ఆరోగ్యకరమైన శృంగారానికి.. ఐదు సూత్రాలు...

First Published | Apr 9, 2022, 12:44 PM IST

భాగస్వాముల మధ్య అనుబంధాన్ని, ప్రేమను, ఆప్యాయతను పెంచడానికి శృంగారం ఓ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అయితే శృంగారంలో ఇద్దరూ ఆనందాన్ని చూసినా.. ఎన్నో విధాలుగా సంతృప్తి పొందినా.. ఇద్దరి మధ్య భావోద్వేగ సాన్నిహిత్యం ఉండడం చాలా ముఖ్యం.

శృంగారంలో భాగస్వాములు ద్దరూ ఆనందాన్ని చూసినా.. ఎన్నో విధాలుగా సంతృప్తి పొందినా.. ఇద్దరి మధ్య భావోద్వేగ సాన్నిహిత్యం ఉండడం చాలా ముఖ్యం. అలాంటి సాన్నిహిత్యం కోసం జంటలు చేయాల్సిన కొన్ని పనులు.. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో ఒకసారి చూడండి. 

మీకేం కావాలో స్పష్టంగా చెప్పండి
సెక్స్ అనగానే రెండు దేహాలు బెడ్ రూంలో చేసే ఓ క్రియ మాత్రమే కాదు.. బెడ్ మీద మీరు ఎలాంటి శృంగారాన్ని కోరుకుంటున్నారు. ఎలా చేస్తే మీ తనువు, మనసు రెండూ సంతృప్తి చెందుతాయో ఒకరికొకరు స్పష్టంగా చెప్పండి. మీ కోరికలు, ఫాంటసీలను ఒకరికొకరు కమ్యూనికేట్ చేసినప్పుడు, శృంగారం మరింత ఆస్వాదించగలుగుతారు. 


ఒకరిపై ఒకరు ఒత్తిడి కూడదు..
శృంగారం సమయంలో ఇంకా ఇంకా యాక్టివ్ గా ఉండాలని.. మీకు నచ్చినట్టే చేయాలని మీ భాగస్వామిపై ఒత్తిడి తీసుకురావడం పని చేయదు. దీనివల్ల మీ మధ్య దూరం పెరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. ముందు మీరు ఎదుటివారికి తగ్గట్టుగా మారి.. మొదలుపెడితే.. అటునుంచి కూడా మీరు ఆశించిన రెస్పాన్స్ వస్తుంది. ముందు మీ శరీరం, ఇంద్రియాలను ట్యూన్ చేసి.. మీ భాగస్వామని రెచ్చగొట్టండి. 

సాన్నిహిత్యానికి ప్రాధాన్యత...
ఇటీవలి కాలంలో జీవితంలో పెరిగిపోతున్న వేగం.. జంటల మధ్య కలిసి గడిపే సమయాన్ని తగ్గిస్తుంది. రోజంతా అలిసిపోయి రాత్రికి ఇంటికి చేరిన తరువాత శృంగారానికి సమయం కేటాయించలేరు. అందుకే మీ మధ్య సాన్నిహిత్యానికి కాస్త సమయం కేటాయించుకోండి. తరచుగా మీ భాగస్వామిని కౌగిలించుకోవడం, శృంగారంలో పాల్గొనడమొక్కటే కాదు.. తరచుగా ఐలవ్యూ అని చెప్పడం.. మీ మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ట్రై చేయండి.. 

తొందరవద్దు
శృంగారంలో క్లైమాక్స్ కోసం ఎప్పుడూ తొందరపడొద్దు. నెమ్మదిగా శరీరంలోని అన్ని ఇంద్రియాలనూ తట్టి లేపుతూ చివరికి క్లైమాక్స్ కు చేరుకోవాలి. దీనికోసం ఫోర్ ప్లే తప్పనిసరి.. ఎందుకంటే ఇది అనే ఇంద్రియాలను ఉత్తేజితం చేసి ఉద్రేకం కలిగిస్తుంది. దీంతో మీ భాగస్వామి కూడా మీతో సమానంగా సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. 

మార్పు గమనించారా..
మీ భాగస్వామి ఇటీవలి కాలంలో శృంగారం అంటే అంత సుముఖత చూపించడం లేదని గమనించారా? బహుశా, వారి మానసిక స్థితి దానికి అంగీకరించడం లేదా? లేదా  మీరే మొదలుపెడతారని వేచి చూస్తున్నారా? సెక్స్ సమయంలో తరచుగా మూడ్‌లో మార్పులు ఉండవచ్చు. సహజం.. అలాంటి సమయాల్లో చక్కటి ముద్దుతోనో, ఓ కౌగిలింతతోనో మీరే ముందడుగు వేయండి.

Latest Videos

click me!