బాండేజ్ సెక్స్.. అపోహలెందుకు? వాస్తవాలేంటి?

First Published | Dec 30, 2021, 11:10 AM IST

ఇది వికృత చర్య అని.. శృంగారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని.. లైంగిక చర్యల మీద అబద్దపు ప్రచారం చేస్తున్నారని.. ఇలా రకరకాల విమర్శలు వచ్చాయి. అంతేకాదు ఈ బాండేజ్ సెక్స్ మీద అనేక అపోహలు కూడా ఉన్నాయి. పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నట్టుగా శృంగారంలోనూ భావప్రాప్తికి చేసే అనేక రకాల ప్రయత్నాల్లో ఇవీ ఒకటి..

BDSM అని విస్తృతంగా పిలువబడే బాండేజ్ సెక్స్ చాలా క్లిష్టంగా ఉంటుంది. మీరు బహుశా ఊహించిన దానికి భిన్నంగా ఉంటుంది. ఓటీటీ ఫ్లాట్ ఫాంలో వచ్చి ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే ఫ్రాంచైజీని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చూశారు. అంతేకాదు దీనిమీద ఎంతో చర్చ కూడా జరిగింది. 

ఇది వికృత చర్య అని.. శృంగారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని.. లైంగిక చర్యల మీద అబద్దపు ప్రచారం చేస్తున్నారని.. ఇలా రకరకాల విమర్శలు వచ్చాయి. అంతేకాదు ఈ బాండేజ్ సెక్స్ మీద అనేక అపోహలు కూడా ఉన్నాయి. పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నట్టుగా శృంగారంలోనూ భావప్రాప్తికి చేసే అనేక రకాల ప్రయత్నాల్లో ఇవీ ఒకటి..


అయితే ఇది ఎవ్వర్నీ హింసించే ప్రక్రియ కానీ, ఇబ్బందిపెట్టేది కానీ కాదు. భాగస్వాములిద్దరూ పరస్పరం ఇష్టపడితేనే జరిగే చర్య. అందుకే దీని చుట్టూ ఉన్న అపోహలు తొలగిపోతే ఈ ప్రక్రియను ఇష్టపడేవారు ఎంజాయ్ చేస్తారు. అసలు బాండేజ్ సెక్స్ మీద ఉన్న అపోహలు ఏంటి.. అసలు వాస్తవాలేంటి? 

BDSM ఫుల్ ఫాం..
బాండేజ్ సెక్స్ అంటే.. బానిసత్వం,క్రమశిక్షణ, ఆధిపత్యం, సమర్పణ, శాడిజం మసోకిజం అని దీని ఫుల్ ఫామ్ గా Bondage and discipline, dominance and submission, sadism and masochism గా చెబుతారు. 

వాళ్లు కాస్త తేడా...
ఈ శృంగార ప్రక్రియను ఫాలో అయ్యేవారు మామూలుగా ఉండరని.. కాస్త తేడా అనే అపోహ ఉంది. ఇది ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే సిరీస్ తర్వాత హైలైట్ అయిన అపోహ. బాండేజ్ సెక్స్‌ను అభ్యసించే వారు మానసికంగా కలవరపడరు లేదా ప్రజలు ఊహించినట్టుగా తేడాగా ఉండరు.  జడ్జ్ మెంటల్ గా ఉండరు. ఇది అబ్యూస్ చేయడం కాదు. లైంగికత విషయానికి వస్తే వాస్తవానికి ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే.

ఇష్టం లేకపోతే ‘NO’ చెప్పవచ్చు
ఏ శృంగార ప్రక్రియలో లాగానే ఇందులో కూడా ఇష్టం లేకపోతే నో చెప్పే అవకాశం ఉంది. మీకు ఈ బాండేజ్ సెక్స్ ఏ మాత్రం అసౌకర్యంగా ఉన్నా, ఇబ్బందిగా అనిపించినా, భయం వేసినా సింపుల్ గా దీనికి నో చెప్పచ్చు. బాండేజ్ సెక్స్ విషయానికి వస్తే మీరు ఏ కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉన్నారనే దానిపై ఆధారపడి ఇది ఉంటుంది. దీనికి మీ సమ్మతి ముఖ్యం.

sex loud

బాండేజ్ సెక్స్ ప్రాక్టీస్ చేసేవారు ఫిఫ్టీ షేడ్స్‌తో ఏకీభవించరు!
ఫిఫ్టీ షేడ్స్‌ సినిమాల్లో క్రిస్టియన్ గ్రే చేసింది బాండేజ్ సెక్స్ అని మీరు అనుకుంటే, మీరు తప్పుదారి పట్టినట్లే అంటున్నారు దీన్ని ఆచరించే వ్యక్తులు. ఇలాంటి అనారోగ్య సంబంధాలను, అవాస్తవాలను నిజం తెలుసుకోకుండా ఎలా చిత్రీకరిస్తారని కోపానికి కూడా వస్తున్నారు. వీరి ప్రకారం ఇది దుర్వినియోగపరిచేది కాదు. అయితే దీని మీద వస్తున్న పుస్తకాలు కొంతవరకు నయం అసలు అవగాహన కల్పిస్తున్నాయని అంటున్నారు. 

BDSM అనగానే, కొరడాలు, గొలుసులు గుర్తుకొస్తే... 
బాండేజ్ సెక్స్ అనంగానే చేతులు కాళ్లు కట్టేసి.. కొరడాలతో కొట్టడం లాంటి దృశ్యాలు గుర్తుకు వస్తే.. మీరు నిజం తెలుసుకోవాల్సిన టైం వచ్చిందన్నమాట. నిజానికి అది ఒకరిని బంధించి హింసాత్మకంగా చేసేది కాదు. ఇద్దరి అంగీకారంతో అలా చేస్తారు. దీంట్లో హింసించడం ఉండదు. కొరడాలతో రక్తాలు కారేలా కొట్టడం ఉండదు. నొప్పి ఉండదు. 

బాండేజ్ సెక్స్ చుట్టూ ఉన్న ప్రాథమిక అపోహలు ఇవి. ఒకవేళ మీరూ, మీ భాగస్వామి ఎప్పుడైనా ఇలాంటి శృంగారాన్ని ప్రయత్నించాలనుకుంటే... దానికి సంబంధించిన పుస్తకాలు, సమాచారం బాగా తెలుసుకుని ప్రయత్నించండి. అప్పుడే శృంగారపుటంచుల్ని తాకుతారు. 
 

Latest Videos

click me!