పొరపాటున కూడా మీ ముఖానికి వీటిని పెట్టకండి..

Published : Aug 27, 2022, 04:58 PM IST

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్నింటినీ ముఖానికి అస్సలు అప్లై చేయకూడదు. ఒకవేళ చేస్తే ఎన్నో రకాల సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది.   

PREV
19
పొరపాటున కూడా మీ ముఖానికి వీటిని పెట్టకండి..

చర్మానికి ఏది మంచిదో.. ఏది మంచిది కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంటర్నెట్ లో ఎవరికి తోచిన బ్యూటీ టిప్స్ ను వాళ్లు చెప్తుంటారు. కానీ అవన్నీ మన చర్మానికి మంచివి కాకపోవచ్చు. గుడ్డిగా నమ్మి వాటిని ఫాలో అయితే మాత్రం భారీ నష్టాన్నే మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందులో ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే ముఖానికి అప్లై చేసే వస్తువుల గురించి అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్నింటిని ముఖానికి అస్సలు అప్లై చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

29

వేడినీళ్లు

ముఖానికి వేడినీళ్లను అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే వేడినీళ్లతో ముఖాన్ని కడగడం వల్ల చర్మం తేమను కోల్పోతుంది. ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. అయితే ముఖానికి వేడినీళ్లకు బదులుగా ఆవిరిని పట్టొచ్చు. 

39

లెమన్ వాటర్

నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినా.. వీటిని నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై దురద పెడుతుంది. చర్మవ్యాధి నిపుణుల  అభిప్రాయం ప్రకారం.. ముఖానికి నిమ్మకాయను అప్లై చేయడం వల్ల చర్మం చికాకు పెడుతుంది. ఇది కాస్త చర్మం పొలుసులుగా, పొడిగా మారడానికి దారితీస్తుంది. 

49

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కానీ దీన్ని నేరుగా ముఖానికి అస్సలు అప్లై చేయకూడదు. ఎందుకంటే ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చికాకు పెడుతుంది. అంతేకాదు హైపర్ పిగ్మెంటేషన్, కాలిన గాయాలు, నల్లని మచ్చలు, నల్లబడటం వంటి సమస్యలు వస్తాయి. 
 

 

59

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా చర్మ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్ కు దారితీస్తుంది. 
 

 

69

టూత్ పేస్ట్

టూత్ పేస్ట్ ను పళ్లు తోముకోవడానికే కాదు కాలిన గాయాలను మాన్పడానికి కూడా ఉపయోగిస్తుంటారు. అయితే దీన్ని చర్మానికి పెట్టడం వల్ల చర్మం తెల్లగా మారుతుందని కొంతమంది చెప్తుంటారు. నిజానికి ఇందులో నిజం లేదు. ఎందుకంటే టూత్ పేస్ట్ లో చర్మాన్ని దెబ్బతీసే కెమికల్స్, ట్రైక్లోసాన్, ఆల్కహాల్ వంటివి ఉంటాయి. ఇవి చర్మాన్ని చికాకు పెట్టడమే కాకుండా హైపర్ పిగ్మెంటేషన్, మచ్చలు, కాలిన గాయలను ఏర్పరుస్తుంది. 

79

షాంపూ  

షాంపూలను కేవలం జుట్టుకు మాత్రమే ఉపయోగించాలి. కానీ కొంతమంది పనిలో పనిగా సబ్బులేకపోతే షాంపూనే ముఖానికి రాస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకండి. ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది. 
 

89

బాడీ లోషన్

బాడీ లోషన్ చర్మానికి మేలు చేస్తుంది. కానీ మన శరీర చర్మం, ముఖ చర్మం వేరు వేరుగా ఉంటాయి. ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అయితే బాడీలోషన్ ను ముఖానికి అస్సలు అప్లై చేయకూడదు. దీన్ని ముఖానికి పెట్టుకోవడం వల్ల ముఖం ఆయిలీగా మారుతుంది. 
 

 

99

కూరగాయల నూనె

కూరగాయల నూనె ఆరోగ్యానికి మంచిదే అయినా.. దీన్ని ముఖానికి రాయడం ఏ మాత్రం మంచిది కాదు. ఇది చర్మకణాలను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా కొబ్బరి నూనెను ముఖానికి రాయండి. 
 

Read more Photos on
click me!

Recommended Stories