బెల్లం కల్తీని ఎలా కనిపెట్టాలో తెలుసా?...

First Published | Sep 20, 2021, 3:48 PM IST

మార్కెట్లో రకరకాల బెల్లం దొరుకుతుంది. నల్లబెల్లం, తెల్లబెల్లం, అరిసెల బెల్లం, పాకం బెల్లం, ఉప్పు బెల్లం అని.. రకరకాలుగా దొరుకుతుంది. అయితే ఈ బెల్లాలన్నీ సహజసిద్ధంగా తయారు చేసినవే. కానీ.. ఏ రకం బెల్లం మీరు వాడుతున్నా.. అందులో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఎలా? దీనికోసం ఏదైనా ఉపాయం ఉందా?

చక్కటి భోజనం తరువాత ఓ బెల్లం ముక్క తింటే.. ఆహా ఆ అనుభూతే వేరు. అంతేకాదు ఇది భోజనాన్ని పూర్తి చేయడమే కాకుండా సంతృప్తిని ఇస్తుంది. అంతేకాదు చక్కెరకు బదులుగా బెల్లం వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని, బెల్లంలోని పోషకాలు శరీరానికి మంచివని ఎంతో మంది ఆరోగ్య నిపుణులు చెబుతారు. 

అయితే, ఇంత మంచి లక్షణాలున్నా బెల్లం కల్తీ అయితే? సహజసిద్ధమైనది కాకుండా అందులో రసాయనాలు కలిపి తయారుచేసిందయితే? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మీ శరీరానికి ఎంతో నష్టం చేస్తుంది. ఇలాంటి కల్తీ బెల్లం వల్ల తరచుగా అలెర్జీలు, ఆరోగ్యసమస్యలు తలెత్తుతుంటాయి. 

మార్కెట్లో రకరకాల బెల్లం దొరుకుతుంది. నల్లబెల్లం, తెల్లబెల్లం, అరిసెల బెల్లం, పాకం బెల్లం, ఉప్పు బెల్లం అని.. రకరకాలుగా దొరుకుతుంది. అయితే ఈ బెల్లాలన్నీ సహజసిద్ధంగా తయారు చేసినవే. కానీ.. ఏ రకం బెల్లం మీరు వాడుతున్నా.. అందులో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఎలా? దీనికోసం ఏదైనా ఉపాయం ఉందా?

కల్తీ బెల్లంను గుర్తించడానికి చిట్కాలున్నాయని చెబుతున్నారు ఫుడ్ ఎక్స్ పర్ట్స్. మామూలుగానే బెల్లం తయారీలో కొంత మొత్తంలో రసాయనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. “బెల్లం శుభ్రం చేయడానికి, సోడాతో పాటు కొన్ని రసాయనాలు ఉపయోగిస్తారు. మామూలుగా బెల్లం ముదురు రంగులో ఉండాలి. బెల్లం తెల్లగా ఉండడం లేదా పసుపు రంగులో ఉంటే వాటిని రసాయనాలు కలిపినట్టు గుర్తించాలి. 

బెల్లం క్యూబ్స్‌లో కాల్షియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ ఉండొచ్చు. బెల్లం బరువును పెంచడానికి ప్రాసెస్ చేసేటప్పుడు కాల్షియం కార్బోనేట్ జోడించబడుతుంది, అయితే సోడియం బైకార్బోనేట్ బెల్లానికి మంచి పాలిష్ లుక్ ఇస్తుంది. ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండే బెల్లం ఎక్కువగా రసాయనాలు ఉండవు. ముదురు రంగు బెల్లం సహజసిద్ధమైనది. ఎలాగంటే బెల్లం తయారీ కోసం చెరకు రసం ఉడకబెట్టినప్పుడు అది ముదురు గోధుమ మిశ్రమంలోకి మారుతుంది. దీనిని బెల్లం తయారీకి ఉపయోగిస్తారు. ఈ మిశ్రమానికి రసాయనాలు జోడించడం వల్ల బెల్లం తెల్లగా కనిపిస్తుంది.

బెల్లం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : దీనికి విరుగుడు బెల్లం కొనేప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే... బెల్లం కల్తీని గుర్తించవచ్చు. బెల్లం కొంచెం తుంచి నోట్లో వేసుకుంటే... చిరు చేదు, లేదా ఉప్పుగా ఉంటే అది మంచి బెల్లం కాదని తెలుసుకోవాలి. అంతేకాదు బెల్లంలో చక్కెర స్పటికాలు కనిపిస్తే కూడా కల్తీ అని గుర్తుంచుకోవాలి. బెల్లంలో తీపి రుచిని పెంచడానికి స్ఫటికీకరణ జరుగుతుంది.

కొనుక్కొచ్చిన బెల్లం కల్తీదో, కాదో తెలుసుకోవాలంటే చిన్న టెస్ట్...  ఒక గిన్నె లేదా పాత్రను తీసుకోని, దానికి సుద్ద పొడి, బెల్లం ముక్కను కలిపితే.. సుద్దపొడి నీటి అడుగుకు చేరితే బెల్లం కల్తీ అని అర్థం.

కొనుక్కొచ్చిన బెల్లం కల్తీదో, కాదో తెలుసుకోవాలంటే చిన్న టెస్ట్...  ఒక గిన్నె లేదా పాత్రను తీసుకోని, దానికి సుద్ద పొడి, బెల్లం ముక్కను కలిపితే.. సుద్దపొడి నీటి అడుగుకు చేరితే బెల్లం కల్తీ అని అర్థం.

Latest Videos

click me!