మీకు సిగ్గు, బిడియం ఎక్కువా? ఇదిగో వీటిని ఇలా వదిలించుకోండి

కొందరికి ప్రతి విషయంలోనూ సిగ్గు అవుతుంది. సిగ్గు కొన్ని విషయాల్లో బాగానే ఉంటుంది. కానీ ప్రతి విషయంలోనూ మీరు సిగ్గు పడితే మాత్రం ఎంతో కోల్పోవాల్సి వస్తుంది. ఈ సిగ్గు ఈ సమాజంతో మీకున్న సంబంధాన్ని కూడా తెంచుతుంది. అందుకే దీన్ని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

సిగ్గు పడటం సర్వ సాధారణ విషయం.  కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే సిగ్గు పడిపోతుంటాం. కానీ ప్రతి విషయంలో సిగ్గు పడితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. అవును సిగ్గు, బిడియం మిమ్మల్ని ఇతరులకు దూరంగా ఉంచుతాయి. ఎవ్వరితోనూ కలవనీయవు.

మీకు తెలుసా? సిగ్గు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితులలోనైనా ఎవ్వరితోనూ కలవకుండా, మాట్లాడకుండా చేస్తుంది.  ముఖ్యంగా ఇది మీ వ్యక్తిత్వ వికాసాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ సిగ్గు, బిడియాన్ని వదిలించుకోవడానికి మీరేం చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

సిగ్గుపడే వ్యక్తి ఎదుర్కొనే సమస్యలు

సిగ్గు మిమ్మల్ని ఇతరుల నుంచి దూరం చేస్తుంది. అలాగే సామాజిక కార్యక్రమాలలో పాల్గొనకుండా నిరోధిస్తుంది. సిగ్గు, బిడియం లక్షణాలున్న వ్యక్తి ఇతరులతో  మాట్లాడేటప్పుడు అభద్రత గురించి ఆలోచిస్తాడు. దీని వల్ల వారికి చెమటలు పడతాయి. అలాగే మైకంగా కూడా అనిపిస్తుంది. అలాగే కడుపు తిమ్మిరి వంటి సమస్యలను కూడా ఫేస్ చేస్తాడు. 

సిగ్గు మీ జీవితంలోని ప్రతి విషయాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు.. పని ప్రదేశం, వ్యక్తిగత జీవితంలో సిగ్గు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీకు తెలుసా? ఇది మీ ఆత్మగౌరవం లేదా ఆత్మవిశ్వాసాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈ లక్షణాలున్న వారికి కొత్త ఫ్రెండ్స్ అవ్వడం కష్టమే. 


సిగ్గుతో ఎలా వ్యవహరించాలి?

1. మీరు ఈ స్వభావం నుంచి బయటపడటానికి మీరే చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి. కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులతో రోజూ మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సిగ్గు, బిడియం నెమ్మదిగా తగ్గుతాయి. 

life mangment Tips

2. మీ ప్రతిభను, విజయాన్ని గుర్తించే సమయంలో మీరు సిగ్గుపడితే మీ జీవితంలో ఎన్నో కొత్త అవకాశాలను కోల్పోవచ్చు. అందుకే మీ బలాబలాలేంటో తెలుసుకుని వాటిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
 

3. అందరూ మిమ్మల్నే చూస్తున్నారని భావించడం మానేయండి. అలాగే ఇతరులు మీ ప్రతి విషయాన్ని పట్టించుకోవడం లేదని గుర్తుంచుకోండి. అయినా ఇది నిజం కూడా. ఎవరి లైఫ్ ను వాళ్లు పట్టించకోవడంలోనే బిజీగా ఉంటారు. అందుకే మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. సిగ్గు పడటం మానేయండి. 
 

4. మీకు తెలుసా.. మన శత్రువు మరెవరో కాదు మనమే. మనల్ని మనం సమాజానికి దూరంగా ఉంచుకుంటాం. ఇదే మీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఎన్నో అకాశాలు కోల్పోయేలా చేస్తుంది. అందుకే ఇకపై సిగ్గు, బిడియానికి దూరంగా ఉండండి. ఇతరులతో కలిసి ఉండండి. ఇది మీలోని భయం, సిగ్గును తొలగించడానికి సహాయపడుతుంది.

5. సిగ్గు, బిడియాన్ని అధిగమించాలంటే ముందుగా ఓటమిని అంగీకరించండి.  అవమానాన్ని జయించాలంటే మీరు ఓటమిని అంగీకరించడం నేర్చుకోవాలి. మీరు వైఫల్యాలను అంగీకరిస్తే విజయం మీ చెంతకు చేరుతుంది.

Latest Videos

click me!