తలకు నూనె రాసి స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Jan 16, 2025, 10:10 AM IST

చాలా మంది ఆడవాళ్లు తలకు నూనె పెట్టుకుని ఒక గంటో రెండు గంటల తర్వాతో తలస్నానం చేస్తుంటారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా?

చాలా మందికి తలకు నూనె బాగా రాసుకుని తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఇప్పటిది కాదు.. ఎన్నో ఏండ్లుగా వస్తోంది. నిజానికి ఇలా స్నానం చేయడానికి ముందు నూనె పెట్టడం చాలా మంచిదని పెద్దలు చెప్తుంటారు. 

కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఈ అలవాటు లేకుండా పోతోంది. నిజానికి తలకు నూనె రాసుకుని తలస్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

తలకు నూనె రాసుకుని స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది:

నువ్వుల నూనెను తలకు రాసుకుని తలస్నానం చేయడం మంచిదని చెప్తుంటారు. కాబట్టి సూర్యోదయం తర్వాత వచ్చే చిన్నపాటి ఎండలో తలకు నూనె రాసుకుని  ఒక అరగంట తర్వాత వేడి నీళ్లతో స్నానం చేయాలి. ఒకవేళ మీరు చల్ల నీళ్లతో స్నానం చేస్తే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలా వారానికోసారి తలకు నూనె పెట్టుకుని స్నానం చేస్తే శరీర వేడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

విటమిన్ డి అందుతుంది:

తలకు నూనె రాసుకుని కాసేపు ఎండలో కూర్చోవడం వల్ల మనకు విటమిన్ డి కూడా అందుతుంది. దీంతో మీ ఎముకలు బలంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కళ్లు మండటం, ఎర్రబడటం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇలా స్నానం చేయడం వల్ల చలువ చేస్తుంది. అలాగే మీ జుట్టు కూడా పొడుగ్గా పెరుగుతుంది. 


ఆయిల్ బాత్ తర్వాత చేయకూడనివి

తలకు నూనె రాసుకుని స్నానం చేసిన రోజు ఏం చేయొద్దు

చల్లనివి తినొద్దు

తలకు నూనె రాసుకుని స్నానం చేసిన రోజు మీరు చల్లగా ఉండే ఆహారాలను అస్సలు తినకూడదు. అంటే పెరుగు, ఐస్ క్రీం, కొబ్బరి నీళ్లు వంటి చల్లనివి తినకూడదు. లేదంటే దగ్గు,జలుబు, తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు వస్తాయి.

పగటిపూట నిద్రపోకూడదు

తలకు నూనె రాసుకుని స్నానం చేస్తే వెంటనే బాగా నిద్ర వస్తుంది. కానీ మీరు పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. ఎందుకంటే శరీరంలోని వేడిని తగ్గించడానికే నూనె రాసి స్నానం చేస్తాం. ఆ వేడి మన కళ్ల ద్వారానే బయటకు వెళుతుంది. ఒకవేళ మీరు పగటిపూట నిద్రపోతే గనుక మన శరీరంలోని వేడి బయటకు పోలేక అలాగే ఉండిపోతుంది.

ఈ రోజుల్లో నూనె రాసుకుని స్నానం చేయకూడదు

పౌర్ణమి, అమావాస్య, ఆదివారం, సోమవారం వంటి రోజుల్లో తలకు నూనె పుట్టుకుని తలస్నానం చేయకూడదని చెప్తుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చల్లగా ఉంటుంది. చల్లని రోజుల్లో తలకు నూనె రాసుకుని స్నానం చేస్తే శరీరంలో చలి పెరుగుతుంది. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

గుర్తుంచుకోండి:

- మీ శరీరం చల్లగా ఉంటే గనుక తలకు నూనె పెట్టుకునేటప్పుడు ముందుగా పాదాల నుంచి రాసుకుని, తర్వాత తలకు రాసుకోవాలి. దాని తర్వాత సుమారు 15 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. 

- మీ శరీరం ఇప్పటికే వేడిగా ఉంటే మీరు తల నుండి ప్రారంభించి, తర్వాత పాదాలకు నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాసుకుని స్నానం చేస్తేనే జలుబు చేయదు.

Latest Videos

click me!