పురుషులకు ఇందుకే జుట్టు ఊడిపోతుంది..

Published : Apr 11, 2022, 11:53 AM IST

చెడు ఆహారం, బ్యాడ్ హాబిట్స్ వంటి వివిధ కారణాల వల్ల పురుషుల జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టాలంటే మాత్రం ఈ అలవాట్లను మార్చుకోవాల్సిందే. 

PREV
15
పురుషులకు ఇందుకే జుట్టు ఊడిపోతుంది..

అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల మూలంగా జుట్టు రాలుతుంటుంది. 

25

అయితే అబ్బాయిలకు కూడా జుట్టు రాలడానికి ప్రత్యేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన శైలి వంటి అనేక కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంటుంది. 
 

35

మీడియా నివేదికల ప్రకారం.. పురుషుల్లో జుట్టు రాలడానికి మరొక ప్రధాన కారణం ఏంటంటే.. ఈస్ట్రోజెన్ అల్లోపికా. ఇది పురుషుల్లో ఉండే డిటీహెచ్ హార్మోన్ (Dihydrotestosterone)సమతుల్యత క్షీణించడం వల్ల సంభవిస్తుంది.  ఈ కారణంగానే పురుషుకు బట్టతల వస్తుంటుంది.  30 ఏండ్ల వయసులోనే 30 శాతం మంది పురుషులు ఈ హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటున్నారట. 
 

45

హార్మోన్లు మార్పులు కూడా.. అలాగే హెయిర్ పెరుగుదలకు కావాల్సిన హార్మోన్లు తగ్గడం వల్ల కూడా హెయిర్ ఫాల్ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల కూడా జుట్టు ఊడిపోతుందని పలు నివేధికలు స్పష్టం చేస్తున్నాయి. 

55

జన్యుపరమైన కారణం వల్ల కూడా.. జన్యుపరమైన కారణాల వల్ల కూడా జట్టు విపరీతంగా రాలుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్నవయసులో  తెల్లజుట్టు రావడం, బట్టతల రావడం వంటివి జన్యుపరంగా కూడా వస్తాయని స్పష్టం చేస్తున్నారు. 

click me!

Recommended Stories