క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ ఎన్నో రికార్టులను బ్రేక్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. అందుకే కింగ్ కోహ్లీకి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ సెంచరీలు బాదడమే కాదు.. తన ఫిట్ నెస్ విషయంలో అస్సలు రాజీ పడరు. అందుకే ఆయన ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటాయి. నిజానికి విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ కు ఐకాన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. జిమ్ లో కోహ్లీ చేసే వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇండియన్ క్రికెటర్లలో ఫిట్నెస్ ట్రెండ్ ను కింగ్ కోహ్లీనే ప్రారంభించాడు. విరాట్ తనను తాను ఫిట్ గా ఉంచుకోవడానికి జిమ్ లో గంటల తరబడి చెమటలు చిందించడమే కాదు కఠినమైన డైట్ ను కూడా ఫాలో అవుతాడట.
విరాట్ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటంటంటే?
ఫిట్ గా ఉండేందుకు ఎంతో కఠినమైన డైట్ ఫాలో అవుతున్నానని విరాట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మీకు తెలుసా? విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఆడేటప్పుడు తనను ప్రభావితం చేసే ఎలాంటి ఆహారాలను తినడట.
విరాట్ కోహ్లీ బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటాడు?
విరాట్ కోహ్లీ బ్రేక్ ఫాస్ట్ చాలా ప్రత్యేకం. కోహ్లీ బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ఆమ్లెట్ తో ఉడకబెట్టిన గుడ్లను తింటారట. అలాగే నల్లమిరియాలు, పాలకూర, పనీర్ సలాడ్ ను కూడా అల్పాహారంగా కింగ్ కోహ్లీ తింటారట.
Virat Kohli
విరాట్ లంచ్ లో ఏం తింటారు?
విరాట్ కోహ్లీ లంచ్ ఎంతో హెల్తీగా ఉంటుంది. ఈ క్రికెట్ స్టార్ తన లంచ్ లో నట్స్, బ్రౌన్ బ్రెడ్, స్వీట్స్ ఉండేట్టు చూసుకుంటారు. అలాగే విరాట్ కోహ్లీ మధ్యాహ్న భోజనానికి ప్రొటీన్ షేక్ ను తీసుకుంటారట. ఈ ఆహారాలన్నీ విరాట్ కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.
Virat Kohli
విరాట్ డిన్నర్ లో ఏం తింటారంటే?
మనలా విరాట్ డిన్నర్ హెవీగా అస్సలు ఉండదు. కింగ్ కోహ్లీ డిన్నర్ చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే విరాట్ రాత్రిపూట రోటీ, పప్పు, ఆకుకూరలను తీసుకుంటారట.
బ్లాక్ వాటర్
విరాట్ బ్లాక్ వాటర్ ను తాగుతారన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బ్లాక్ వాటర్ ను విరాట్ తనను తాను హైడ్రేట్ గా ఉంచుకోవడానికి తాగుతాడు. మీకు తెలుసా? ఈ బ్లాక్ వాటర్ శరీరాన్ని హెల్తీగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే ఈ బ్లాక్ వాటర్ ధర తెలిస్తే షాక్ అవుతారు. ఈ వాటర్ లీటరుకు రూ.3000 నుంచి రూ.4000 ధర వరకు ఉంటుందట మరి.
వ్యాయామం తర్వాత ఏం తింటాడు?
విరాట్ కోహ్లీ వ్యాయామం విషయంలో అస్సలు రాజీ పడడు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తారు. అయితే ఈ క్రికెటర్ వ్యాయామం చేసిన తర్వాత ప్రోటీన్ షేక్స్, సోయా మిల్క్, బటర్ పనీర్ ను తీసుకుంటారట. ఇవన్నీ మన క్రికెట్ స్టార్ ను హెల్తీగా, ఫిట్ గా ఉంచేందుకు సహాయపడతాయి.