చలికాలం కొబ్బరి నూనె గడ్డ కడుతోందా.? ఇలా చేయండి..

First Published | Jan 9, 2025, 1:12 PM IST

ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో కొబ్బరి నూనె ఒకటి. కేరళ లాంటి రాష్ట్రాల్లో అయితే దీన్ని వంటలకు ఉపయోగిస్తారు. కానీ మనం మాత్రం తలకు పెట్టుకోవడానికే ఉపయోగిస్తుంటాం. మార్కెట్లోకి ఎన్ని రకాల సెరమ్స్‌ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ చాలా మంది కొబ్బరి నూనెను తలకు పట్టిస్తుంటారు. అయితే చలికాలంలో కొబ్బరి నూనె గడ్డ కట్టడం సర్వసాధారణమైన సమస్య. మరి దీనికి సొల్యుషన్‌ ఏంటో తెలుసా.? 
 

చలికాలం వచ్చిందంటే చాలు అందరి ఇళ్లలో ఉండే సమస్య కొబ్బరి నూనె డబ్బాతో కుస్తీ పడడం. ఉదయం లేవగానే తలకు నూనె పెట్టుకోవడానికి డబ్బా ఓపెన్‌ చేస్తారు. ఎంతకీ ఆయిల్‌ చేతులోకి రాదు. దీంతో చేతిలో డబ్బాను కొడుతూ ఉంటారు. వాతావరణం చలిగా మారడంతో కొబ్బరి నూనె గడ్డకడుతుందని తెలిసిందే. అయితే కొబ్బరి నూనె గడ్డకట్టకుండా ఉండాలన్నా, గడ్డ కట్టిన కొబ్బరి నూనెను సులభంగా కరిగించాలన్నా కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image: Freepik

చలికాలంలో కొబ్బరి నూనె డబ్బాలను వేడిగా ఉండే ప్రదేశాల్లో ఉంచేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఫ్రిజ్‌పై, మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ పక్కన, వంటింట్లో స్టవ్‌ల పక్కన కొబ్బరి నూనె డబ్బాలను స్టోర్‌ చేయొచ్చు. ఇలాంటి ప్రదేశాల్లో వాతావరణం వెచ్చగా ఉంటుంది కాబట్టి సాధరణంగానే నూనె గడ్డకట్టదు. లాగే ఇంట్టోకి ఎండ వచ్చే ప్రదేశాలపై కిటికీల వద్ద కొబ్బరి నూనె డబ్బాలను పెట్టినా మంచి ఫలితం ఉంటుంది. 
 


Image: Getty Images

ఇక కొబ్బరి నూనె గడ్డకట్టకుండా ఉండాలంటే వాటిలో ఇతర నూనెలను కలిపిన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరి నూనెలో ఆలివ్ ఆయిల్, ఆవ నూనె, ఉసిరి ఆయిల్ లేదా నువ్వుల నూనె వంటివి కొంచెం కలపాలి. ఇలా చేయడం వల్ల కూడా కొబ్బరి నూనె గడ్డకట్టదు. అయితే కొంత మొత్తంలో కలిపినా ఫలితం ఉంటుంది. అందులోనూ ఈ ఆయిల్స్‌ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేవే కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. 
 

Image: Getty Images

కొబ్బరి నూనెలు సాధరణంగా ప్లాస్టిక్‌ డబ్బాల్లోనే వస్తాయని తెలిసిందే. అయితే చలికాలంలో వీటిలో కాకుండా గాజు లేదా స్టీల్‌ పాత్రల్లో నిల్వ చేసుకోవాలి. ఇలాంటి వాటిలో స్టోర్‌ చేసినా నూనె త్వరగా గడ్డకట్టదు. ఇలాంటి వాటిలో స్టోర చేస్తే వెలుపల ఉష్ణోగ్రత లోపలి నూనెను ప్రభావితం చేయకుండా ఉంటాయి.
 

ఇలా కరిగించండి.. 

ఇక ఒకవేళ చలికాలంలో కొబ్బరి నూనె గడ్డ కడితే కొన్ని సింపుల్‌ చిట్కాల ద్వారా కరిగించవచ్చు. కొద్దిసేపు ఎండలో పెడితే వెంటనే కరిగిపోతుంది. వేడి నీటిలో కాసేపు కొబ్బరి నూనె డబ్బను పెట్టినా వెంటనే కరిగిపోతుంది. అలాగే హెయిర్ డయ్యర్‌ కూడా నూనెను కరిగించేందుకు ఉపయోగపడుతుంది. కాసేపు హెయిర్‌ డయర్‌ను ఆన్‌ చేసి వేడి గాలిని డబ్బాలోకి వెళ్లేలా చేసినా వెంటనే కరిగిపోతుంది. 

Latest Videos

click me!