మీరు ప్రకృతి ప్రేమికులా..? : అయితే ఇండియాలోని ఈ టాప్ 10 బీచులు చూసితీరాల్సిందే..

First Published | Aug 6, 2024, 11:21 PM IST

భారతదేశం ప్రకృతి అందాలకు నిలయం. ముఖ్యంగా దేశంలోని సముద్రతీర అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఇలా దేశంలో తప్పకుండా చూడాల్సిన అత్యుత్తమ బీచులు ఇవే... 

Top 10 Beahes in India

Top 10 Beahes in India : అలా హాయిగా కాళ్లను తాకే అలలు, సుతిమెత్తని ఇసుకతెన్నెల్లో నడుస్తుంటే... ప్రకృతి ప్రేమికులకు ఇంకేం కావాలి. భార్యాపిల్లలతో సముద్రపు నీటిలో జలకాలాడుతూ సంతోషంగా గడిపితే... ఆ ఫ్యామిలీకి ఇంకేం కావాలి. చల్లని సాయంత్రం వేళ ప్రేమ జంట ఇసుకతిన్నెల్లో కూర్చుని ముచ్చట్లాడుతుంటే... స్నేహితులంతా కలిసి సరదాగా సందడి చేస్తుంటే... ఆ సంతోషమే వేరు. ఇలా చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు ప్రతిఒక్కరు ఎంజాయ్ చేసే అందమైన ప్రాంతమే సముద్రం తీరం.
 

Top 10 Beahes in India

సుదీర్ఘమైన సముద్ర తీరం కలిగిన ఇండియాలో ఈ బీచ్ సంస్కృతి ఎక్కువనే చెప్పాలి. ప్రతి స్నేహితుల బృందం కనీసం ఒక్కసారయినా గోవాకు వెళ్లాలని కోరుకుంటారు... అక్కడ అందమైన సముద్ర తీరంలో చిల్ అవ్వాలని భావిస్తారు. అయితే బీచ్ అంటే కేవలం గోవా మాత్రమే కాదు దేశంలో ఇంకా చాలా వున్నాయి... ఇంకా చెప్పాలంటే మన దక్షిణాదిలోనే గోవాను తలదన్నే బీచులున్నాయి.  


Top 10 Beahes in India

కొన్ని బీచ్ లు ప్రకృతి అందాలను ఫేమస్ అయితే... మరికొన్ని వాటర్ గేమ్స్ కు ఫేమస్. ఇంకొన్ని ఆద్యాత్మికత, మరికొన్ని విదేశీ సంస్కృతి కలిగినవి. కొన్ని అత్యంత శుభ్రమైన నీటిని కలిగినవి...ఇంకొన్ని అత్యంత రద్దీవి. ఇలా దేశంలోని ఒక్కోబీచ్ ఒక్కోదానికి ఫేమస్. ఇలా ఎదో ఒకవిషయం పేరుగాంచి పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న భారత్ లోని టాప్ 10 బీచుల గురించి తెలుసుకుందాం.
 

Top 10 Beahes in India

రాధానగర్ (హావ్‌లాక్) బీచ్, అండమాన్ నికోబార్ ద్వీపం : 

కేవలం భారతదేశంలోనే ప్రపంచంలోనే అందమైన బీచెస్ లో ఈ రాధానగర్ బీచ్ ఒకటి.  ఈ బీచ్ 2024,2020 సంవత్సరాల్లో ఆసియాలోని అత్యుత్తమ బీచుల్లో ఏడవస్థానంలో నిలిచింది... దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఈ బీచ్ లో ప్రకృతి అందాలు ఎలా వుంటాయో. మానవ ఆవాసాలకు దూరంగా తెల్లగా మెరిసిపోయే సన్నని ఇసుకతో ఈ బీచ్ అందాలు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తుంది. సాయంత్రంపూట ఈ బీచ్ లో నించుని సూర్యస్తమాన్ని చూస్తే... ఈ సీన్ జీవితాంతం గుర్తిండిపోయేలా వుంటుంది. ప్రేమికులు, హనీమూన్ జంటకు ఈ బీచ్ పర్పెక్ట్ ప్లేస్. 
 

Top 10 Beahes in India

వర్కలా బీచ్, కేరళ : 

తిరువనంతపురంకు దగ్గర్లోని అందమైన పర్యాటక ప్రాంతం వర్కాల బీచ్. ఈ బీచ్ కేవలం ప్రకృతి అందాలకే కాదు పవిత్రతకు నిలయం. ఇక్కడ సముద్ర నీటిలో ఔషద గుణాలు వున్నాయని... ఈ నీటిలో స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలే కాదు పాపాలు దూరం అవుతాయని నమ్మకం. ఈ బీచ్ సమీపంలో అనేక ఆయుర్వేద మసాజ్ సెంటర్లు వెలిసాయి... దీంతో ఆరోగ్యకరమైన బీచ్ గా వర్కలా పేరుపొందింది. 

