ఏం చేస్తే వైట్ షర్ట్, డ్రెస్సులపై మరకలు పోతాయో తెలుసా?

First Published | Jul 25, 2024, 4:27 PM IST

తెల్ల దుస్తులు ప్రతి ఒక్కరికీ నప్పుతాయి. వీటిలో ఎవ్వరైనా బాగుంటారు. అందుకే ప్రతి ఒక్కరికీ ఐదారు జతల తెల్ల దుస్తులు ఉంటాయి. కానీ వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వీటికి ఏవైనా మరకలు అంటితే అంత సులువుగా పోవు. కానీ మీరు మాత్రం పోగొట్టొచ్చు. ఎలాగంటే? 

మనందరికీ కనీసం ఐదారు జతల వైట్ డ్రెస్సులు ఉంటాయి. నిజానికి తెల్ల దుస్తులు ప్రతి ఒక్కరికీ సెట్ అవుతాయి. వీటిలో అందంగా కనిపిస్తారు. ఇక పురుషులైతే పెళ్లిళ్లు, ఫంక్షన్ల నుంచి చిన్న చిన్న దావత్ లకు కూడా వైట్ డ్రెస్సులను వేసుకుంటుంటారు. కానీ ఈ వైట్ డ్రెస్సులను మెయింటైన్ చేయడం చాలా కష్టం. వీటికి ఏవైనా చిన్న మరకలు అంటినా.. అవి అస్సలు పోవు. అందులోనూ ఇవి ప్రతి వాష్ కు మసకబారుతుంటాయి. అలాగే వీటికి అంటిన మరకు పసుపు రంగులోకి మారుతాయి. ఇవి పాత వాటిలా కనిపిస్తాయి. వీటిని ఎంత వాష్ చేసినా.. మరింత మసకబారుతాయి. క్లాత్ కూడా పాడవుతుంది. కానీ మీరు కొన్ని చిట్కాలతో ఎన్ని రోజులైనా వైట్ డ్రెస్సులను కొత్త వాటిలా ఉంచొచ్చు. అలాగే మరకలను తొందరగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

నిమ్మరసంతో..

మీకు తెలుసా? నిమ్మరసం నేచురల్ స్టెయిన్ రిమూవర్ గా కూడా పనిచేస్తుంది.  అవును మీరు నిమ్మరసంతో  వైట్ డ్రెస్సులపై పసుపు రంగు మరకలను పోగొట్టొచ్చు. ఇందుకోసం ముందుగా ఒక బకెట్ లో వేడినీళ్లను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి కలపండి. దీనిలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ నీళ్లలో వైట్ డ్రెస్సులను ఒక గంట పాటు నానబెట్టండి. ఆ తర్వాత నీళ్లను నుంచి బయటకు తీసి చేతులతో రుద్దండి. లేదా బ్రష్ తో క్లీన్ చేయండి. ఆ తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగి ఆరబెట్టేస్తే సరి. ఈ విధంగా చేస్తే తెల్ల చొక్కాలోని పసుపు రంగు ఈజీగా పోతుంది. 
 

Latest Videos


బేకింగ్ సోడాతో..

వైట్ షర్ట్, డ్రెస్సులకు ఉన్న పసుపు రంగును తొలగించడానికి, తెలుపు రంగును కాపాడటానికి బేకింగ్ సోడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. తెల్లని బట్టలపై మరకలు ఉంటే ఈ సారి బేకింగ్ సోడాతో పోగొట్టండి. ఇందుకోసం ఒక బకెట్ లో వేడి నీటిని తీసుకుని అందులో రెండు కప్పుల బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయండి. దీనిలో వైట్ దుస్తులను నానబెట్టండి. ఒక అరగంట తర్వాత వాషింగ్ మెషీన్ లో ఎంజైమ్ ఫ్రీ డిటర్జెంట్ వేసి బట్టలను వాష్ చేయనివ్వండి. ఇలా చేయడం వల్ల బట్టలపై ఉన్న మరకలు తొలగిపోయి పసుపు రంగు కూడా పూర్తిగా పోతుంది. 
 

White Vinegar

వైట్ వెనిగర్ తో.. 

వైట్ వెనిగర్ తో కూడా మీరు తెల్లని బట్టలకు ఉన్న పసుపు రంగును పూర్తిగా పోగొట్టొచ్చు. ఈ వైట్ వెనిగర్ స్టెయిన్ రిమూవర్ లా కూడా పని చేస్తుంది. ఇందుకోసం అరకప్పు వైట్ వెనిగర్ ను తీసుకుని అర బకెట్ నీటిలో వేసి కలపండి. ఇప్పుడు దీనిలో తెల్ల బట్టలను నానబెట్టండి. వైట్ వెనిగర్ దస్తులకు ఉన్న మరకలను పసుపు రంగులోకి తీసుకొస్తుంది. అరగంట తర్వాత వెనిగర్ వేసిన నీటిలో నుంచి దుస్తులను తీసేసి డిటర్జెంట్ ఉపయోగించి శుభ్రమైన నీటితో శుభ్రం చేయండి. ఇది కోల్పోయిన తెల్ల దుస్తుల ప్రకాశాన్ని తిరిగి తెస్తుంది.

కాస్టిక్ సోడా తో.. 

సోడియం హైడ్రాక్సైడ్ అని కూడా పిలువబడే కాస్టిక్ సోడాను వైట్ డ్రెస్సులను మరింత తెల్లగా చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. కానీ ఇది మన చర్మాన్ని మాత్రం హాని చేస్తుంది. అందుకే దీన్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్టిక్ సోడాను తాకే ముందు చేతులకు గ్లౌజులను ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే దీనిని పిల్లలకు దూరంగా ఉంచాలి. కాస్టిక్ సోడా మార్కెట్లో ద్రవ, ఘన రూపంలో దొరుకుతుంది. వైడ్ డ్రెస్సులను శుభ్రం చేయడానికి ఒక బకెట్ నీటిలో డిటర్జెంట్ పౌడర్ ను మిక్స్ చేసి దానిలో రెండు నుంచి మూడు టీస్పూన్ల కాస్టిక్ సోడా ను మిక్స్ చేసి కట్టె  సహాయంతో నీటిలో కలపండి. దీనిలో దుస్తులు వేసి రెండు మూడు గంటల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత బట్టలు బయటకు తీసి సాధారణ పద్ధతిలో శుభ్రం చేయండి. 
 

click me!