మీరు తాగుతున్న నీళ్లు మంచివేనా? ఇలా తెలుసుకోండి..

First Published Jul 3, 2024, 3:31 PM IST

ఆహారం లేకుండా వారం పదిరోజులైనా ఉండొచ్చు కానీ.. నీళ్లు లేకుండా ఒకటి రెండు రోజులు కూడా ఉండలేం. నీళ్లు మన శరీరానికి చాలా చాలా అవసరం. కానీ మనం తాగే నీళ్లు కూడా కలుషితం అవుతాయి. వీటిని తాగితే లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే మీరు తాగే నీళ్లు మంచివా? కావా? అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

మన శరీరంలో నీళ్లు పుష్కలంగా ఉంటేనే మన శరీరం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనం తాగే నీరు మంచివేనా? కావా? అని ఎవరూ చెక్ చేయరు. కానీ చాలాసార్లు నీరు కలుషితమవుతుంది. . ఈ కలుషితమైన నీళ్లను తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే మీరు తాగే నీళ్లు మంచివేనా? కావా? అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

1. మీరు తాగే నీళ్లు మంచివేనా? కావా? అని తెలుసుకోవడానికి ముందుగా ఆ నీళ్ల టేస్ట్ ను, వాసనను చూడండి. సాధారణంగా శుభ్రమైన నీళ్లు ఎలాంటి రుచి ఉండవు. వాసన ఉండవు. కానీ మీరు తాగే నీళ్లు ఏదైన రుచి లేదా వాసన వస్తున్నట్టైతే దానిలో రసాయనాలు లేదా బ్యాక్టీరియా  ఉందని అర్థం చేసుకోవాలి. 

Latest Videos


2.  కలుషితమైన నీటిని గుర్తించడానికి నీటి రంగు నీటి రంగు, స్వచ్ఛంగా ఉన్నాయో? లేదో? చెక్ చేయండి. నీళ్లలో ఏదైనా రంగు లేదా ఆనవాళ్లు కనిపిస్తే అవి కలుషిత నీరని అర్థం చేసుకోండి. పరిశుభ్రమైన వాటర్ ఎప్పుడూ పారదర్శకంగా ఉంటాయి. అలాగే ఎలాంటి రంగులో ఉండవు. 

3. నీళ్లను మరిగించి కూడా అవి మంచివా? కావా? అని తెలుసుకోవచ్చు. ఇందుకోసం నీళ్లను 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగించి ఆ తర్వాత నీటిని చల్లారనివ్వండి. నీరు మరిగించిన తర్వాత వాసన లేదా వింతగా రుచి  ఉంటే అవి కలుషితమైనట్టే. 

4. మీరు pH టెస్టర్ ఉపయోగించి కూడా నీళ్లు మంచివేనా? అని తెలుసుకోవచ్చు. ఈ టెస్టర్ ను ఉపయోగించి నీటి pH చెక్ చేయండి. తాగునీటిలో పీహెచ్ 6.5 నుంచి 8.5 మధ్య ఉంటుంది. దీనికంటే ఎక్కువ లేదా తక్కువ ఉంటే ఈ నీళ్లలో రసాయనాలు ఉన్నట్టే. 

5. టీడీఎస్ మీటర్ ఉపయోగించి కూడా నీళ్ల స్వచ్ఛతను చెక్ చేయొచ్చు. టీడీఎస్ స్థాయి 50 నుంచి 150 పీపీఎం మధ్య ఉంటే అవి మంచి నీరని అర్థం. అయితే టీడీఎస్ లెవెల్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ నీటిలో కరిగిన ఘనపదార్థాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ నీళ్లను తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది.

click me!