ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు ఇవే..

First Published | Aug 8, 2024, 8:58 AM IST

ఎంత ఖరీదైన కారైనా రూ.కోటి లేదా రూ.10 కోట్లు మాక్సిమం రూ.20 కోట్లు ఉంటుంది. కానీ రూ.249.48 కోట్లు ఖరీదు చేసే కార్ ఉందంటే నమ్ముతారా.? నమ్మాలి మరి.. ఎందుకంటే దీన్ని తయారు చేసింది rolls Royce కంపెనీ.  ప్రపంచంలోనే ఇలాంటి టాప్ 10 అత్యంత ఖరీదైన కార్ల గురించి తెలుసుకుందామా..
 

10. బుగట్టి డివో (Bugatti Divo).. 

అడ్వాన్స్డ్ ఏరోడైనమిక్స్ సాంకేతికతతో రూపొందించిన కార్ బుగట్టి డివో .  సూపర్ వేగంతో దూసుకుపోతుంది. 8.0 L, W 16 క్వాడ్-టర్బోచార్జ్డ్ ఇంజన్ తో పాటు మెరుగైన హ్యాండ్లింగ్ సిస్టంను కలిగి ఉంది. దీని పవర్ అవుట్ ఫుట్ 1,500 hp. India మార్కెట్లో దీని ధర రూ.49.99 కోట్లు. 

9. పగని హ్యుయారా కోడలుంగ(pagani huayra kodalunga)

ఈ కారు ధర రూ.61.63 కోట్లు. ఇది కూడా ఏరో డైనమిక్స్ సాంకేతికతతో తయారు చేయబడింది. లాంగ్ టైల్ డిజైన్ దీని ప్రత్యేకత. ట్విన్ టర్బో వి12 ఇంజిన్, 828 హార్స్ పవర్ తో దూసుకుపోతుంది.

8. మెర్సిడెస్ మేబ్యాక్ ఎక్సెలరో(mercedes maybach exelero)
ఈ కారు v12 ట్విన్ టర్బో ఇంజన్ కలిగి ఉంది. 218 mph గరిష్ట వేగంతో పరుగు పెట్టగలదు. ఆకర్షణీయమైన ఏరో డైనమిక్ డిజైన్ తో దీని తయారు చేశారు. దీని ధర భారతీయ మార్కెట్లో రూ.66.65 కోట్లు. 

7.  బుగట్టి సెంటోడిసి(Bugatti centodieci)
1600 hp కెపాసిటీ ఉన్న ఈ కారు Eb110 మోడల్ ప్రేరణతో రూపొందించబడింది. క్వార్డ్ టర్బో w 16 ఇంజన్ తో దీన్ని తయారు చేశారు. భారతీయ మార్కెట్లో దీని ధర రూ.74.98 కోట్లు.
 


6. రోల్స్ రాయిస్ స్వెప్ టైల్ (Rolls Royce sweptail)
పనోరమిక్ గ్లాస్ తో అందంగా డిజైన్ చేయబడిన కార్ ఇది. బైస్పోక్ ఇంటీరియర్ ప్రత్యేక ఆకర్షణ. కారు వెనుక డిజైన్ మోడరన్ గాను, క్లాసిక్ గాను కనబడుతుంది. మన దేశంలో దీని ధర రూ. 108.31 కోట్లు. 

5. ఎస్పీ ఆటోమోటివ్ ఖోస్(sp Automative chaos)
V10 ట్విన్ టర్బో ఇంజన్ తో రూపొందించబడిన ఈ కారు 3000hp పవర్ తో దూసుకుపోతుంది. ఫ్యూచర్స్టిక్ 3d ప్రింటెడ్ కాంపోనెంట్ లతో ప్రత్యేకంగా దీన్ని తయారు చేశారు. దీన్ని అల్ట్రా కార్ అని పిలుస్తారు. భారతీయ మార్కెట్లో దీని ధర రూ. 119.98 కోట్లు. 

4. పగని జోండా హెచ్ పీ బార్చెట్టా(pagani zonda hp barchetta)
శక్తివంతమైన V12 ఇంజన్ తో తేలికపాటి నిర్మాణం ఉండేలా ఈ కార్ ను తయారు చేశారు. ఓపెన్ టాప్ ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణ. దీని ధర రూ. 146.64 కోట్లు. 

3. బుగట్టి లా వైచర్ నోయిర్ (Bugatti la voiture noire)
   క్వాడ్  టర్బో w 16 ఇంజిన్ ఈ కారు ప్రత్యేకత. కార్బన్ ఫైబర్ తో బాడీ వర్క్ చేశారు.  బుగట్టి టైప్ 57 sc మోడల్ ఆధారంగా దీన్ని రూపొందించారు. భారతీయ మార్కెట్లో దీన్ని ధర రూ .115 కోట్లు.
 

2. రోల్స్ రాయిస్ బోట్ టైల్ (rolls Royce boat tail)
టాప్ 2 లో నిలిచిన కారు ఇది.  రూ. 233.28 కోట్లు ధర పలికే ఈ కారు నాటికల్ థీమ్ డిజైన్, పారాసోల్  లుక్ తో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. వెనుక భాగం హోస్టింగ్ సూట్ కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. 

1. రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్ టైల్ (rolls Royce la rose noire drop tail)
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా నమోదైన కార్ ఇది. హస్తకళ ద్వారా ప్రత్యేకమైన డిజైన్ తో దీన్ని రూపొందించారు. బ్లాక్ బకార రోజ్ మోడల్ నుంచి స్ఫూర్తి పొంది దీన్ని తయారు చేశారు.  దీని ధర అక్షరాల రూ. 249.48 కోట్లు.

Latest Videos

click me!