు. 

ఇక తెల్లవారుజామున 4 లేదా 5 గంటలకు లేచి చదువుతుంటారు. ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా వుంటుంది... మెదడు కూడా రిలాక్స్ గా వుంటుంది. కాబట్టి చదివింది బాగా అర్ధమవుతుంది... ఏకాగ్రత కూడా వుంటుంది. చాలామంది టాపర్స్ ఈ సమయాన్ని ఫాలో అవుతారు.
 


తనతో తాను మాట్లాడుకోవడం : 

బాగా చదివేవారిలో చాలామందికి ఈ అలవాటు వుంటుంది. చదివిన విషయాలను గుర్తుపెట్టుకునేందుకు వీళ్లు ఇలా నిత్యం గుర్తుచేసుకుంటారు. తనలో తానే మాట్లాడుకుంటూ తన ఆలోచనలను మరింత పదునెక్కిస్తారు. ఇలా చదివిన విషయాలను పదేపదే గుర్తుచేసుకోవడం వల్ల అవి ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుండిపోతాయి. ఇది విద్యార్థులకు బాగా  ఉపయోగపడుతుంది.  

శక్తినిచ్చేలా చిన్న కునుకు :

అసలు విరామమే లేకుండా చదవడం కంటే మధ్యమధ్యలో కాస్త బ్రేక్ తీసుకుంటే బుర్ర వేడెక్కకుండా వుంటుంది. అప్పుడు ఒత్తిడికి గురికాకుండా చదివిన విషయాలను బాగా గుర్తుపెట్టుకోగలం. టాపర్స్ లో ఎక్కువమంది దీన్ని ఫాలో అవుతారు. ఏకదాటిగా చదవకుండా మధ్యమధ్యలో చిన్న కునుకు తీస్తారు. ఇది మెదడుకు రిలాక్స్ చేసి మరింత చదివేందుకు ఉపయోగపడుతుంది. 
 

ప్లాష్ కార్డ్స్ :  

ఏదైనా పనిపై బయటకు వెళ్ళినపుడు చాలా సమయం వృధా అవుతుంది. ఆ సమయాన్ని చదివేందుకు ఉపయోగిస్తారు టాపర్స్. ఇందుకోసం బయటకు వెళ్లినపుడు వాళ్లు ప్లాష్ కార్డ్స్ ఉపయోగిస్తుంటారు. ప్రయాణాల్లో, ఎక్కడయినా వేచివుండాల్సి వచ్చినపుడు ఈ ప్లాష్ కార్డ్స్ లోని కీలక కాన్సెప్ట్ ను చదువుతుంటారు.

నడుస్తూ చదవడం : 

చాలామందికి ఒకేచోట కూర్చుని చదవడం కంటే నడుస్తూ చదవడాన్ని ఇష్టపడుతుంటారు. ఇలా చేయడం వల్ల చాలా అలర్ట్ గా వుంటారు...కాబట్టి చదివింది బాగా బుర్రకెక్కుతుంది. 

ఆహార అలవాట్లు : 

ఆహార అలవాట్లు కూడా చదువుపై చాలా ప్రభావం చూపిస్తాయి. అందువల్లే మెదడును మరింత బలంగా మార్చే ఆహారాన్ని తినేందుకు టాపర్స్ ఇష్టపడతారు. అంటే నట్స్,బెర్రీస్, ఫిష్, ఆకుకూరలు... ఇలా మంచి పోషకాలుండే ఆహారం తీసుకుంటారు. ఇలా శరీరానికే కాదు మెదడుకు కూడా బూస్ట్ ఇస్తుంటారు టాపర్స్.

మైండ్ మ్యాప్ : 

బట్టి పడితోనో,  ఎక్కవసేపు చదివితోనో టాపర్స్ కాలేరు.  తెలివిగా చదివినవారు మాత్రమే టాపర్స్. ఈజీగా అర్థమయ్యేలా కాన్సెప్ట్ ను మైండ్ మ్యాపింగ్ చేయడం టాపర్స్ లక్షణం. ఇలా మైండ్ మ్యాపింగ్ ద్వారా చదివింది ఈజీగా అర్ధమవడమే కాదు ఎక్కువకాలం గుర్తుండిపోతుంది. 

ఇతరులతో చర్చించడం : 

చదివిన విషయాలను ఇతరులతో చర్చిస్తే బాగా గుర్తుండిపోతాయి. అంతేకాదు బాగా వచ్చిన విషయాలను ఇతరులకు బోధిస్తుండాలి. అప్పుడు రివిజన్ అవుతుంది. టాపర్స్ కు ఈ అలవాటు వుంటుంది. 

షెడ్యూల్ :

జీవితాన్ని ఆస్వాదిస్తూ చదివితేనే అది ఒంటబడుతుంది. చాలామంది టాపర్స్ దీన్ని ఫాలో అవుతారు. రోజులో కొంత సమయం చదువుకు విరామం చెప్పి తమకు ఇష్టమైన పనులు చేస్తుంటారు. ఇందుకోసం ఓ షెడ్యూల్ ను రూపొందించుకుంటారు. దీనివల్ల చదువుతో పాటు ఇతర విషయాలపై కూడా వారికి అవగాహన వుంటుంది.

Latest Videos

click me!