అంబానీ ఫ్యామిలీకీ ఈ సెలబ్రెటీలు చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా?

First Published | Jun 3, 2024, 9:45 AM IST

 ప్రస్తుతం రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే... ముకేష్ అంబానీ ఇంట్లో ఏ వేడుక జరిగినా.. కొందరు బాలీవుడ్ సెలబ్రెటీలు వెళ్లి సందడి చేస్తూ ఉంటారు.

అంబానీ ఫ్యామిలీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వారి ఇంట్లో ఏ చిన్న పార్టీ జరిగినా అది నేషనల్ న్యూస్ అవ్వాల్సిందే. ఇక.. ముకేష్ అంబానీ కొడుకు, కూతుళ్ల పెళ్లి జరిగితే మరెంత హడావిడిగా ఉంటుంది. ప్రస్తుతం ముకేష్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. జులైలో పెళ్లి జరగనుండగా.. ప్రస్తుతం రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే... ముకేష్ అంబానీ ఇంట్లో ఏ వేడుక జరిగినా.. కొందరు బాలీవుడ్ సెలబ్రెటీలు వెళ్లి సందడి చేస్తూ ఉంటారు.

అంబానీ డబ్బులకు ఆశపడి వీళ్లంతా వెళ్లి.. అక్కడ వాళ్లను ఎంటర్టైన్ చేస్తున్నారు అని విమర్శించేవారు కూడా ఉన్నారు. ఆ విషయంలో ఎంత నిజం ఉందన్న విషయాన్ని పక్కన పెడితే.. కొందరు సెలబ్రెటీలు నిజంగానే అంబానీ కుటుంబానికి బాగా క్లోజ్ అంట. ఆ అభిమానంతోనే వాళ్లంతా.. అక్కడికి వెళ్లి సందడి చేస్తూ ఉంటారట. వాళ్లెవరో ఓసారి చూద్దాం..
 


1.రణబీర్ కపూర్..
అలియాభట్, రణబీర్ కపూర్ ఎక్కువ మందిని ఆహ్వానించకుండా సింపుల్ గా ఇంట్లోనే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  చాలా క్లోజ్ రిలేటివ్స్ మధ్య జరిగిన వీరి పెళ్లికి అంబానీ ఫ్యామిలీ వచ్చింది. రణబీర్, అలియా అంబానీ ఇంటికి వెళ్లడం మీరు చూసే ఉంటారు. కానీ.. వీళ్ల పెళ్లికి కూడా అంబానీ ఫ్యామిలీ రావడం విశేషం. ఎందుకంటే ఆకాశ్ అంబానీ, రణబీర్ కపూర్ లు..బెస్ట్ ఫ్రెండ్స్ అంట. అందుకే వీరి మధ్య అంత బలమైన బంధం ఉంది.
 

2.షారూక్ ఖాన్..

షారుక్ ఖాన్, అతని కుటుంబం మొత్తం అంబానీ కుటుంబం  ప్రతి పెద్ద లేదా చిన్న ఈవెంట్‌కు ఖచ్చితంగా హాజరవుతారు. ఇది మాత్రమే కాదు, అంబానీ కుటుంబం  ఈవెంట్‌లను కూడా షారుక్ ఖాన్ హోస్ట్ చేస్తాడు. ఇషా అంబానీ చాలాసార్లు షారుక్ ఖాన్‌ను బహిరంగంగా ప్రశంసించింది. వీరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. అందుకే.. షారూక్ వెళ్తూ ఉంటారు.
 

సల్మాన్ ఖాన్
 సల్మాన్ ఖాన్‌కి అంబానీ కుటుంబంతో కూడా చాలా ప్రత్యేకమైన బంధం ఉంది. సల్మాన్‌కి బి-టౌన్ పార్టీలకు హాజరు కావడం అంతగా ఇష్టం ఉండదు. సెలబ్రిటీల పెళ్లిళ్లకు కూడా హాజరుకావడం లేదు. అయితే అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన కార్యక్రమాలకు సల్మాన్ తప్పకుండా హాజరవుతారు.
 


కియారా అద్వానీ
కియారా ఇప్పటి వరకు బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ హోదా అందుకోలేదనే చెప్పాలి. కానీ.. అలాంటి కియారా అంబానీ ఫ్యామిలీ ఈవెంట్ రావడంలో పెద్ద విశేషం లేదు. కానీ.. కియారా పెళ్లికి.. ముకేష్ అంబానీ కుమార్తె.. ఇషా అంబానీ హాజరు అయ్యారు.ఎందుకు అంటే... ఇషా అంబానీ, కియారా అద్వానీ.. బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే.. ఇద్దరూ కలిసి కనిపిస్తూ ఉంటారు.

Latest Videos

click me!