మిక్సీల వాడకంతో ఆడవాళ్లకు చాలా పనులు తగ్గాయి. చేతులతో రుబ్బడానికి గంటల సమయం పడుతుంది. మిక్సీలు జస్ట్ రెండు, మూడు నిమిషాల్లో ఎలాంటి దాన్నైనా పిండి పిండి చేస్తాయి. అందుకే దోశ పిండి పట్టడానికి, ఉడకబెట్టిన పప్పును మెత్తగా చేయడానికి, అల్లం వెల్లుల్లిని రుబ్బడానికి మిక్సీలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంతేకాదు మసాలా దినుసులను మెత్తటి పొడిలా చేయడానికంటూ ఎన్నో విధాలుగా మిక్సీలను ఉపయోగిస్తారు. మిక్సీతో పనులు తొందరగా అయిపోయినప్పటికీ.. కొన్ని ఆహారాలను మిక్సీలో మాత్రం వేయకూడదు. ఎందుకు? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.