టమాటాలు ఎక్కువ రోజులు కుళ్లిపోకుండా.. ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?

First Published Oct 28, 2024, 10:50 AM IST

మనం చేసే ప్రతి కూరలో టమాటాలను ఖచ్చితంగా వేస్తాం. అందుకే ప్రతి ఇంట్లో టమాటాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ టమాటాలు కొనితెచ్చిన మూడు నాలుగు రోజుల్లోనే ఒక్కొక్కటిగా పాడైపోతుంటాయి. ఇలా కాకూడదంటే ఏం చేయాలో తెలుసా? 

tomatoes

మన ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా టమాటాలు మాత్రం పక్కాగా ఉంటాయి. ఎందుకంటే ఈ కూరగాయల్ని మనం ప్రతి ఒక్క కూరలో వేస్తుంటాం. అందుకే వీటిని ఎక్కువ మొత్తంలో ఒకేసారి కొనేసి ఇంట్లో నిల్వ చేస్తుంటారు. నిజానికి టమాటాలు కూరలను చాలా టేస్టీగా చేస్తాయి. అలాగే ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

tomatoes

అయితే బాగా పండిన టమాటాలు ఒకటి రెండు రోజుల్లోనే పాడైపోతుంటాయి. అదే కొంచెం కచ్చి టమాటాలు అయితే వారం రోజుల్లోపే కొన్ని కొన్ని పాడైపోతుంటాయి.

కొన్ని కొన్ని సార్లు మనం వాడేవాటికన్నా ఎక్కువగా పాడైపోతుంటాయి. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం తొందరగా కుళ్లిపోకుండా, ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

టమాటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?

గది ఉష్ణోగ్రత వద్ద పండని టమాటాలను పెట్టండి

బాగా పండిన టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి మీరు కొనేటప్పుడు టమాటాలు బాగా పండకుండా చూసుకోండి. అలాగే వీటిని ఫ్రిజ్ లో కాకుండా.. ఇంట్లో గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయండి. అలాగే వీటిని కాండం వైపు కిందకు అభిముఖంగా ఉంచండి. అలాగే అన్నీ పండు అయ్యేందుకు వీటికి ఎండను తగలనివ్వకండి.  
 

Latest Videos


పండిన టమాటాలను ఫ్రిజ్ లో పెట్టండి

మీరు కొన్న టమాటాలు పూర్తి పక్వానికి వచ్చిన్న తర్వాత.. అవి మరింత పండ్లు కాకుండా చేయడానికి, కుళ్లిపోకుండా చేయడానికి వాటిని ఫ్రిజ్ లో నిల్వ చేయండి. వీటిని ఉపయోగించడానికి ముందు ఫ్రిజ్ లో నుంచి తీసిన తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ఒక గంట పాటు ఉంచాలి. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్ టమాటాల రుచిని, ఆకృతిని తగ్గిస్తుంది.

స్టోరేజీ కంటైనర్లలో పేపర్ టవల్స్ ఉంచండి

టమాటాలను ఫ్రిజ్ లో పెట్టినట్టైతే, అవి అదనపు తేమను గ్రహించడానికి కంటైనర్ లేదా డ్రాయర్ లోపల కాగితపు టవల్స్ ను పెట్టండి. ఇది టమాటాలను పొడిగా ఉంచుతుంది. అలాగే తొందరగా కుళ్లిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. 

ప్లాస్టిక్ సంచులను నివారించండి

ఎప్పుడైనా సరే టమాటాలను ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే ఇవి తేమను ట్రాప్ చేస్తాయి. ఇది త్వరగా కుళ్లిపోయేలా చేస్తాయి. అందుకే గాలి ఆడే కంటైనర్లను వాడండి.   ప్లేట్లో లేదా బుట్టలో వేయండి. బ్యాగ్ లో వేస్తే గనుక దానికి ఒక రంధ్రాన్ని పెట్టండి. 

వీటికి దూరంగా ఉంచండి

టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా, త్వరగా కుళ్లిపోకుండా ఉండాలన్నా టమాటాలను అరటిపండ్లు, ఆపిల్, అవొకాడోలు వంటి పండ్లు ఇథిలిన్ వాయువును విడుదల చేసే వాటికి దూరంగా ఉంచండి. ఇవి పక్వాన్ని పెంచుతాయి. అలాగే టమటాలు తొందరగా పండుతాయి.

అదనపు టమాటాలను ఫ్రీజ్ చేయండి

మీరు ఉపయోగించేవాటికన్నా టమాటాలు ఎక్కువగా ఉంటే వాటిని ఫ్రీజ్ చేయడం మంచిది. టమాటాలు వేస్ట్ గా కుళ్లిపోయే బదులుగా వీటిని ఫ్రీజ్ చేసి ఉపయోగించడం మేలు.

ఇందుకోసం టమాటాలను బ్లాంచ్ చేయండి. తర్వాత గాలి వెళ్లని కంటైనర్లు లేదా ఫ్రీజర్ సంచులలో ఫ్రీజ్ చేయండి. ఈ పద్ధతి సాస్లు లేదా సూప్లలో టమాటాలను ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. 

click me!