చల్లగాలుల వల్ల దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

Published : Jan 17, 2023, 03:01 PM IST

ఆరోగ్యకరమైన ఆహారం మిమ్మల్ని సంవత్సరం పొడవునా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చలికాలంలో చాలా మంది జలుబు, దగ్గు, ఇతర అలెర్జీల బారిన పడుతుంటారు. అయితే కొన్ని ఆహారాలు ఈ సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. 

PREV
18
చల్లగాలుల వల్ల దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

చలికాలంలో ప్రతి ఒక్కరూ దగ్గు, జలుబు, అలెర్జీ, జ్వరం వంటి సమస్యల బారిన పడుతుంటారు. అయినా శీతాకాలంలో జలుబు సర్వసాధారణం. అయినప్పటికీ కొంతమంది సంవత్సరంలో ఎప్పుడైనా ఈ సమస్య బారిన పడొచ్చు. చల్లని వాతావరణంలో జలుబు, దగ్గుతో పోరాడటానికి కొన్ని రకాల ఆహారాలు బాగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

28

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వెల్లుల్లిలో సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, అల్లిసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే దగ్గు, జలుబును తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

38

పసుపు పాలు

గోల్డెన్ మిల్క్ అని పిలిచే పసుపు పాలు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. అంతేకాదు ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. పసుపు పాలను తరచుగా జలుబుకు వ్యతిరేకంగా ఇంటి నివారణగా ఉపయోగిస్తారు. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. తక్షణ చర్య కోసం మీరు ఈ పసుపు పాలకు నల్ల మిరియాలను కూడా జోడించొచ్చు.
 

48

తులసి

తులసి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఇన్ఫెక్షన్లను దూరం చేస్తూ సహజ రోగనిరోధక వ్యవస్థ బూస్టర్ గా తులసి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఈ కాలంలో తులసిని ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

58

బాదం పప్పులు

రోజూ గుప్పెడు బాదం పప్పులను తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదంటారు ఆరోగ్య నిపుణులు. అవును బాదం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం పప్పుల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు,  దగ్గును తగ్గించే జింక్ అనే ఖనిజం కూడా వీటిలో పుష్కలంగా ఉంటుంది.
 

68

ఉసిరి

ఈ సీజనల్ కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది అద్భుతమైన రోగనిరోధక శక్తిని పెంచే, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. విటమిన్ సి ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. మాక్రోఫేజ్ లు, ఇతర కణాల మెరుగైన పనితీరుకు ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. 

78

నిమ్మకాయ

సిట్రస్ పండైన నిమ్మకాయలో విటమిన్ సి తో పాటుగా బయోఫ్లవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్ సి మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ సి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

88

sweet potato

చిలగడ దుంప

 చిలగడదుంపలలో ఫైబర్, విటమిన్ ఎ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా చిలగడదుంపలను తీసుకోవడం వల్ల మలబద్దకం తగ్గిపోతుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది మంటను తగ్గిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories