మేఘాల పైనుంచి సూర్యోదయం అయ్యే ఏకైక ప్రదేశం.. ఏపీలోనే, ఎక్కడో తెలుసా?

First Published | Dec 3, 2024, 10:11 AM IST

ఆ సూర్యోదయం చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. మరి అద్భుతమైన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా? మరెక్కడో కాదు… మన ఆంధ్రప్రదేశ్ లోనే.

మనకు పగలు, రాత్రి ఎలా తెలుస్తాయి..? సూర్యుడు ఉదయించిన సమయాన్ని ఉదయంగానూ, అస్తమించిన సమయాన్ని సాయంత్రంగానూ చెబుతాం… అయితే.. సూర్యుడు ఎక్కడ, ఎప్పుడు ఉదయించినా.. మేఘాలను చీల్చుకుంటూ వస్తాడు. కానీ… ఒక్క ప్లేస్ లో మాత్రం.. మేఘాలను చీల్చుకుంటూ కాదు.. మేఘాల పై నుంచి ఉదయిస్తాడు. ఆ సూర్యోదయం చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. మరి అద్భుతమైన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా? మరెక్కడో కాదు… మన ఆంధ్రప్రదేశ్ లోనే.

చలికాలంలో ఎక్కువగా ప్రజలు.. ట్రిప్స్ కివెళ్లడానికి ఇష్టపడతారు.అలాంటివారు.. ఎక్కడెక్కిడికో కాకుండా.. మన ఆంధ్రప్రదేశ్ లోని ఈ అద్భుతమైన ప్రదేశానికి వెళ్లాల్సిందే. అదే.. వనజంగి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మ్యాజికల్ ప్లేస్ అది. మరి, ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం…

వనజంగి అందాలు చూడాలంటే.. కచ్చితంగా డిసెంబర్, జనవరిలో మాత్రమే సాధ్యం. అది కూడా ఉదయం సూర్యోదయం అవుతున్నప్పుడు చూడాలి. ఉదయం 5:30, 6:00 గంటల ప్రాంతాలో చాలా అద్భుతంగా ఉంటుంది. మేఘాలు అన్నీ మన చేతులకే అందుతున్నాయా అన్నట్లుగా  ఉంటుంది. చలికాలంలో అక్కడ టెంపరేచర్ కూడా 15 డిగ్నీలకన్నా తక్కువగానే ఉంటుంది.


Sunrise

వనజంగి  ఎప్పటి నుంచో ఉన్నా.. ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా ఫేమస్ అవ్వడం విశేషం. ముఖ్యంగా ట్రెక్కింగ్ చేసేవారు, సోషల్ మీడియా పుణ్యమా అని ఈ అద్భుతమైన ప్రదేశం గురించి అందరికీ తెలిసింది. మీరు కూడా,.. ఈ డిసెంబర్, జనవరిలో ఎక్కడికైనా చిన్న బడ్జెట్ ట్రిప్ కి వెళ్లాలి అనుకుంటే… ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఆ ప్రదేశంలో అన్ని సౌకర్యాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Latest Videos

click me!