చాలా మందిని ఈ మధ్యకాలంలో కామన్ గా వేధిస్తున్న సమస్య గురక. ఈ గురక కారణంగా పక్కన ఉన్నవారు నిద్రపోలేరు. అంతేకాదు.. వారు కూడా ప్రశాంతంగా నిద్రపోలేరు. దానిని కంట్రోల్ చేయడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు అయితే ఏకంగా మందులు కూడా వాడే ఉంటారు. అయినా కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని మీరు భావిస్తున్నట్లయితే... ఈ కింది చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే.
అధిక బరువు, ముఖ్యంగా పొట్ట ఉన్నవారికి ఎక్కువగా గురక వచ్చే అవకాశం ఉంది. వారు చిన్నపాటి కునుకు తీసినా కూడా భయంకరమైన గురక వచ్చేస్తుంది. అందుకే.. ముందుగా.. వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. దాని వల్ల వెంటనే మీ పొట్ట కరగకపోవచ్చు. కానీ.. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల.. గురక వీలైనంత వరకు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది.
మనం దిండుతో కూడా గురకను కంట్రోల్ చేయవచ్చని మీకు తెలుసా..? తల కింద కాస్త ఎత్తుగా దిండు పెట్టుకోవడం వల్ల.. గురకను కంట్రోల్ చేయవచ్చట. సాధారణంగా ఒక దిండు పెట్టుకొని పడుకుంటాం. కానీ అలా కాకుండా.. రెండు దిండ్లు లేదంటే.. కాస్త ఎత్తుగా వేసుకొని పడుకోవడం వల్ల గురక వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది.
ఇక ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే... నిద్రపోయే ముందు.. నోరు తెరిచి పడుకుంటారు. అలా పడుకోవడం వల్ల కూడా గురక వస్తూ ఉంటుంది. కాబట్టి.. నోరు తెరిచి కాకుండా మూసుకొని పడుకోవడం అలవాటు చేసుకోవాలి.
చాలా మంది చేసే మరో తప్పు.. పడుకోవడానికి ముందు భోజనం చేయడం. అలా చేయకూడదు. కనీసం పడుకోవడానికి రెండు గంటలు ముందు భోజనం పూర్తి చేయడం వల్ల కూడా.. గురక సమస్య రాకుండా ఉంటుంది.
snoring
మద్యం తాగే అలవాటు ఉన్నవారిలోనూ గురక సమస్య ఉంటుది. నిజానికి ఇదే అసలు సిసలైన పెద్ద కారణం. పడుకునే ముందు తాగి పడుకున్నారంటే.. వారికి గురక రావాల్సిందే. మందు తాగడం వల్ల.. సాధారణం కంటే.. ఎక్కువ గురక వస్తుంది. కాబట్టి.. మద్యం తాగే అలవాటు మానుకోవడం మంచిది.
snoring
మద్యం మాత్రమే కాదు.. పొగ తాగడం కూడా గురకకు కారణం అవుతుంది. కాబట్టి.. వీలైనంత వరకు.. మీరు ఆరోగ్యంగా ఉండటానికి మద్యం, పొగతాగడం వంటివి చేయకపోవడమే మంచిది. ఈ ట్రిప్స్ ఫాలో అయితే.. కచ్చితంగా గురక తగ్గుతుంది.