మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే వీటిని వదులుకోవాల్సిందే..

First Published | Mar 15, 2022, 11:18 AM IST

Relationship tips: పెళ్లి కాకముందే ఎవరికి నచ్చినట్టు వాళ్లు బతికేది. కానీ పెళ్లి తర్వాత ఇలా ఉండదు. భార్యా భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇద్దరికీ నచ్చే విధంగా బతకాల్సి ఉంటుంది. ముఖ్యంగా వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మాత్రం కొన్ని విషయాలను తప్పక వదులుకోవాల్సి ఉంటుంది.  లేదంటే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 
 

పెళ్లైన కొత్త జంటలు మాత్రమే సంతోషంగా ఉంటాయి. ఒక రెండు మూడేండ్ల తర్వాత వస్తాయి చూడు వాళ్ల మధ్య గొడవలు, తగాదాలు , మనస్పర్థలు వస్తాయంటూ అంటూ కొంత మంది పాత జంటలు భావిస్తూ ఉంటారు. నిజానికి కొత్త జంటైనా.. పాతజంటైనా.. భార్య భర్తల మధ్యన అండర్ స్టాండింగ్ ఉంటే ఎటువంటి కొట్లాటలు, గొడవలూ రావు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఇద్దరూ హ్యాపీగా ఉండాలంటే కొన్ని విషయాలను వదిలేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది. ఇంతకి ఎలాంటి విషయాలను వదులుకోవాల్సి ఉంటుందో తెలుసుకుందాం పదండి. 

అంచనాలొద్దు: నా పార్టనర్ ఇలా ఉండాలి.. అలా ఉండాలంటూ ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇవి మీకు బాగానే అనిపించినా.. మీ భాగస్వామి వాటిని రీచ్ కాలేకపోవచ్చు. దాంతో మీరు బాధపడటమే కాదు.. వాళ్లు కూడా బాధపడాల్సి వస్తుంది. దీనివల్ల మీ మధ్య గొడవలు కూడా జరగొచ్చు. 


నియంత్రణ:  భాగస్వామిని మీ చెప్పుచేతల్లో పెట్టాలనుకోవడం, వారిని ప్రతి విషయంలో నియంత్రించడం, వారికి స్వతంత్ర్యం లేకుండా  ప్రవర్తించడం మీ మధ్య ఎన్నో గొడవలకు దారి తీసే ప్రమాదం ఉంది. 

విమర్శించడం: ఇది మహా చెడ్డ అలవాటు. వీలైతే వారి ప్రవర్తణలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలే కానీ.. వారిని పదే పదే విమర్శిస్తే మాత్రం వారు మీకు దూరమయ్యే అవకాశం ఉంది. 

పొసెసివ్‌నెస్:  మీ భాగస్వామి పట్ల అసూయపడటం మానుకుంటేనే మీ బంధం నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటుంది. లేదంటే మీ బంధం మధ్యలోనే బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. 

ఫిక్సింగ్:  వీలైతే మీ భాగస్వామిని ఎంకరేజ్ చేయండి .  కానీ వారిని విమర్శించకండి. వారిని 'ఫిక్సింగ్' చేయాలనుకుంటే మాత్రం మీ మధ్య గొడవలు రావడం షురూ అవుతాయి. 

నిందలు:  ఏదో ఒక విషయంలో ఒకరినొకరు నిందించుకోవడం వల్ల మీ ఇద్దరికీ కొట్లాటలు తప్ప మరే ప్రయోజనం ఉండదు. నిందలు వేయడం మానుకుని ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతకండి. అప్పుడే మీ లైఫ్ సంతోషంగా సాగుతుంది. 

తప్పును ఒప్పుకోవాలి: జీవితంలో ఎవరూ తప్పులు చేయకుండా ఉండలేరు. అయనా ఎప్పూడు మంచిగానే ప్రవర్తించడమేనేది ఎవరికీ సాధ్యపడదు కూడా. కాబట్టి తప్పు చేసినప్పుడు నిర్మొహమాటంగా మీ తప్పును ఒప్పుకోండి. అప్పడే ఎటువంటి సమస్యా ఉండదు. 

అంటిపెట్టుకునే ఉండటం: జీవిత భాగస్వామి ఎప్పుడూ తమతో ఉండాలని కోరుకుంటారు. కానీ ఎప్పుడూ అనుమానం వచ్చిన వ్యక్తిలా వారినే అంటిపెట్టుకుని ఉండటాన్ని ఎవరూ కోరుకోరు. అలా ఉండటం వారికి ఏమాత్రం ఇష్టం ఉండదు కూడా. 
 

Latest Videos

click me!