ఏం చేసినా బరువు తగ్గడం లేదా..? ఈ ఒక్క ఆకుతో చేసిన డ్రింక్ తాగితే చాలు..!

First Published | Jul 27, 2024, 12:18 PM IST

కేవలం ఒక ఆకులతో చేసిన డ్రింక్ తాగడం వల్ల మీరు ఈజీగా బరువు తగ్గగలరని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఆ ఆకు మరేదో కాదు.. మునగాకు.

ఈ రోజుల్లో పెరిగిపోయిన బరువు తగ్గించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  ఏవేవో డైట్ లు, ఏవేవో కసరత్తులు చేస్తూ తిప్పలుపడుతూ ఉంటారు.  కొందరు ఏకంగా తిండి తినడమే మానేస్తూ ఉంటారు. కానీ... కేవలం ఒక ఆకులతో చేసిన డ్రింక్ తాగడం వల్ల మీరు ఈజీగా బరువు తగ్గగలరని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఆ ఆకు మరేదో కాదు.. మునగాకు.
 

మనం సాధారణంగా మునగకాయలను  ఇష్టంగా తింటూ ఉంటాం. కర్రీగానో, సాంబారులోనే వీటికి పెద్దపీట వేస్తూ ఉంటాం. కానీ, మునగాకులను మాత్రం పట్టించుకోరు. కానీ.. ఈ మునగాకులు మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  ఈ మునగాకులో....  ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మునగాకులను ఎండపెట్టి.. ఆ పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల.. సులభంగా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా..? నిజంగా బరువు తగ్గడానికి మ్యాజిక్ చేస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...



1.బరువు తగ్గాలి అనుకునేవారు ముందుగా ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. అలాంటి ఫైబర్ మునగాకులో పుష్కలంగా ఉంటుంది.  అందుకే.. మునగాకు నీరు తీసుకుంటే.. శరీరానికి అవసరం అయిన 12శాతం ఫైబర్ అందుతుంది. దీని వల్ల.. మీ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. వేరే క్రేవింగ్స్ రాకుండా ఆపుతుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

2.బరువు తగ్గాలి అనుకునేవారి గట్ ఆరోగ్యం చాలా బాగుండాలి. అదే.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అది.. ఈ మునగాకు పొడి నీటితో చాలా సులభం అవుతుంది.  మునగాకు నీరు మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను బహిష్కరిస్తుంది. 

3. మునగాకు వాటర్‌లోని ఫైబర్ కంటెంట్ ఆకలిని అరికట్టడంలో సహాయపడుతుంది, ఆ ఇబ్బందికరమైన కోరికలు మీ పురోగతిని నాశనం చేయకుండా మీ డైట్ ప్లాన్‌కు కట్టుబడి ఉండటం సులభం చేస్తుంది.
 

moringa leaves

4. మెటబాలిజం మెరుగుపడినప్పుడే.. బరువు ఈజీగా తగ్గగలం. అది మునగాకు వాటర్ వల్ల సహాయపడుతుంది.  దీనిలోని పీచు జీవక్రియను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది, వేగంగా కేలరీలను బర్నింగ్ చేయడంలో సహాయపడుతుంది. 

మరి.. ఈ మునగాకు వాటర్ ని ఎలా తయారు చేసుకోవాలి..? దానిని ఎలా తాగాలో చూద్దాం...
రెండు గ్లాసుల నీటిని మరిగించండి. 1-2 టేబుల్ స్పూన్ల మునగాకు పొడి, చిటికెడు రాక్ సాల్ట్ , తేనె  ఒక స్పూన్ వేసి  బాగా కలపండి . అంతే... ఈ వాటర్ తాగడమే.  ఈ డ్రింక్... వల్ల ఎక్కువ ప్రయోజనాలు రావాలి అంటే.. ఉదయం పూట తాగడం బెటర్. కావాలంటే... డిన్నర్ ముందు లేదంటే తర్వాత అయినా తాగొచ్చు. కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు  మాత్రమే తాగడం మంచిది. 

Latest Videos

click me!