లక్కీ చాన్స్‌.. రూ.120కి కిస్, రూ.11కి హగ్... పెరుగుతున్న స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్

First Published | Aug 3, 2024, 8:24 AM IST

చైనాలో ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా లేదా వింతగా జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలోనే భారీగా జనాభా ఉన్న ఈ దేశంలో తరచూ ఏదో వింత ట్రెండ్ వెలుగు చూస్తూ ఉంటుంది. ఇక, చైనా మార్కెట్‌లో అయితే అమ్మకానికి దొరకనిది ఏదీ ఉండది. ఇప్పుడు ముద్దులు, కౌగిలింతల్లాంటివి కూడా అద్దెకు దొరుకుతున్నాయి.

చైనాలో స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఒంటరి యువత దీని వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ సేవల్లో కౌగిలించుకోవడం, కలిసి సినిమాలు చూడటం, ముద్దులు పెట్టుకోవడం, ఇంటి పనిలో సహాయం చేయడం లాంటివి ఇప్పుడు చైనాలో చాలా పాపులర్‌ అయిపోయాయి.

ప్రేమ, స్నేహం చాలా బలమైనవి. ప్రత్యేకించి ప్రేమికుడు/ ప్రేయసి నుంచి వాటిని పొందితే అది అందించే కిక్కు మామూలుగా ఉండదు. ప్రేమికులు ప్రతిచోటా ఉన్న ఈ కాలంలో ఒంటరిగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు, ప్రేమ కూడా అమ్ముడుపోయే వస్తువు అయింది. ఒంటరి యువకుల ఒంటరితనాన్ని దూరం చేసేందుకు చైనాలో ఈ కొత్త ట్రెండ్ మొదలైంది.


అవును, చైనాలో స్నేహితురాళ్లను అద్దెకు తీసుకునే ఆసక్తికరమైన, వివాదాస్పద ధోరణి చాలా వేగంగా విస్తరించింది. ఈ విచిత్రమైన ట్రెండ్ పెరగడానికి ప్రధాన కారణం ఒంటరితనం తొలగించుకోవాలని అనేక మంది యువకులు కోరుకోవడమే. చైనాలోని షెన్‌జెన్ వీధుల్లో అమ్మాయిలు ‘స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ సర్వీస్’ అందించే షాపులు కనిపిస్తున్నాయి. యువత ఈ ట్రెండ్ బాగా ప్రాచుర్యం పొందుతుండటంతో ఈ సర్వీసును వినియోగించుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

గర్ల్‌ఫ్రెండ్స్ కూడా కావాలని కోరుకునే యువకులు చాలా మంది ఉంటారు. ఒంటరి అబ్బాయిల విసుగును పోగొట్టేందుకు చైనాలో సరోగేట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ ఊపందుకుంటోంది. వీధుల్లో యువతులు ప్రేమ, ముద్దులు, కౌగిలింతలు అమ్ముకునే స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం అక్కడ మామూలైపోయింది. 

Cuddle Therapy Helps Reduce Stress And Loneliness

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, చైనాలో స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ వేగంగా పెరిగింది. ముఖ్యంగా ఒంటరి యువత దీనివైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ సేవల్లో కౌగిలించుకోవడం, కలిసి సినిమాలు చూడటం, ముద్దులు పెట్టుకోవడం, ఇతరత్రా సేవలు ఉన్నాయి.

చైనా నివేదికల ప్రకారం, స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్‌ (వీధి స్నేహితురాలు)ని  కౌగిలించుకోవడానికి 1 యువాన్ అంటే సుమారు 11.59 రూపాయలు, ముద్దు కోసం 10 యువాన్లు అంటే 119 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే, కలిసి సినిమా చూడటానికి 15 యువాన్లు (రూ.173.89) వసూలు చేస్తారు. ఇది మాత్రమే కాదు.. ఎవరైనా ఈ స్ట్రీట్‌ గర్ల్‌ఫ్రెండ్‌తో ఇంటి పని చేయాలనుకుంటే, వారు గంటకు 40 యువాన్లు (రూ. 463.71) చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ట్రెండ్ చైనాలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వింత ధోరణి గురించి అనేక నైతిక, సామాజిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్థిక అసమానతలు, మహిళల స్థితిగతుల పరంగా ఇది ఆందోళనకరమని కొందరు చెబుతుండగా, మరికొందరు ఒంటరితనాన్ని ఎదుర్కోవటానికి ఆచరణాత్మక మార్గమని అంటున్నారు.

Latest Videos

click me!