ఈ జ్యూస్ తాగితే 15 రోజుల్లో జుట్టు రాలడం ఆగి.. పొడుగ్గా పెరుగుతుంది

First Published | Dec 24, 2024, 10:55 AM IST

జుట్టు ఊడిపోకుండా ఉండటానికి ఎన్నో రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను వాడినా ఫలితాన్ని పొందని వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు ఒక జ్యూస్ ను తాగితే మంచి ఫలితం ఉంటుంది. 

hair fall

ఒక్క ఆడవారికే కాదు మగవారికి కూడా జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ ఒక కామన్ సమస్యగా మారిపోయింది. ఇక ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొంతమంది హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటుంటే మరికొందరు మాత్రం కెమికల్స్ ఉండే యాంటీ హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతున్నారు. 

నిజానికి జుట్టు రాలడాన్ని సహజంగా ఆపడమే మంచిది. దీనివల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అయితే ఒక జ్యూస్ ను తాగితే మాత్రం జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుందట. అలాగే 15 రోజుల్లో జుట్టు పెరగడం కూడా ప్రారంభమవుతుంది. ఇంతకీ ఆ జ్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

జుట్టు రాలడాన్ని ఆపే జ్యూస్

నిపుణుల ప్రకారం.. ఈ డ్రింక్ ను గనుక మీరు ఒక 15 రోజుల పాటు తాగితే జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. అలాగే కొత్త జుట్టు వస్తుంది. ఈ జ్యూస్ కోసం ఉసిరి, బీట్ రూట్ తో పాటుగా కొన్ని పదార్థాలను ఉపయోగిస్తారు. ఈ డ్రింక్ జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టుకు ప్రాణం పోస్తుంది. అలాగే జుట్టును హెల్తీగా మారుస్తుంది. 


జుట్టు రాలకుండా చేసే జ్యూస్ ను తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు

ఒక బీట్ రూట్ 
అల్లం - 1 అంగుళం ముక్క
ఉసిరికాయ-ఒకటి
కరివేపాకు - 10-12 ఆకులు
నీళ్లు - 1 గ్లాసు

డ్రింక్ ను ఎలా తయారుచేయాలి? 

ముందుగా అల్లం, బీట్ రూట్ తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. అలాగే ఉసిరికాయ గింజల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఈ మూడింటితో పాటుగా కరివేపాకులను మిక్సీలో వేటి ఒక గ్లాసు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. అంతే జ్యూస్ రెడీ అయినట్టే. దీన్ని  మీరు ఒక 15 రోజుల పాటు తాగితే మీ జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు ఫాస్ట్ గా పెరగడం స్టార్ట్ అవుతుంది. 
 

బీట్ రూట్ ప్రయోజనాలు: బీట్ రూట్ కేవలం మన జుట్టుకు మాత్రమే కాదు మన మొత్తం శరీరానికి మేలు చేస్తుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, షైనీగా చేస్తుంది. జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. 

అల్లం ప్రయోజనాలు:  అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది జుట్టు బలాన్ని కూడా బాగా పెంచుతుంది. 
 

ఉసిరికాయ ప్రయోజనాలు: ఉసిరి మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే వెంట్రుకలు నల్లగా ఉండేలా, తెల్ల వెంట్రుకలు రాకుండా ఆపడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది జుట్టు పొడుగ్గా పెరిగేందుకు, జుట్టు సమస్యలను తగ్గించేందుకు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

కరివేపాకు ప్రయోజనాలు: కరివేపాకు తెల్ల వెంట్రుకలు రాకుండా ఆపడంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వెంట్రుకలు బలంగా ఉంటాయి. 

Latest Videos

click me!