భూమిపై అత్యంత వేగం కలిగిన టాప్ 10 జంతువులు

First Published | Aug 7, 2024, 6:29 PM IST

లక్ష్యాన్ని చేరుకోవాలంటే వేగం, నైపుణ్యం చాలా అవసరం. అది వేట అయినా.. జీవిత గమనమైనా.. మనిషికి అనేక ధ్యేయాలు ఉంటాయి. అయితే జంతువులన్నిటికీ ఉన్న ఏకైక లక్ష్యం మాత్రం ఆహారం సంపాదించడం, ప్రాణాలు కాపాడుకోవడం.. భూమి మీద అలాంటి వేగం, నైపుణ్యం ఉన్న టాప్ 10 జంతువుల వివరాలు తెలుసుకుందాం రండి.

పెరాగ్రైన్ ఫాల్కన్ 
అత్యంత వేగంగా ఎగిరే పక్షి ఇది. అత్యద్భుతమైన వేట నైపుణ్యం దీని సొంతం. ఆహారం కోసం డైవింగ్ చేసేటప్పుడు సుమారు 240mph కంటే ఎక్కువ వేగంతో దూకుతుంది.

బ్రౌన్ హేర్
గోధుమ వర్ణంలో ఉండే ఈ కుందేలు 45 mph వేగంతో పరిగెత్తగలదు. బహిరంగ ప్రదేశాలలో వేటాడే జంతువుల నుంచి త్వరగా తప్పించుకోవడానికి ఇవి వాటి పొడవాటి కాళ్లను ఉపయోగిస్తాయి. 

చిరుత 
నేలపై అత్యంత వేగంగా పరుగుపెట్టే జంతువు ఇది. 70 mph వేగంతో దూసుకుపోతుంది. దాని ఆహారాన్ని పట్టుకోవడం కోసం దాని శక్తినంతా ఉపయోగించి పరిగెడుతుంది.


సెయిల్ ఫిష్ 
నీటిలో ఈదే జంతువులన్నిటిలో  సెయిల్ ఫిష్ అత్యంత వేగం కలది. 68 mph వేగంతో ఈదుతుంది. ఇది పెద్ద చెర చేప లాంటి ఆకర్షణీయమైన శరీరాకృతిని కలిగి ఉంటుంది.

మార్లిన్
50 mph వేగంతో నీటిలో ఈదగల చేప ఇది. దీని స్ట్రీమ్ లైన్డ్ శరీరం, సూదిలాంటి ముక్కు నీటిలో వేగంగా కదలడానికి సహాయ పడతాయి. 

సింహం
అడవికి రాజుగా పిలవబడే సింహం గంటకు 50 మైళ్ల వేగంతో పరుగు పెట్టగలదు. ఇతర జంతువులను వేటాడినప్పుడు అవి ఎంత వేగంతో పరుగు పెట్టినా ఒక్క పంజా దెబ్బతో కొడుతూ వాటి వేగాన్ని తగ్గించేస్తాయి. 

బ్లూ వైల్డ్ బీస్ట్
ఈ జంతువులు ఆఫ్రికన్ మైదానాల మీదుగా మందలు మందలుగా వలసపోతాయి. 50 mph వేగంతో పరుగు పెట్టడం వల్ల వాటి శత్రువుల నుంచి తప్పించుకుంటాయి. 

ప్రోన్ హార్న్ జింక
భూమిపై అత్యంత వేగంగా పరుగు పెట్టే జంతువుల్లో రెండోది ఈ జింక. 55 mph వేగంతో పరిగెత్తగలదు. ఇది చాలా ఓర్పును కలిగి ఉంటుంది. అందువల్ల చాలా దూరం అత్యంత వేగంగా పరుగెడుతుంది. 

క్రిష్ణ జింక
క్రిష్ణ జింక భారత ఉప ఖండానికి చెందినది. 50 mph వేగంతో పరుగెత్తగల ఈ జింక తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన శక్తి మేరకు పరుగెత్తగలరు. 

గ్రేహౌండ్
గ్రేహౌండ్ అత్యంత వేగవంతమైన కుక్క. ఇది 45 mph వేగంతో పరుగు పెడుతూ లక్ష్యాన్ని చేరుకుంటుంది. దానికున్న సన్నని శరీరం, పొడవాటి కాళ్లు అత్యంత వేగంగా పరుగుపెట్టడానికి సహాయ పడతాయి. రేసింగ్ లో దీన్ని మించిన కుక్క లేదు. 
 

Latest Videos

click me!