Diwali 2021 : మూడే మూడు నిమిషాల్లో.. మూడు ఇంగ్రీడియంట్స్ తో స్వీట్స్ రెడీ...

First Published | Nov 3, 2021, 1:18 PM IST

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వీట్లు బైటినుంచి కొనుగోలు చేయడం కంటే ఇంట్లో తయారు చేసుకోవడమే చాలా సేఫ్. అబ్బా.. అదో పెద్ద పని.. అనుకుంటున్నారా? అందుకే పెద్దగా పనిలేకుండా మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తో చిటికెలో, సులభంగా తయారు చేసుకునే కొన్ని సూపర్ స్పెషల్ స్వీట్స్ మీ కోసం... 

దీపావళి అంటేనే బహుమతులు, బట్టలు, ఇంటికి అందంగా అలంకరించుకోవడం, స్వీట్లు, టపాసులు.. అందుకే పండగ దగ్గరపడుతున్న కొద్దీ వీటి షాపింగ్ లో టైం బాగా గడిచిపోతూ ఉంటుంది. అయితే తీపి లేకుండా ఏ పండుగా పూర్తి కాదు. ఇక దీపావళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వీట్లు బైటినుంచి కొనుగోలు చేయడం కంటే ఇంట్లో తయారు చేసుకోవడమే చాలా సేఫ్. అబ్బా.. అదో పెద్ద పని.. అనుకుంటున్నారా? అందుకే పెద్దగా పనిలేకుండా మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తో చిటికెలో, సులభంగా తయారు చేసుకునే కొన్ని సూపర్ స్పెషల్ స్వీట్స్ మీ కోసం... 

పల్లీ లడ్డూ

​Peanut Laddoo తయారీకి కావలసిన పదార్థాలు - 1 కప్పు వేయించిన వేరుశెనగ, ½ కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి.

తయారీ విధానం 
వేయించిన వేరుశెనగలను గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పల్లీలన్నీ బాగా మెత్తగా అయ్యి.. వాటినుంచి నూనె వస్తుందనిపించేవరకు.. మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయాలి. దీనివల్ల మళ్లీ మీరు విడిగా నెయ్యి వాడాల్సిన అవసరం లేకుండా లడ్డూలను కట్టడంలో ఇది సహాయపడుతుంది. 

ఇప్పుడీ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జార్ లో బెల్లం వేసి మెత్తగా చేసి దాన్ని పల్లీ పొడికి కలపాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి బాగా కలిసేలా కలిపి.. కొంత కొంత మొత్తం తీసుకుని.. చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. 

కొబ్బరి లడ్డూలు

Coconut Balls తయారీకి కావలసిన పదార్థాలు- 500 గ్రాముల తురిమిన కొబ్బరి, 400 గ్రాముల కండెన్స్‌డ్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి.

తయారు చేసే పద్ధతి
ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి తురుము తీసుకుని అందులో.. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాలా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కాస్త కాస్త కండెన్స్ డ్ మిల్క్ కలుపుతూ ఉండల్లా చుట్టుకోవాలి. 

condensed milkను మొత్తం ఒకేసారి కలపవద్దు, ఎందుకంటే మిశ్రమం జిగటగా మారితే లడ్డూలను తయారు చేయడానికి రాదు. లడ్డూ చుట్టిన తరువాత వీటిని మళ్లీ కొబ్బరి పొడిలో దొర్లించి పక్కన పెట్టుకుంటే కొబ్బరి లడ్డూ రెడీ. 

మూంగ్ దాల్ లడ్డూ

కావలసిన పదార్థాలు- 1 కప్పు పెసర పప్పు, ¼ కప్పు పంచదార, ¼ కప్పు నెయ్యి.

తయారు చేసే పద్ధతి.. 
ముందుగా ఒక పాన్‌లో పెసర పప్పు వేసి కొంచెం కరకరలాడే వరకు పొడిగా వేయించాలి. తరువాత పప్పు చల్లారనిచ్చి... బ్లెండర్లో వేసి, పౌడర్‌ చేయాలి. తరువాత 
బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి. పెసరపప్పు పొడి వేసి తరువాత దీనికి యాలకుల పొడి వేసి బాగా కలపాలి. 

ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు పంచదార వేసి బాగా కలపాలి. తరువాత చిన్న చిన్న మొత్తాన్ని తీసుకుని లడ్డూల్లా కట్టాలి. అంతే ​Moong Dal Laddoo రెడీ. 

జీడిపప్పు ఫడ్జ్

కావలసిన పదార్థాలు- 2 కప్పు జీడిపప్పు, 1 కప్పు పంచదార, 500 గ్రాముల ఖోయా.

తయారు చేసే పద్ధతి

జీడిపప్పును బ్లెండర్‌లో వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఓ గిన్నెలో, చక్కెర, ఖోయా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాన్‌లో వేసి మీడియం మంట మీద వేడి చేయాలి. దీనికి  ½ కప్పు నీరు వేసి బాగా కలపాలి. మిశ్రమం చిక్కబడే వరకు కొన్ని నిమిషాలు ఉడికించాలి.

ఇప్పుడు జీడిపప్పు పొడిని వేసి మెత్తగా మిశ్రమంలా కలపండి. ఇది సున్నితంగా చేయడానికి 1 స్పూన్ నెయ్యి కలుపుకోవచ్చు. అవసరాన్ని బట్టి.. ఈ మిశ్రమాన్ని నెయ్యి పూసిన ప్లేట్ లేదా టిన్‌పై తీసి సమంగా వేయండి. అంతా సమానంగా ఉండేల చూడాలి. తరువాత డైమండ్ ఆకారంలో కట్ చేస్తే Cashew Fudge బర్ఫీలు రెడీ.

బాదం బర్ఫీ

కావలసిన పదార్థాలు- 1 కప్పు ఖోయా, ½ కప్పు పంచదార, 1 కప్పు  బాదం పొడి

తయారు చేసే పద్ధతి

ఖోయాను తురిమి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మీడియం మంట ఒక పాన్ పెట్టి.. దానికి తురిమిన ఖోయా, పంచదారలను వేసి.. 4-5 నిమిషాలు ఉడికించాలి. తరువాత మంటను ఆపివేసి, బాదం పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక టిన్ లోకి తీసుకుని మిశ్రమాన్ని ½ అంగుళాల మందంతో సమానంగా ఉండేలా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ టిన్‌ను 3-4 గంటలు లేదా పూర్తిగా సెట్ అయ్యే వరకు పక్కన పెట్టండి. తరువాత 
Almond Barfiలను కట్ చేసి సర్వ్ చేయడమే. 

దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగించాలి.. ఎలాంటి ఆచారాలు పాటించాలి?

Latest Videos

click me!