ప్రస్తుతం పండగ సీజన్ నడుస్తోంది. ఇక పండగళ వేళ మనం అందరం కొత్త దస్తులు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎక్కువగా మహిళలు.. పండగ రోజుల్లో పట్టుచీరలు కట్టుకుంటూ ఉంటారు. అయితే.. కట్టుకోవడానికి ముందు అయినా... కట్టుకున్న తర్వాత అయినా.. పట్టుచీరలకు ఐరన్ అవసరం. కేవలం పట్టు చీరలు మాత్రమే కాదు.. కాటన్ దుస్తులకు కూడా ఐరన్ అవసరం. ఈ దుస్తులు ఇంట్లో ఐరన్ చేయడానికి చాలా మంది భయపడతారు. మనకు సరిగా రావు.. బయట ఐరన్ కి ఇద్దాం అని అనుకుంటూ ఉంటారు. కానీ.. ఇంట్లోనే ఈజీగా వాటిని ఎలా ఐరన్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
కాటన్ దుస్తులు ఐరన్ చేయడం ఎలా..?
పండగ సందర్భంగా ఎక్కువగా అమ్మాయిలు కాటన్ దుస్తులు, కుర్తాలు ధరించడానికి ఇష్టపడతారు. మీరు కూడా దీపావళి పండగ రోజున కాటన్ దుస్తులు ధరించాలని ఆలోచిస్తున్నట్లయితే... వాటిని ఐరన్ చేయడానికి ముందుగా.. వాటిపై నీళ్లు చల్లాలి. ఇలా చేయడం వల్ల వస్తం మృదువుగా మారుతుంది. దీని వల్ల.. ఐరన్ చేయడం సులభం అవుతుంది. కాటన్ దుస్తులు ఐరన్ చేయడానికి ముందు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంచకూడదు. టెంపరేచర్ ఎక్కువ అయితే...దుస్తులు కాలిపోతాయి. లేదంటే డ్రెస్ ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా.... దుస్తులను తిరగలుతీసి ఆ తర్వాత ఐరన్ చేయడం ఉత్తమం.
underwear
పట్టుచీరలను ఐరన్ చేయడం ఎలా..?
పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఖరీదైన పట్టుచీర పాడైపోయే ప్రమాదం ఉంది. పట్టు చీరను నేరుగా ఇస్ట్రీ పెట్టను తాకవద్దు. దీని కోసం, దానిపై పలుచటి వస్త్రం లేదా టిష్యూ పేపర్‌ను ఉంచి ఇస్త్రీ చేయండి.
పట్టు చీరను ఇస్త్రీ చేసేటప్పుడు, ఉష్ణోగ్రత తక్కువగా ఉంచండి. మీరు ఆవిరి సహాయంతో పట్టు దుస్తులను కూడా ఐరన్ చేయవచ్చు.ఇలా చేయడం వల్ల పట్టు మృదువుగా మెరుస్తూ ఉంటుంది.
ఇస్త్రీ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఏ రకమైన దుస్తులు అయినా ఇస్త్రీ చేసే ముందు, దానిపై ఉన్న లేబుల్ చదవండి. ఇక్కడ దుస్తులు ఉతకడం, ఇస్త్రీ చేసే పద్దతుల గురించి అన్నీ రాసి ఉంటాయి. దుస్తులను ఇస్త్రీ చేసే ముందు వాటి ఉపరితలాన్ని పూర్తిగా శుభ్రం చేయండి. ఎల్లప్పుడూ ఐరన్ బాక్స్ ని కూడా శుభ్రంగా ఉంచండి.
మీరు మొదటి సారి చీరను ఇస్త్రీ చేస్తుంటే, ముందుగా దానిలో కొంత భాగాన్ని ఇస్త్రీ చేయండి. చీరకు ఏమీ కాదు అనుకోనప్పుడే తర్వాత ఐరన్ చేయాలి.