అబ్బాయిలూ... 40 దాటినా యంగ్ గా కనపడాలా.? ఇది మీకోసమే..!

First Published | Aug 6, 2024, 3:54 PM IST

అబ్బాయిలు ఎప్పుడూ బయట తిరుగుతూనే ఉంటారు.. రోడ్డు మీద కాలుష్యం, ఆఫీసు పని ఒత్తిడి  ఇలా పలు కారణాల వల్ల .. వారి ఫేస్ లోని గ్లో తగ్గిపోతూ ఉంటుంది.

తమ మయసు కంటే చిన్నవారిలా కనిపించాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ఎక్కువ మంది  అమ్మాయిలకు మాత్రమే అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది అనుకుంటారు. కానీ... అమ్మాయిల్లానే అబ్బాయిల్లోనూ ఈ కోరిక ఉంటుంది.  కానీ.. అబ్బాయిలు ఎప్పుడూ బయట తిరుగుతూనే ఉంటారు.. రోడ్డు మీద కాలుష్యం, ఆఫీసు పని ఒత్తిడి  ఇలా పలు కారణాల వల్ల .. వారి ఫేస్ లోని గ్లో తగ్గిపోతూ ఉంటుంది. అయితే... అబ్బాయిలు తమ వయసు కంటే చిన్నగా కనిపించాలి అంటే ఈ కింది చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.
 

అబ్బాయిలు యవ్వనంగా కనిపించడానికి బెస్ట్ చిట్కాలు..

నడక...మీరు రోజంతా కాలుష్యంతో బాధపడుతున్నట్లయితే...  స్వచ్ఛమైన గాలిని పొందడానికి ప్రతిరోజూ ఉదయం వాకింగ్ చేయడం మొదలుపెట్టండి. ఉదయం పూట కనీసం 15 నిమిషాలపాటు నడవాలి. అలా నడుస్తున్న సమయంలో.. మీరు డీప్ గా బ్రీత్ ీసుకోవాలి. మీరు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి ప్రయత్నించాలి. దాని వల్ల.. మీరు రోజంతా రిఫ్రెషింగ్ గా ఉండటానికి సహాయపడుతుంది.
 


నీరు ఎక్కువగా తాగండి...  వాకింగ్ కి వెళ్లడానికి ముందు... కనీసం రెండు గ్లాసుల మంచినీరు తాగండి.  వాకింగ్ తర్వాత కూడా వాటర్ తాగండి. రోజులో కనీసం ఎనిమిది గ్లాసుల  వాటర్ తాగాలి. వాటర్ తాగడం వల్ల. మీ స్కిన్ గ్లో అవుతుంది.


నో స్మోకింగ్: యువతకు అతి పెద్ద శత్రువు ధూమపానం. చాలా మంది ఇంట్లో తెలియకుండా రహస్యంగా ధూమపానం చేస్తుంటారు. లేదంటే గుట్కా వాడుతున్నారు. ధూమపానం మీ ఇమేజ్‌ను పాడుచేయడమే కాకుండా మీ యవ్వనాన్ని కూడా తింటుందని మీకు తెలియదా? కాబట్టి మీరు యవ్వనంగా , అందంగా కనిపించాలనుకుంటే వెంటనే స్మోకింగ్ మానేయండి.
 

sleep

మంచి నిద్ర అవసరం: పురుషులకు ఈ అలవాటు చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత టీవీ లేదా మొబైల్ చూడటం అలవాటు చేసుకున్నారు. అయితే ఇలా చేయడం వల్ల నిద్ర సమయం మీద ప్రభావం పడుతుంది. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, మీరు దాదాపు 8 గంటల పాటు నిద్రపోవడం చాలా ముఖ్యం.

Latest Videos

click me!