Top 10 Beahes in India

గోకర్ణ బీచ్ , కర్ణాటక :  
 
కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ చిన్న పట్టణం... భారత దేశంలో సముద్ర తీరంలోని ఆద్యాత్మిక కేంద్రాల్లో ఇదీ ఇకటి. ఈ గోకర్ణ బీచ్ లో ఆద్యాత్మికతతో పాటు ఆహ్లాదకర వాతావరణం వుంటుంది. అందువల్లే ఈ బీచ్ ను అన్నిరకాల ప్రజలు ఇష్టపడుతున్నారు. 

Top 10 Beahes in India

పలోలెం బీచ్, గోవా : 

గోవా అంటేనే బీచ్ లకు ప్రసిద్ది. అక్కడ అనేక బీచ్ లు వున్నాయి... అందులో అత్యంత సుందరమైనది  ఈ పలోలెం బీచ్. చుట్టూ పచ్చగా పరుచుకున్న అందమైన అడవి, కొబ్బరి చెట్లు మధ్యలో అర్ధచంద్రాకారంలో ఈ బీచ్ వుంటుంది. ఈ బీచ్ అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుండే కాదు విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు.
 

Top 10 Beahes in India

శివరాజ్‌పూర్ బీచ్, గుజరాత్ : 

ద్వారకలో ఈ బీచ్ వుంది. ఈ బీచ్ లో సముద్రపు నీరు చాలా పరిశుభ్రంగా వుంటుంది. ఇది గుజరాత్ లో అత్యంత ప్రసిద్ది చెందిన బీచ్. పరిశుభ్రమైన నీటిలో నిలబడి సూర్యాస్తయాన్ని చూస్తుంటే అద్భుతమైన పీలింగ్ వుంటుంది. ఈ బీచ్ కు కుటుంబసమేతంగా వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.

Top 10 Beahes in India

మరారి బీచ్, కేరళ : 

కేరళలో అందమైన ప్రకృతి అందాలకు నిలయం ఈ మరారి బీచ్. ఇక్కడ సముద్ర తీరం బంగారు వర్ణపు ఇసుకతో మెరిసిపోతుంటుంది. చాలా ప్రశాంతంగా వుండే ఈ బీచ్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

Top 10 Beahes in India

అగోండా బీచ్, గోవా : 

దక్షిణ గోవాలోని బీచ్ ఇది. గోవాలో రద్దీ తక్కువగా వుండి... అద్భుత అందాలు కలిగిన బీచ్ ఇది. ముందు ఎగసిపడే అలలు,  వెనకాల పచ్చనిచెట్లు, మధ్యలోని ఇసుకతిన్నెలపై కూర్చుని ఎంజాయ్ చేయవచ్చు

Top 10 Beahes in India

తార్కర్లీ బీచ్, మహారాష్ట్ర : 

భారతదేశంలోని పగడ దిబ్బలతో కూడిన బీచ్ లలో తార్కర్లీ ఒకటి. ఈ బీచ్ లో అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. సముద్రపు హోరును వింటూ ఇసుక తిన్నెల్లో నడక ఎంతో హాయినిస్తుంది. 

Top 10 Beahes in India

రిషికొండ బీచ్, ఆంధ్ర ప్రదేశ్ :

సముద్ర తీరంలోని విశాఖపట్నం అందమైన బీచ్ ఈ రుషికొండ. స్వచ్చమైన నీటితో, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగివుంటుంది ఈ బీచ్. ప్రకృతి అందాలతో పాటు వాటర్ గేమ్స్ ను  ఈ బీచ్ లో ఎంజాయ్ చేయవచ్చు. 

Top 10 Beahes in India

గోల్డెన్ బీచ్, ఒడిషా : 

ప్రముఖ ఆద్యాత్మిక కేంద్ర పూరికి సమీపంలో అందమైన ప్రకృతితో కూడివుంది ఈ గోల్డెన్ బీచ్. నిత్యం పర్యాటలకు తాకిడి ఎక్కువగా వున్నా ఈ సముద్ర తీరం చాలా పరిశుభ్రంగా వుంటుంది. సముద్రపు నీరు కూడా చాలా పరిశుభ్రంగా వుంటుంది. పూరీ ఆలయ సందర్శనకు వెళ్ళేవారు ఈ బీచ్ కు వెళుతుంటారు. 

Latest Videos

click me!